కేఎల్‌ రాహుల్‌ కార్ల కలెక్షన్‌ చూశారా.. లగ్జరీలోనే కాదు, పర్ఫామెన్స్‌లోనూ అదుర్స్‌.!!

సెలబ్రిటీలు వాడే కార్లన్నా, బైక్‌లన్నా ఫ్యాన్స్‌కు చాలా క్రేజ్‌.. అందుకే ఫ్యాన్స్‌ను అలరించేందుకు అప్పుడప్పుడూ తమ ఫేవరెట్‌ కార్లలో బయటకు వచ్చి అభిమానులను అలరిస్తుంటారు. ఆ జాబితాలో ధోనీ నెం. 1 అనే చెప్పాలి. అయితే టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌(KL Rahul) దగ్గర కూడా అదిరిపోయే కార్ల కలెక్షన్‌ ఉంది.

టీమిండియా క్రికెట్ జట్టులో వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌లో దిట్ట కేఎల్ రాహుల్. వరల్డ్‌ కప్‌ సందర్భంగా గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ పర్ఫామెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌కి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు మనం అతని లగ్జరీ కార్ల కలెక్షన్‌ గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం.

Cricketer-KL-Rahul-Cars-Collection

Lamborghini Huracan Spyder: సెలబ్రిటీలు, వీఐపీలకు లంబోర్ఘిని కారంటే చాలా ఇష్టం. మార్కెట్లో ఈ కారుకు చాలా క్రేజ్‌ ఉంది. ఈ ఖరీదైన లగ్జరీ లంబోర్ఘిని హురాకాన్ స్పైడర్ కారును KL రాహుల్‌ సొంతం చేసుకున్నారు. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. 5.2-లీటర్ V10 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 602 bhp శక్తిని మరియు 560 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Aston Martin DB11: పోర్స్చే, ఫెరారీలతో పోలిస్తే దేశీయ మార్కెట్లో ఆస్టన్ మార్టిన్స్ చాలా అరుదుగా ఉన్నాయి. చాలా తక్కువ మంది దగ్గరే ఆస్టిన్‌ మార్టిన్ DB11 మోడల్‌ కారు ఉంది. వారిలో కేఎల్‌ రాహుల్‌ ఒకరు. ఆస్టన్ మార్టిన్ DB11 5.2-లీటర్ V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 503bhp శక్తిని మరియు 675 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Cricketer-KL-Rahul-Cars-Collection

Range Rover Velar: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన SUV రేంజ్ రోవర్ వెలార్. KL రాహుల్ వద్ద ఉన్న రేంజ్‌ రోవర్‌ వెలార్‌ ఎస్‌యూవీ.. నిర్దిష్ట SUV 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ V8 వెర్షన్. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాగా 543 bhp శక్తిని మరియు 680 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Mercedes-Benz C43 AMG: KL రాహుల్ కార్ల సేకరణలో మరొక ఫేమస్‌ కారు Mercedes-Benz C43 AMG. ఇది కేఎల్‌ రాహుల్‌ మొదటి కారుగా సమాచారం. ఈ జర్మన్ బేస్‌డ్‌ సెడాన్ ట్విన్-టర్బోచార్జ్డ్ 3.0-లీటర్ V6 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఇది 385 BHP వద్ద 520 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Cricketer-KL-Rahul-Cars-Collection

BMW X5: లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ KL రాహుల్ జాబితాలో మరో లగ్జరీ కారు BMW X5 ఎస్‌యూవీ. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా క్రేజ్‌ఉంది. ఇంకా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ఈ లగ్జరీ కారును ఉపయోగిస్తున్నారు. BMW X5 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటూ 300bhp శక్తిని అందిస్తుంది.

ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ వద్ద అరుదైన వింటేజ్‌ కార్లు మొదలుకుని అధునాతన కార్ల వరకూ ఉన్నాయి. ఇంకా ధోనీ ఇంట్లో గ్యారేజ్‌లో ఒక షోరూంలో కూడా లేనన్ని కార్లు, బైక్‌లు ఉన్నాయి. అప్పుడప్పుడూ మిస్టర్‌ కూల్‌ తన అరుదైన వింటేజ్‌ కార్లలో అప్పుడప్పుడూ రాంచీ వీధుల్లో బయటకు వచ్చి ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటారు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 10, 2023, 18:29 [IST]
English summary
Team india cricketer kl rahul luxury cars collection here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+