కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

ఒక 'స్త్రీ'కి మాతృత్వం అనేది తన జీవితంలో మరచిపోలేని మధురమైన అనుభూతి. మాతృత్వాన్ని భారతదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు గౌరవిస్తున్నాయి. భారతదేశం వంటి దేశాల్లో అయితే చాలామంది కార్ డ్రైవర్లు గానీ, ఆటో డ్రైవర్లు గానీ ఎటువంటి చార్జీలు వసూలు చేయకుండానే వారికి కావలసిన సేవలను అందిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో దీనికి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి సంఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

నివేదికల ప్రకారం, ఈ సంఘటన 'యూకే'లోని బకింగ్‌హామ్‌షైర్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో గర్భవతిగా ఉన్న 26 సంవత్సరాల 'ఫరా కాకానిండిన్' బకింగ్‌హామ్‌షైర్‌లోని హాస్పిటల్ కి వెళ్ళడానికి ట్యాక్సీ బుక్ చేసుకుంది. నిజానికి ఆమె ప్రయాణించాల్సిన దూరం 20 కిలోమీటర్లు మాత్రమే ఉంది.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

'ఫరా కాకానిండిన్' టాక్సీని £30 పౌండ్స్ కి బుక్ చేసుకుంది. అయితే ఆమె హాస్పిటల్ కి వెళ్లే సమయంలోనే కారులోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కారులోని బిడ్డకు జన్మనివ్వడం వల్ల కారు కొంత అపరిశుభ్రంగా మారింది. అయితే అదే సమయంలో ఆ టాక్సీ డ్రైవర్ స్టోక్ మాండెవిల్లే హాస్పిటల్‌కి ఫోన్ చేసి అక్కడ వదిలేసాడు.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

'ఫరా కాకానిండిన్' టాక్సీని £30 పౌండ్స్ కి బుక్ చేసుకుంది. అయితే తీరా ఆమెకు £90 పౌండ్స్ కట్టాలని బిల్ వచ్చింది. ఇది చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. £90 పౌండ్స్ రావడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే కారులో ప్రసవించడం వల్ల కారు అపరిశుభ్రంగా మారిందని దానికి గానూ £60 పౌండ్స్ ఎక్కువ బిల్ వచ్చిందని తెలిసింది. £90 పౌండ్స్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 8500.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

20 కిలోమీటర్ల ప్రయాణనికి రూ. 8,500 బిల్ రావడం నిజంగానే చాలా అమానుషం అనే చెప్పాలి. రూ. 2820 బిల్లుకి ఏకంగా మూడు రేట్లు ఎక్కువ వేసి బిల్లు వసూలు చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత మొత్తంలో ఛార్జి వేసినందుకు సోషల్ మీడియాలో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫరా, ఆమె కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫరా తన కూతురికి 'నయా' అని కూడా పేరు పెట్టేసింది.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

ఫరా కాకానిండిన్ ట్యాక్సీలోనే స్వతహాగా ప్రసవించింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, గతంలో అన్ని కూడా సాధారణ ప్రసవాలె జరిగేవి. అయితే ఈ ఆధునిక కాలంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే ఆహారం వంటి కారణంగా సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరగడం లేదు.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

భారతదేశంలో గర్భిణీ స్త్రీని చాలా గౌరవంగా చూస్తారు. వీరికి చాలామందికి కారులో గానీ, ఇతర వాహనాల్లో గానీ ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. అప్పుడప్పుడు మనం అక్కడక్కడా కొన్ని ఆటోలపైన గర్భిణులకు ఉచితం అని రాసి ఉండటం కూడా చూస్తూ ఉంటాము.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

ఇలాంటి సంఘటనలు మన దేశంలో కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి, కానీ ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో చాలా తక్కువనే చెప్పాలి. ఏ దేశమైన.. ఏ ప్రాంతమైన ఉచితంగా సేవ చేయకపోతే పోనీ కానీ.. ఎక్కువ డబ్బులు వసూలు చేయడం మాత్రం మంచిది కాదు. ఇది చాలా అమానుషం అనే చెప్పాలి.

కారులో ప్రసవించినందుకు ఫైన్ వేసిన టాక్సీ డ్రైవర్.. ఒకటి, రెండు కాదు మూడు రెట్లు ఎక్కువ వసూల్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

అభివృద్ధి చెందిన దేశాల్లో మానవత్వానికి తావే లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా మాతృత్వాన్ని గౌరవిస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం కొంత బాధపడాల్సిన విషయం. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తారు, అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సంఘటనలో టాక్సీ డ్రైవ్ ఎక్కువ ఛార్జ్ వసూలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. దీనిపైనా మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి.

ఇలాంటి మరిన్ని ఆసక్తిరమైన విషయాలతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, November 3, 2022, 13:51 [IST]
English summary
Taxi operator bills cleanliness charges to lady who delivers her baby inside the car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+