యాక్సిడెంట్‌లో నుజ్జునుజ్జైన టాటా టియాగో కారు.. ప్రాణాలతో బయటపడ్డ ఓనర్ ఏం చేశాడో తెలుసా..?

మనిషి తన జీవితంలో ఏదైనా ఒక బ్రాండ్‌ నచ్చితే దానికి కట్టుబడి ఉంటారు. ఆ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్తవి రిలీజ్ అయితే వెంటనే పరుగెత్తుకుంటూ పోయి వాటి గురించి తెలుసుకుంటారు. ఇక అవి నచ్చినట్లైతే వెంటనే కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా వాహన ప్రియులకు ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది.

తాము వాడుతున్న వాహనంలో కొత్త అప్డేట్ వచ్చిన ప్రతిసారీ కొందరు తమ వాహనాలను మారుస్తూనే ఉంటారు. ఇలాంటి ఓ అరుదైన ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. తాజాగా ఓ వ్యక్తి ఉపయోగిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో అదే సంస్థకు చెందిన మరో వాహనాన్ని ఆ వ్యక్తి కొనుగోలు చేసిన చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Tata-Tiago-Crash

ఒడిశాకు చెందిన ఓ వ్యక్తికి చెందిన టాటా టియాగో కారు బోల్తా పడి ప్రమాదానికి గురైంది. దీంతో అతను మళ్లీ టాటా మోటార్స్ షోరూమ్ కు వెళ్లి నెక్సాన్ కారును కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఇటీవల అతను ప్రయాణిస్తున్న కారు ఓ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారు ఏమాత్రం పనికిరాకుండా పోయింది.

మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను తప్పించబోయిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అకస్మాత్తుగా బైక్ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అతను వెల్లడించాడు. ఈ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైనప్పటికీ కారు యజమాని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. చిన్నపాటి గాయాలతో అతను బయటపడ్డాడు.

Tata-Tiago-Car

కారు బోల్తా పడినప్పటికీ కారు డోర్ తెరవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని యజమాని తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్ పనిచేస్తుందో లేదో తెలియదని అన్నాడు. తన ప్రాణాలను కాపాడిన టాటా కంపెనీపై అభిమానంతో నెక్సాన్ ను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. టాటా మోటార్స్ కు చెందిన చాలా కార్లకు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించాయి.

గ్లోబల్ NCAP ప్రకారం టాటా టియాగో తన విభాగంలో ఆకట్టుకునే భద్రతా రేటింగ్‌ని సాధించింది. ఈ కారు క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్‌ని సాధించింది. టాటా మోటార్స్ భారతదేశంలో సేఫ్టీ-రేటెడ్ మోడళ్లను అందిస్తుంది. టాటా టియాగో, టిగోర్ నాలుగు-స్టార్ సేఫ్టీ రేటింగ్ లను కలిగి ఉండగా.. టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్ పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లను కలిగి ఉంది.

Tata-Tiago-Car-Accident

హారియర్, సఫారీ వంటి వాహనాలకు సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అనేక మంది టాటా మోటార్స్ కార్ల యజమానులు తమ వాహనాల అసాధారణ నిర్మాణ నాణ్యతపై ప్రశంసలు కురిపించారు. చాలా మంది వ్యక్తులు తాము ఎదుర్కొన్న ప్రమాదాల గురించి చాలా వేదికల్లో పంచుకున్నారు. టాటా కార్లలోని భద్రత ఫీచర్లు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ప్రశంసించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 4, 2023, 15:56 [IST]
English summary
Tata tiago owner buys tata nexon car after he met an accident on tiago
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+