లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

భారతదేశంలో చాలామంది ప్రజలకు కారు కొనడం అనేది ఎప్పుడు పెద్ద విషయమే. అంతే కాకుండా చాలా మందికి కారు కొనడం అనేది ఒక కలగానే ఉంటుంది. ఒక సాధారణ కుంటుంబంలో ఉండే వారు కారు కొనడం అంటే కొత్త కుటుంబ సభ్యుడిని స్వాగతించడం లాంటిదే. ఇది ఆ కుటుంబంలో చాలా సంతోశాన్ని నెలకొల్పుతుంది. ఒక కొడుకు తన తల్లి, తండ్రులకు కారు కొనిచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు.

లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

ఒక కొడుకు టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌తో తన తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచే వీడియో ఇక్కడ మనం చూడవచ్చు. అతడు తన తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచేందుకు స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. మొదటి పూజ చేయాలనీ షోరూమ్‌కి రావాలని స్నేహితుడు ఆ తల్లిదండ్రులను పిలుస్తాడు. తల్లిదండ్రులు షోరూమ్‌కు చేరుకున్నప్పటికే కారు డెలివరీకి సిద్ధమైంది. ఆ కారు తన కొడుకుదే అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అంతే కాకుండా వారు ఆ ఆనందంలో కొంత భావోద్వేగానికి గురవ్వడం కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

టాటా టియాగో భారత మార్కెట్లో నుండి అత్యంత సరసమైన కార్లలో ఒకటి. ఇది బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించబడింది. అంతే కాకుండా ఈ కారు కొన్ని కొత్త ఫీచర్స్ వంటివి కూడా కలిగి ఉంది.

MOST READ:భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన చేసిన జాగ్వార్, వివరాలు

లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

టాటా టియాగో ధృడంగా ఉండటమే కాకుండా మంచి నాణ్యతను కూడా కలిగి ఉంటుంది. ఈ కారు అధికారికంగా గ్లోబల్ ఎన్‌సిఎపి భద్రతా పరీక్ష ఏజెన్సీ నుండి 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ విభాగంలో ఇది సురక్షితమైన కార్లలో ఒకటి. టాటా టియాగో యొక్క బేస్ వెర్షన్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడిని ప్రామాణిక లక్షణాలుగా అందిస్తుంది. అలాగే ఇది బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.

లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

టాటా టియాగో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లను మార్కెట్లోకి అడుగుపెట్టింది. కాని ఇది బిఎస్ 6 అప్‌డేట్ తరువాత, హ్యాచ్‌బ్యాక్‌తో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 84 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలను పొందుతుంది.

MOST READ:కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్ షురూ

టాటా టియాగో యొక్క టాప్-ఎండ్ వెర్షన్ నావిగేషన్ సిస్టమ్‌ను అందించే కనెక్ట్ టెక్స్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. నవీకరించబడిన టియాగో ఇప్పుడు ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది.

లాక్‌డౌన్‌లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో టాటా తన ఆన్‌లైన్ లో అమ్మకాలు జరపడానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులు కారును సొంతం చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్ లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. అన్ని డాక్యుమెంటేషన్‌లు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. అన్ని పూర్తయిన తరువాత కారును హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది.

Image Courtesy: JS Films/YouTube

MOST READ:కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ , ఏంటో తెలుసా..!

Most Read Articles

English summary
Son gifts Dad a Tata Tiago during lockdown: Emotions all around [Video]. Read in Telugu.
Story first published: Saturday, June 6, 2020, 12:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X