రోహిత్‌ శర్మ కార్లు చూశారా.. మన హిట్‌మ్యాన్‌కి లాంగ్‌ డ్రైవ్‌ అంటే పిచ్చి

17 ఏళ్ల నిరీక్షణ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆధ్వర్యంలోని టీం ఇండియా రెండోసారి టీ20 వరల్డ్‌ కప్‌ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. సుదీర్ఘ కాలం టీం ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హిట్‌మ్యాన్‌, కోహ్లీ ఈ విజయం అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటించారు. ప్రస్తుతం టీం ఇండియా వరల్డ్‌ కప్‌ జరిగిన బార్బోడస్‌లో తుపాన్‌ కారణంగా భారత్‌కి రాలేదు. ప్రస్తుతం అక్కడి వాతావరణాన్ని టీం ఇండియా ఆస్వాదిస్తుంది. కానీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు దేశంలో అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. జట్టును నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విజయానికి కీలకమని చెప్పాలి.

మిగతా భారత క్రికెటర్ల మాదిరిగానే రోహిత్ శర్మ కూడా కారు ప్రేమికుడు. ముఖ్యంగా కార్లలో అధిక వేగంతో ప్రయాణించడానికి ఇష్టపడతాడు. గత ఏడాది 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లినందుకు రోహిత్ శర్మకు జరిమానా విధించడం గురించి మీలో కొందరు వినే ఉంటారు. ఈ కథనంలో రోహిత్ శర్మకు చెందిన లగ్జరీ కార్ల గురించి తెలుసుకుందాం.

Rohit-Sharma-Cars-Collection

లంబోర్ఘిని ఉరుస్: క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల లంబోర్ఘిని ఉరుస్ అనే ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఆయన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. ఈ లంబోర్ఘిని కారు గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు, గరిష్ట వేగం గంటకు 0 నుండి 100 కిలోమీటర్లు. ఈ కారును రోహిత్ శర్మ 2024 మార్చిలో కొనుగోలు చేశాడు.

BMW X3: రోహిత్‌ శర్మ వద్ద ఉన్న మరో కారు ఇది. రోహిత్‌ ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు కీరన్ పొలార్డ్ తదితరులతో కలిసి ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. అతనికి ఇష్టమైన కార్లలో ఇదొకటిగా ఉంది. 2017లో లాంచ్ చేసిన థర్డ్ జనరేషన్ BMW X3 కారుని ఆయన విడుదల చేసిన తొలినాళ్లోనే కొనుగోలు చేశాడు.

Rohit-Sharma-BMW-M5

BMW M5: ఇది రోహిత్ శర్మ డ్రీమ్ వెహికల్. తన కార్ల కలెక్షన్‌లో రోహిత్ శర్మకు ఇష్టమైన కారు ఇది. అందుకే ఈ శక్తివంతమైన BMW కారులో రోహిత్ శర్మ ఎప్పటికప్పుడు ముంబై రోడ్లపై కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు టర్బోఛార్జ్డ్ వి8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 560 bhp మరియు 680 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ GLS 350D: ఇది లంబోర్ఘిని ఉరుస్‌లా అన్ని ఫీచర్లు, ఇంజిన్ స్పెసిఫికేషన్స్‌ని కలిగి ఉంటుంది. అయితే బెంజ్ GLS 350D రోహిత్ శర్మ కలిగి ఉన్న అత్యంత అందమైన మరియు శక్తివంతమైన కారు ఇదే. ఇది 6 సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 255bhp పవర్ మరియు 620nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు కేవలం 7.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Rohit-Sharma-Mercedes-Benz-GLS1

టయోటా ఫార్చ్యూనర్: రోహిత్ శర్మ లంబోర్ఘిని, మెర్సిడెస్ లేదా BMW ఉపయోగించని రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే కారు. ఈ టయోటా కారుకు భారతదేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిలో రోహిత్ శర్మ ఒకడు కావడంలో ఆశ్చర్యం లేదు. చాలా వరకు ఆయన ఈ ఫార్చ్యూనర్‌ ద్వారానే హాజరయ్యేవాడు.

ముందే చెప్పినట్టు భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కారు ప్రేమికుడు. అతని వద్ద ఇన్ని కార్లు ఉండటంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఈ కార్ల సంఖ్య చాలా తక్కువ. రాబోయే కాలంలో రోహిత్ శర్మ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన తర్వాత మరిన్ని లగ్జరీ కార్లు కొనడం ఖాయం. అలాగే స్వయంగా కారుని నడపుతూ వెళ్లడం రోహిత్‌కి అలవాటు. కెరీర్‌ ముగిశాక వీటిపై ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 3, 2024, 11:40 [IST]
English summary
Team india captain rohit sharma cars collection toyota fortuner to luxuries cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+