Just In
Don't Miss
- News
కువైట్లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గురువే విద్యార్థులు దగ్గరకు వెళ్లి పాఠాలు చెప్పడం ఎక్కడైనా చూసారా.. అయితే ఇది చూడండి
వాహనదారులు షోరూమ్‌ల నుండి వాహనాల డెలివరీ అందుకున్న తరువాత చాలా మంది వాహనాలను తమ ఇష్టానుసారం వాహనాలను మార్చుకుంటారు. కొన్ని ఆటో మొబైల్ కంపెనీలు అందించే టైర్లను కూడా వారికి అనుగుణంగా మార్చుకోవడం జరుగుతుంది. మరికొందరు సైలెన్సర్‌ల స్థానంలో వారి స్వంత సైలెన్సర్‌లను స్వీకరిస్తారు. ఈ రకమైన మార్పులు వాహనం యొక్క ఆకర్షణను పెంచుతాయి లేదా వాటి పనితీరును పెంచుతాయి.

ఇటీవల ఒక ఉపాధ్యాయుడు తన వాహనాన్ని మొబైల్ క్లాస్‌రూమ్‌గా మార్చారు. ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరుకాని విద్యార్థుల కోసం వారు ఈ ఏర్పాట్లు చేశారు.

కరోనా వైరస్ తరువాత భారతదేశంలో పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడ్డాయి, ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరవుతున్నారు. ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌ల ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ కొంతమంది గ్రామీణ విద్యార్థులు సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనలేకపోతున్నందున తరగతులకు హాజరుకావడం లేదు.
MOST READ:కరోనా రోగులకోసం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అంబులెన్స్ సర్వీస్.. ఎలా ఉందో చూసారా !

అలాంటి విద్యార్థులకు బోధించడానికి టీచర్ రుద్ర రానా విద్యార్థుల స్వగ్రామానికి వెళుతున్నారు. టీచర్ రుద్ర రానాకు యమహా బైక్ ఉంది. వారు ఈ బైక్‌ను మొబైల్ క్లాస్‌రూమ్‌గా మార్చారు. టీచర్ రుద్ర రానా ఈ బైక్‌పై విద్యార్థులకు రాయడానికి మరియు బోధించడానికి ఒక బోర్డును ఏర్పాటు చేశారు.

ఎండ, వర్షాన్ని తట్టుకునేలా గొడుగు కూడా ఏర్పాటు చేశారు. గంట కొడుతూ తరగతికి హాజరు కావాలని రుద్ర రానా విద్యార్థులను ఆహ్వానిస్తాడు. అప్పుడు విద్యార్థులు తరగతికి హాజరవుతారు. అప్పుడు రుద్ర రానా బైక్‌కు అటాచ్ చేసిన బోర్డుతో రోడ్డుపై ఉన్న విద్యార్థులకు నేర్పుతారు.
MOST READ:భారీగా స్థాయిలో ఉన్న కియా సోనెట్ బుకింగ్స్.. ఇప్పటికి సోనెట్ బుకింగ్స్ ఎంతో తెలుసా ?
ఉపాధ్యాయుడు రుద్ర రానా ఛత్తీస్‌గడ్ లోని విద్యార్థులకు తరగతులు తీసుకున్నారు. చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుకోలేరని ఆయన అన్నారు. ఈ కారణంగా నేను వారి ఇంటి వద్దకు వచ్చి నేను చదువు చెబుతున్నానని చెప్పారు.

టీచర్ రుద్ర రానా కృషిని అందరూ ప్రశంసించారు. కొరోనా వైరస్ వల్ల కలిగే కష్టాల్లో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు సహాయం చేస్తున్నారు.
MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కియా సోనెట్ ఎస్యూవీ : ధర & ఇతర వివరాలు

కొన్ని నెలల క్రితం ఇరాన్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించడానికి తన కారును ఉపయోగించాడు. బ్లాక్ బోర్డ్ లేకపోవడానికి కారణం కారుమీదనే రాయడం మరియు నేర్పించడం చేసాడు.

కారు మీద ఈ విధంగా రాయడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో కూడా అతడు పరిగణలోకి తీసుకోలేదు. ఆ ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న కాలంలో ఉపాధ్యాయులే విద్యార్థుల దగ్గరికి వెళ్లి చదువు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గురువులు నిజంగా ప్రశంసనీయులు.
MOST READ:మీకు తెలుసా.. ఈ సైకిల్ ధర అక్షరాలా రూ. 13.2 లక్షలు.. ఎందుకంటే ?