సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు, ఎందుకో మరి

కొంతమంది సాధారణ వ్యక్తులు అప్పుడప్పుడు అసాధారణ కార్యక్రమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. చాలామంది చేసిన చాలా సాహస కృత్యాలను గురించి మనం ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం.. ఇదే రీతిలో మరో ఆణిముత్యం బయటపడింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

చిన్ననాటి నుంచి ఎక్కువ నడవడానికి ఇష్టపడే వ్యక్తి కేరళకు చెందిన నిధిన్. కేరళకు చెందిన మన నిధిన్ వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు. నిధిన్ ఇటీవల భారతదేశానికి దక్షిణంగా ఉన్న కేరళ నుండి ఉత్తరాన ఉన్న కాశ్మీర్ వరకు సైకిల్ పై ప్రయాణించాలని కంకణం కట్టుకున్నాడు.

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

ఎమ్ఆర్ నిధిన్ కేరళలోని త్రిస్సూర్‌ వద్ద తన ఇంటి నుంచి కాశ్మీర్‌కు వెళ్లే ప్రయాణాన్ని 100 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపాడు.కానీ నిధిన్ ఈ ప్రయాణానికి కావలసిన డబ్బు లేకపోవడంతో, టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో తన ఖర్చులను నిర్వహిస్తున్నానని చెప్పారు.

MOST READ:ట్రయంఫ్ టైగర్ 900 బైక్ సొంతం చేసుకున్న మలయాళీ స్టార్

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

ది బెటర్ ఇండియా నివేదిక ప్రకారం, నిధిన్ త్రిశూర్‌లో టీ అమ్మేవాడు. టీ అమ్మవాడు అయినప్పటికీ ఎప్పటికైనా భారతదేశాన్ని సందర్శించాలన్న తన చిన్ననాటి కలను నెరవేర్చడానికి చాలా శ్రమించాడు. ఈ నేపథ్యంలోనే తన ప్రయాణ సమయంలో టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

2021 జనవరి 1 న తాను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అతని జేబులో కేవలం 170 రూపాయలు మాత్రమే ఉన్నాయని నిధిన్ చెప్పాడు. నిధిన్ ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు తమ ప్రయాణాన్ని ప్రారంభించి, కొన్ని గంటల తరువాత దారిలో ఆగి టీ అమ్మేవాడినని చెప్పారు.

MOST READ:మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

అతని ప్రయాణానికి వెళ్లే మార్గంలో చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా డబ్బు కూడా ఇవ్వడం జరిగిందని అతడు చెప్పాడు. ఈ విధంగా అతడు 30 రోజుల్లో రాజస్థాన్‌కు చేరుకున్నాడు. అతను టీ తయారు చేయడానికి తనతో పాటు ఒక స్టవ్ మరియు ఫ్లాస్క్ కూడా తీసుకెళ్లినట్లు చెప్పాడు.

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

నిధిన్ ఒక్కసారి 30-35 కప్పుల టీ తయారు చేసి, టీ చల్లబడకుండా ఉండటానికి ఒక ఫ్లాస్క్‌లో పోసుకుంటాడు. ఈ విధంగా, అతను రోజు ప్రయాణంలో టీ అమ్మడం ద్వారా 300 నుంచి 350 రూపాయలు సంపాదించేవాడు.అతను రాత్రి పాలు మరియు టీ ఆకులు సులభంగా లభించే ప్రదేశంలో ఉండి, ఉదయాన్నే టీ తయారుచేస్తానని చెప్పాడు. పెట్రోల్ పంప్ దగ్గర గుడారాలు వేసి రాత్రి పూట గడిపేవాడిని అతడు చెప్పాడు.

MOST READ:తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

నిధిన్ తన ప్రయాణానికి అనుకూలంగా ఉండటానికి మరియు దారి తప్పిపోకుండా ఉండటానికి గూగుల్ మ్యాప్‌ను ఉపయోగిస్తానని చెప్పాడు, అయితే గూగుల్ మ్యాప్ పని చేయని ప్రదేశాలు కూడా చాలా వచ్చాయి, అలాంటి ప్రదేశాల్లో స్థానిక ప్రజల సహాయంతో తెలుసుకుని ముందుకు వెళ్లాడని చెప్పుకొచ్చాడు.

సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు

ఏది ఏమైనా ఈ అనన్య సామాన్యం, సైకిల్ పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం అంటే ఒత్తి మాటలు కాదు. అందులోనూ డబ్బు లేకుండా ఇంత సాహసానికి ఒడిగట్టిన మన నిధిన్ నిజంగా ప్రశంసనీయుడే.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

Source:The Better India

Most Read Articles

English summary
Tea Seller Travels Kerala To Kashmir By Bicycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X