కారవాన్‌గా టాటా యోధా పికప్ ట్రక్.. లోపల స్టార్ హోటల్ తరహా సౌకర్యాలు.. ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే..!
భారత్‌లో ప్రస్తుతం కారవాన్, మోటార్‌హోంల ప్రభావం పెద్దగా లేదు. అయితే కరోనా తర్వాత ఈ తరహా సంస్కృతి పెరుగుతూ వస్తోంది. రోడ్ ట్రిప్‌ల కోసం కొంత మంది తమ కార్లను మోటార్ హోంలుగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ వాహనాలను కారవాన్‌లుగా మార్చేందుకు నిపుణులతో కూడిన అనేక గ్యారేజీలు, వర్స్‌షాప్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
అలాంటి గ్యారేజీల్లో మోటార్‌హోం అడ్వెంచర్స్ సంస్థ ప్రసిద్ది చెందింది. గత 25 సంవత్సాలుగా ఈ సంస్థ కార్లు, ట్రక్కులను కార్‌వాన్‌లుగా మారుస్తోంది. ఈ సంస్థ ఇటీవల టాటా యోధా కారును (Tata Yodha) అద్భుతమైన కారవాన్‌గా మార్చింది. ఈ వీడియోను మోటార్‌హోం అడ్వెంచర్స్ (Motorhome Adventures) సంస్థ తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వాహనం వీడియో వైరల్ అవుతోంది.

మోటార్‌హోం సంస్థ ఈ కారవాన్‌ను రూపొందించేందుకు టాటా యోధా పికప్ ట్రక్కును ఎంచుకుంది. అయితే యోధా ముందు భాగం యధావిధిగా ఉంచారు. కారు మొత్తం గన్‌మెటల్ గ్రే కలర్‌లో పెయింటింగ్ వేయడాన్ని గమనించవచ్చు. ఈ రంగు కారును అవుట్డోర్సి రూపాన్ని అందించింది.
ఈ కారులో డ్రైవర్ క్యాబిన్, స్టోరేజీ స్పేస్ సౌకర్యవంతంగా ఉంది. ఈ కారవాన్‌కు రెండు వైపులా స్లైడింగ్ విండోస్ ఏర్పాటుచేశారు. ఈ వాహనం 6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. మరియు సుమారు 270 లీటర్ల మంచినీటి ట్యాంక్ ఇన్‌లెట్‌ను గమనించవచ్చు.

ఈ కారవాన్ బాడీ అల్యూమినియంతో తయారు చేశారు. ఈ వాహనం ముందు, వెనుక భాగంలో మార్కర్ ల్యాంప్‌లు అమర్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా స్థలాన్ని సర్దుబాటు చేసే విధంగా బెడ్‌ను ఏర్పాటుచేశారు. అయితే బెడ్ కోసం స్లయిడ్ ఇన్ కారవాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కారవాన్ వెనుక భాగంలో రెండు స్పేర్ వీల్స్ ఉన్నాయి. మరియు 16 అంగుళాల ప్రొఫైల్ టైర్లతో స్టీల్ రిమ్‌లను కలిగి ఉంది. దీంతోపాటు కారవాన్‌పైకి చేరుకొనేందుకు ప్రత్యేకంగా నిచ్చెనను ఏర్పాటుచేశారు. దీంతోపాటు కారవాన్ సహా టాటా యోధా వాహన అవసరాల కోసం.. ముందుభాగంలో 100Ah బ్యాటరీలను అమర్చారు. వీటిలో ఒక బ్యాటరీ టాటా యోధా అవసరాల కోసం కాగా.. మరో రెండు కారవాన్ కోసం అమర్చారు.

ఈ వీడియోలో ఉన్న కారవాన్‌కు మంచినీరు, గ్యాస్ కనెక్షన్ పాయింట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు కారవాన్ క్యాబిన్ లోపలికి చేరుకొనేందుకు ఫోల్డబుల్ నిచ్చెనను ఏర్పాటుచేశారు. అలాగే కారవాన్ వినైల్ ఫ్లోరింగ్‌తో వస్తుంది. ఈ వాహనం పైకప్పునకు LED లైట్లను అమర్చారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా తయారుచేసినట్లు తెలుస్తోంది.
దీంతోపాటు వాష్ రూం కూడా ఎంతో విలాసవంతంగా ఉంటుంది. ఎఫ్‌ఆర్‌పీ టాయిలెట్, సింక్ సహా ఇతర అధునాతన సౌకర్యాలను కలిగి ఉంటుంది. వాష్‌రూంకు పక్కగానే దుస్తులు సహా ఇతర సామగ్రి పెట్టేందుకు వీలుగా స్థలం ఉంటుంది. ఈ కారవాన్‌లో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. దీంతోపాటు ఆహారాన్ని నిల్వ చేసేందుకు వీలుగా ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

అయితే ఇటువంటి కార్‌వాన్‌లు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉంటాయి. అందువల్ల వీటి ధర ఎంతనేది కచ్చితంగా వెల్లడించే అవకాశం లేదు. అయితే ఈ వీడియోలో ఉన్న కారవాన్ మాత్రం అన్ని సౌకర్యాలను కలిగి ఉంది. మరియు క్యాబిన్‌ను చాలా విలాసవంతంగా రూపొందించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








