విద్యార్థిని కారుతో ఢీకొట్టి బానెట్‌పై 10 కి.మీ లాక్కెళ్లిన ఉపాధ్యాయుడు.. సీసీటీవీలో విజువల్స్.!!
ఓ విద్యార్థిని టీచర్ అమానవీయంగా కారుపై ఎక్కించి దాదాపు పది కిలోమీటర్లు లాక్కెళ్లిన దారుణ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఇలాంటి ఘోరానికి పాల్పడటం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గొడవల కారణంగా ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని కారుతో ఢీకొట్టి బానెట్‌పైకి ఎక్కించి ప్రమాదకర స్థితిలో సుమారు 10 కి.మీ దూరం వరకు కారును నడిపించాడు. X(ట్విట్టర్), యూట్యూబ్‌లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

పంజాబ్ కపుర్తలాలోని సుల్తాన్‌పూర్ లోధి ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపై హ్యుందాయ్ వెన్యూ కారు వెళ్లడాన్ని సీసీటీవీ ఫుటేజ్ వెళ్లడం చూడవచ్చు. అయితే ఈ కారు విండ్ షీల్డ్‌పై ఓ వ్యక్తి వేలాడుతూ వెళ్లడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన అక్టోబర్ 26 న జరినట్లుగా సమాచారం.
ప్రాణాపాయ స్థితిలో కారుకు వేలాడుతున్న విద్యార్థి ఐఈఎల్‌టీఎస్ విద్యార్థి హర్మన్‌ప్రీత్ అని పోలీసుల విచారణంలో తేలింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఉపాధ్యాయుడు అతివేగంతో వచ్చి విద్యార్థిని హ్యుందాయ్ వెన్యూ కారుతో ఢీకొట్టాడు. అతివేగంగా ఢీకొట్టడంతో విద్యార్థి పైకి ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు.
అయినప్పటికీ ఉపాధ్యాయుడు కనికరం లేకుండా కారును ఆపకుండా.. సుమారు 10 కి.మీ.ల వరకు కారును అలాగే నడుపుతూ పోనిచ్చాడు. ఈ ఉపాధ్యాయుడి పేరు బల్జీందర్ సింగ్‌గా తెలిసింది. కాగా ఇతనిపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదయ్యాయని, పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి.
అలాంటి వ్యక్తి ఇప్పుడు విద్యార్థి హర్మన్‌ప్రీత్‌పై మరోసారి తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఘటనలో విద్యార్థి తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదృష్టవశాత్తూ హర్మన్‌ప్రీత్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. అయితే ఈ దారుణ ఘటన పగటిపూట జరగడం గమనార్హం.
విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడిన ఉపాధ్యాయుడిని ఇంకా పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేయలేదు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య గొడవేంటి.. ఇలా ఉపాధ్యాయుడు దాడికి పాల్పడటానికి గల కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది.
కాగా ఈ దారుణ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం ఉపాధ్యాయుడిపై హర్మన్ ప్రీత్ సింగ్ బంధువులు, స్నేహితులు దాడికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఇలాంటి రోడ్ రేజ్ సంఘటనలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








