టాటా టియాగో మొదటి భారీ ప్రమాదం: నుజ్జునుజ్జయిన టియాగో

Written By:

ప్యాసింజర్ కార్ల మార్కెట్లో రాణించడం కొన్ని సంస్థలకు కత్తి మీద సాములా మారింది. అయితే టాటా మోటార్స్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా టియాగో విడుదలైనప్పటి నుండి నిలకడగా నెలకు 5,000 యూనిట్ల వరకు విక్రయాలు సాధిస్తోంది. అయితే కార్లు అధిక సంఖ్యలో రోడ్డెక్కేకొద్దీ ప్రమాదాలు రేటు పెరిగే అవకాశం. కాబట్టి టియాగో కూడా ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో టాటా టియాగో నుజ్జునుజ్జుయిపోయింది.

ఎన్నో ఏళ్ల తరువాత టాటా మోటార్స్ ఉనికి తెలిపే విధంగా టియాగో విక్రయాలు సాగిస్తూ వస్తోంది. విడుదలయ్యి ఏడాది దాటినా పెద్దగా ఊహించిన స్థాయిలో టియాగో మోడల్ కారు ప్రమాదానికి గురికాలేదు. అయితే ఈ మధ్య తమిళనాడులో జరిగిన ప్రమాదంతో టియాగో యొక్క ధృడత్వం ఏమిటో తెలిసిపోతుంది.

టియాగో ప్రమాదానికి కారణం ఓ ట్రక్కు అని తెలిసింది. ముందు వెళుతున్న ట్రక్కును అధిగమించే క్రమంలో కారు ఎడమ భాగం ట్రక్కును ఢీకొని ఆ తరువాత పల్టీలు కొట్టి ఆగిపోయింది.

ఈ ప్రమాదంలో కారు ఎడమవైపు పూర్తిగా ధ్వంసం కాగా, కుడి వైపు ఏమీ కాలేదు. ప్రమాదం జరిగిన అనంతరం కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు చక్కగా పనిచేయడంతో చిన్న చిన్న గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.

కారు నుజ్జు నుజ్జుఅయిన తీరును చూస్తే, కారు వేగం మరియు ప్రమాదానికి కారణమైన ట్రక్కు పాత్ర ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ టాటా మోటార్స్ ఇందులో అందించిన భద్రత ఫీచర్లు ప్రయాణికులను పెద్ద ప్రమాదం నుండి గట్టెక్కించాయి.

టాటా టియాగోలో ఉన్న భద్రత ఫీచర్లు

టాటా టియాగోలోని టాప్ ఎండ్ వేరియంట్లో ఆశాజనకమైన భద్రత ఫీచర్లున్నాయి. అవి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయి.

భద్రత పరంగా గ్లోబర్ ఎన్‌సిఎపి వారు నిర్వహించే క్రాష్ పరీక్షల్లో టాటా తమ టియాగోను పరీక్షించలేదు. ఎన్ని భద్రత ఫీచర్లు ఉన్నప్పటికీ నిర్మాణం పరంగా ధృడత్వాన్ని పరీక్షించడం మరియు ప్రమాణాలకు లోబడి కారు బాడీని తయారు చేయడం తప్పనిసరి.

సాంకేతికంగా టాటా టియాగోలో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వేరియంట్లు కలవు. పెట్రోల్ టియాగోను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ అదే విధంగా డీజల్ టియాగోను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.
Picture credit: Team-BHP 

 

English summary
Read In Telugu About Tata Tiago First Crash Reported. Tata Tiago safety features and more
Please Wait while comments are loading...

Latest Photos