కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువ మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. అంతే కాకుండా ఈ మహమ్మారి కారణంగా చాలా వ్యాపారాలు మూసివేయబడ్డాయి. ఈ కారణంగా ప్రజలు జీవనోపాధి కోసం కొత్త వ్యాపారాలు మరియు వెంచర్లను ప్రారంభిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఫలితంగా వేలాది టాక్సీ మరియు క్యాబ్ డ్రైవర్లు నిరుద్యోగులుగా మారారు.

కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

కరోనా కారణంగా ఆదాయ వనరులు లేనందున, క్యాబ్ డ్రైవర్లు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో వందలాది క్యాబ్ డ్రైవర్లు ప్రస్తుతా జీవనోపాధికోసం పండ్లు, జ్యుస్ వంటివి అమ్మడం ప్రారంభించారు. టాక్సీ డ్రైవర్లు తమ టాక్సీలలో జ్యుస్ తయారుచేసే యంత్రాలు మరియు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది కొత్త ప్రస్తుత కాలంలో మంచి ఆదాయ వనరుగా మారింది.

కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

హైదరాబాద్‌లో చాలా మంది టాక్సీ డ్రైవర్లు బ్యాంకు లోన్ లలో టాక్సీ కొనుగోలు చేయడం జరిగింది. ఎటువంటి ఆదాయం లేకుండా బ్యాంకు లోన్ తిరిగి కట్టడం చాలా కష్టతరమైన పని. ఆదాయం లేకపోయినా వడ్డీని తిరిగి చెల్లించడం కచ్చితంగా కస్టమర్ యొక్క బాధ్యత.

MOST READ:చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్

కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం చాలా మంది క్యాబ్ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్లు గడువు ముగిశాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగియడంతో ఓలా మరియు ఉబర్ తమ డ్రైవర్ల ఐడిలను బ్లాక్ చేశారు. ఈ డ్రైవర్లు యొక్క బుకింగ్‌లను అంగీకరించలేరు.

కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

ఓలా, ఉబర్ వంటి సంస్థలు లైసెన్స్ పొందిన క్యాబ్ డ్రైవర్లను బ్లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గడువు ముగిసిన వాహనానికి సంబంధించిన అన్ని పత్రాల చెల్లుబాటు వ్యవధిని సెప్టెంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

MOST READ:భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కొంత ఉపశమనం ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన్ మిత్రా పథకం కింద మొత్తం రూ. 2662 కోట్లు ఆటో, టాక్సీ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం 2,62,493 డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ ప్రజల జీవితాలపై ఎక్కువ ప్రభవాన్ని చూపించింది.

Most Read Articles

English summary
Taxi Drivers in Hyderabad sells fruit and juice in vehicles during Coronavirus Pandemic. Read in Telugu.
Story first published: Monday, June 29, 2020, 17:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X