టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు, ఎలా ఉన్నాయో చూసారా ?

టెక్నికల్ గురూజీగా ప్రసిద్ది చెందిన గౌరవ్ చౌదరి భారతదేశంలో ఫెమస్ పుబ్లిషర్స్ లో ఒకరు. ఇతడు మొబైల్ మరియు గాడ్జెట్ రివ్యూల ద్వారా మరియు యూట్యూబ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

గౌరవ్ చౌదరి ఒక భారతీయుడు, కాని దుబాయ్ లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. చౌదరి కేవలం టెక్నాలజీ మీద మాత్రమే కాదు, కార్లు మరియు బైకులమీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు. టెక్నికల్ గురూజీ అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

గురూజీ కలిగి ఉన్న లగ్జరీ వెహికల్స్ లో రోల్స్ రాయిస్, బిఎమ్‌డబ్ల్యూ, పోర్స్చే, రేంజ్ రోవర్, జాగ్వార్, కవాసకి మరియు హార్లే డేవిడ్సన్ వంటి వాహనాలు ఉన్నాయి. దాదాపు 10 బిలియన్లకు పైగా విలువైన 10 వెహికల్స్ గురూజీ కలిగి ఉన్నారు. టెక్నీకల్ గురూజీ దగ్గర ఉన్న కార్ల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..రండి.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

1. రోల్స్ రాయిస్ ఘోస్ట్ :

రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును ఇటీవల టెక్నికల్ గురూజీ కొనుగోలు చేశారు. ఈ కారు ధర భారతదేశంలో రూ. 5.25 కోట్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారులో 6.6 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి 12 పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 563 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం చేస్తుంది.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

2. బిఎమ్‌డబ్ల్యూ 720 డి :

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారు ధర సుమారు 1 కోటి రూపాయలు. టెక్నికల్ గురూజీ దగ్గర ఉన్న ఈ కారులో చాలా లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు బిఎమ్‌డబ్ల్యూ యొక్క లేటెస్ట్ కార్లలో ఒకటి. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారు స్పోర్టి డిజైన్ కలిగి ఉంది.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

3. మెర్సిడెస్ జి 65 ఎఎమ్‌జి :

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా ఎస్‌యూవీలను కూడా ఇష్టపడతారు. యితడు ప్రముఖ మెర్సిడెస్ జి 65 ఎఎమ్‌జి ఎస్‌యూవీని కూడా కలిగి ఉన్నారు. మెర్సిడెస్ జి 65 ఎఎమ్‌జి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఎస్‌యూవీకి ట్విన్ టర్బో 6.0 లీటర్ వి 12 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 621 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

4. పోర్స్చే పనామెరా :

టెక్నికల్ గురూజీకి రెడ్ పోర్స్చే పనామెరా కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ కారు ధర సుమారు 1 కోట్ల రూపాయలు. ఈ కారులో అనేక లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులోని 3.0 లీటర్ వి 6 డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 250 బిహెచ్‌పి పవర్ మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

5. ఆడి ఎ 6 :

టెక్నికల్ గురూజీకి కలిగి ఉన్న కార్లలో వైట్ ఆడి ఎ 6 కారు కూడా ఒకటి. ఈ కారు ధర సుమారు రూ. 55 లక్షలు. ఆడి ఎ 6 ను 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో విక్రయిస్తున్నారు. కారు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

6. సుజుకి హయాబుసా :

సుజుకి కంపెనీకి చెందిన హయాబుసా, బైక్ ప్రేమికులకు ఇష్టమైన బైక్. టెక్నికల్ గురూజీ కూడా ఈ బైక్‌ను కలిగి ఉన్నారు. టెక్నికల్ గురుజీ వద్ద ఉన్న వైట్ సుజుకి హయాబుసా బైక్ ధర రూ. 13 లక్షలు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

7. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ :

టెక్నికల్ గురూజీ కొండల వంటి రోడ్లలో ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ను కూడా కలిగి ఉంది. అతను ఈ బైక్‌తో చాలాసార్లు కనిపించాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ ధర ఇండియన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 2 లక్షలు.

టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు

8. ఏటివి 4x4 :

ఇంతకు ముందు చెప్పినట్లుగా, టెక్నికల్ గురూజీ దుబాయ్‌లో నివసిస్తున్నారు. వారు ఎడారిలో తిరగటానికి అనుకూలంగా ATV 4x4 ఉంది. ఇది ఎత్తైన ఓపెన్ కారు, ఎడారిలో క్రీడలకు దీనిని ఉపయోగిస్తారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 8, 2020, 17:22 [IST]
English summary
Technical Guruji's car and bike collection. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+