Just In
Don't Miss
- News
రేప్ ఇన్ ఇండియా: రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- Lifestyle
జంటలు మార్నింగ్ సెక్స్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా!
- Sports
ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!
- Movies
శక్తిమ్యాన్లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Technology
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ51, ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు
ఒక్క ఆటోలో 24 మంది.. టైటిల్ చూసి షాకయ్యారా..? మీరే కాదు, అక్కడున్న పోలీసులు కూడా షాకయ్యారు. మహేష్ బాబు అతడు సినిమాలో సుమోలకు ఖర్చు దండగ అని ఒక్క సుమోలో 20 మంది ప్రయాణిస్తే ఇక్కడ ఏకంగా 24 మంది ప్రయాణించారు. అంటే 50 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్సులో సగం మంది ప్రయాణికులను ఓ ఆటోలో తీసుకెళ్లాడు ఓ ఘనుడు.

వివరాల్లోకి వెళితే తెలంగాణలోని కరీంనగర్ పోలీసులు రోడ్డుపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 24 మందితో ప్రయాణిస్తున్న ఆటో అంటూ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

తొలుత ఓ 10 మంది వరకు ఉంటారని భావించారు. ఒక్కొక్కరూ దిగుతుంటే... పోలీసులకే ఆశ్చర్యమేసింది. మొత్త ఎంతమంది అని లెక్కించి... షాకయ్యారు. అసలు అంత మంది ఒక్క ఆటోలో ఎలా పట్టారన్నదే వాళ్లకు అర్థం కాలేదు. వాళ్లందర్నీ ఆటో పక్కన నిలబెట్టి... ఫొటోలు తీశారు.

వీడియోలో ప్రకారం డ్రైవర్ వివరాలు, తండ్రి పేరు, మండలం మరియు గ్రామం వివరాలతో పాటు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ రూల్స్ మరియు ప్రయాణికుల వ్యక్తిగత భద్రత గురించి పోలీసులు వివరించడం మినహాయి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ప్రమాదకరంగా 24 మందితో ప్రయాణికుల్ని తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాలు తెలియలేదు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని... కరీంనగర్ కమిషనర్... ఈ ఆటోకి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసలుకే ఎసరు అన్నట్లుగా.. భద్రతను దృష్టిలో ఉంచుకొని వీడియో పోస్ట్ చేస్తే నెటిజన్ల నుండి అనుకోని స్పందన ఎందురైంది. ఒక రకంగా చెప్పాలంటే అధికారుల్ని, ప్రభుత్వాన్ని చెడుగు ఆడుగున్నారు.

తెలంగాణలో చాలా వరకు మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేదు. పల్లె ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంటే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఎవ్వరూ ప్రయాణించరని ఎదురు ప్రశ్నలు వేశారు. అంతే కాకుండా, కేవలం కరీంనగర్‌లో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అలాంటివి ప్రతి గ్రామాల్లోను చూడవచ్చని పోలీసుల ట్వీటుకు ఘాటుగా స్పందించారు.