మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

టాటా జెస్ట్.. ఈ కాంపాక్ట్ సెడాన్ గురించి మార్కెట్లో చాల కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2014 సంవత్సరంలో మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ సెడాన్ ఇది. అప్పట్లో కేవలం రూ.4.64 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ఇది మార్కెట్లో సరసమైన కాంపాక్ట్ సెడాన్‌గా ఉండేది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో టాటా మోటార్స్ నుండి లభిస్తున్న టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌కి ముందు టాటా జెస్ట్ సెడాన్ అందుబాటులో ఉండేది. టాటా జెస్ట్ కారులో ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లు మరియు మెరుగైన సేఫ్టీ ఫీచర్లు ఉండేవి. అయినప్పటికీ, ఈ మోడల్ మార్కెట్లో ఆశించిన విజయాలను సాధించలేకపోయింది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

బోరింగ్ ఇండికా డిజైన్‌కు స్వస్తి పలుకుతూ, సరికొత్త ఫీచర్లు మరియు డిజైన్‌తో కంపెనీ ఈ కారును తయారు చేసింది. ఆ సమయంలో మార్కెట్లో ఉన్న ఇండికా విస్టా మరియు మంజా మోడళ్లను తయారు చేసిన ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌ని ఆధారంగా చేసుకొని కంపెనీ తమ బోల్ట్ మరియు జెస్ట్ మోడళ్లను తయారు చేసింది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా వచ్చినదే ఈ టాటా జెస్ట్ సెడాన్. ఈ రెండు మోడళ్లు ఒకే రకమైన ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడ్డాయి. ఫలితంగా, వీటిలో ఉపయోగించిన పరికరాలు, ఇంజన్ ఆప్షన్లు మరియు ఫీచర్లు కూడా ఇంచు మించు ఒకేలా ఉండేవి. టాటా యొక్క కొత్త డిజైన్ వెర్షన్ 'డిజైన్‌నెక్స్ట్' ఆధారంగా ఈ కార్లను తయారు చేశారు.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవుతో రూపొందించబడిన టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ కూడా, ఈ సెగ్మెంట్లోని ఇతర కార్ల మాదిరిగానే పన్ను మినహాయింపులను పొందింది. ఫలితంగా, కంపెనీ సరసమైన ధరకే ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టగలిగింది. ఈ కాంపాక్ట్ సెడాన్‌లో మంచి క్యాబిన్ స్పేస్ లభించేది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

టాటా జెస్ట్ పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,706 మిమీ, ఎత్తు 1,570 మిమీ, వీల్‌బేస్ 2,470 మిమీ, 390 లీటర్ల బూట్ స్పేస్ మరియు బరువు 1115 కిలోలుగా ఉంటుంది. ఆ సమయంలో కంపెనీ ఈ కారులో అనేక ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లను ఆఫర్ చేసింది. టాటా జెస్ట్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్‌లు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉండేవి.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ అయినప్పటికీ, దీని ముందు మరియు వెనుక భాగంలో తగినంత లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్‌తో కూడిన విశాలమైన క్యాబిన్‌ను టాటా అందించింది. ఈ విభాగంలో మొదటిసారిగా, జెస్ట్ కారులో కంపెనీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఎల్ఈడి టెయిల్ లైట్లను పరిచయం చేసింది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

అంతేకాకుండా, టాటా జెస్ట్ కారులో పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్, ఫోల్డబుల్ కీ, హర్మన్ యొక్క ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ మరియు మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కంపెనీ ఈ కారులో అందించింది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

టాటా జెస్ట్ కారుని మొత్తం 3 ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేశారు. ఇందులో రివోట్రాన్ 1.2 లీటర్ పెట్రోల్ టర్బోచార్జ్డ్ ఎమ్‌పిఎఫ్ఐ, టర్బోచార్జ్డ్ క్వాడ్‌జెట్ 75 డీజిల్ మరియు క్వాడ్రోజెట్ 90 టర్బోచార్జ్డ్ డీజిల్ విజిటి ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

ఇందులోని 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 90 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750-3,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 140 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసేది. అలాగే, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1,750-3,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 190 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసేది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

ఇకపోతే, క్వాడ్రోజెట్ 90 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 90 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1,750-3,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేంది. టాటా జెస్ట్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని కూడా ప్రవేశపెట్టింది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

అదే సమయంలో, మల్టీ-డ్రైవ్ మోడ్‌లు కొత్త ఇంజన్‌తో కంపెనీ ఈ కారును పరిచయం చేసింది. మరింత శుద్ధీకరణ, పనితీరు మరియు ఇంధన వ్యవస్థను మెరుగుపరచే ఈ ఇంజన్‌తో పాటుగా జెస్ట్ కారులో స్పోర్ట్, ఎకో మరియు సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉండేవి. ఇది ఈ సెగ్మెంట్‌లో కెల్లా మొదటి ఫీచర్ కావటం విశేషం.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించేంది. సేఫ్టీ విషయానికి వస్తే, టాటా జెస్ట్ కారులో అనేక ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లు లభించేవి. అంతేకాదు, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన మోడల్ కూడా ఇది.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో కార్నింగ్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంప్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు లభించేవి.

మీకు టాటా జెస్ట్ సెడాన్ గుర్తుందా..? మరి దాని వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా?

ఈ కారులో ఆఫర్ చేసిన సెగ్మెంట్ ఫస్ట్ స్మార్ట్ ఫీచర్లు, అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు మరియు మూడు ఇంజన్ ఆప్షన్లు ఇలా.. ఏ రకంగా చూసుకున్న టాటా జెస్ట్ అప్పట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమైన కార్లలో మొదటి స్థానంలో ఉండాలి. కానీ, ఆ సమయంలో టాటా కార్లపై ప్రజల్లో విశ్వాసం తక్కువగా ఉండటమే టాటా జెస్ట్ వైఫల్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Tata zest the best and the first in class compact sedan of the era
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X