కారు ప్రమాదంలో కన్ను మూసిన MLA లాస్య నందిత - కారణాలివే..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే 'లాస్య నందిత' ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మీద జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను డీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచిన యువ MLA లాస్య నందిత మరణం కుటుంబ సభ్యులను, అభిమానులను మరియు అనుచరులను విషాదంలోకి నెట్టిసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈమె తండ్రి సాయన్న హఠాన్మరణం తరువాత ఈమెకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కాగా తండ్రి మరణించిన ఏడాదికే ఈమె మరణం జీర్ణించుకోలేని విషయంగా మారిపోయింది.

ఎమ్మెల్యే లాస్య నందిత గతంలో నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారును ఆటో డీ కొట్టింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడింది, కానీ ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం నందిత మృత దేహం పఠాన్‌చెరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం వీటి కుటుంబం కన్నీటి పర్యంతమైపోతోంది.
ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటంటే..
మేడ్చల్ నుంచి పఠాన్‌చెరు వెళ్తున్నప్పుడు కారు ప్రమాదానికి గురై లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు, ఆమె పీఏ ప్రకాష్ మరియు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం ఈ రోజు తెల్లవారు జామున 6:30 గంటల సమయంలో జరిగినట్లు, ప్రమాదానికి ప్రధాన కారణం నిద్రమత్తులో వేగంగా వెళ్లడమే అని, ముందు వెతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

గతంలో ప్రమాదానికి గురైన తరువాత ఎమ్మెల్యే లాస్య నందిత మారుతి ఎక్స్ఎల్6 (Maruti XL6) కారును కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోలేదని, ఆ సమయంలో సడెన్ బ్రేక్ వేయడంతో.. ఆమె ముందు సీటును వేగంగా డీ కొట్టుకోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు నిపుణులు చెబుతున్నారు.
గతంలో ప్రమాదం జరిగినప్పుడే డ్రైవర్‌ను మార్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లాస్య ఆకస్మిక మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం.
ఎవరీ లాస్య నందిత..
1987లో హైదరాబాద్‌లో జన్మిచిన లాస్య నందిత బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి తండ్రి కోరిక మేరకు 2015లో రాజకీయ రంగప్రవేశం చేసింది. ఆ సంవత్సరం కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. 2016లో అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న ఈమె తండ్రి BRS పార్టీలో చేరారు. ఈమె కూడా 2016 నుంచి 20 మధ్య రాజకీయాల్లో చురుగ్గా ఉంది. 2021లో మరో సరి ఎన్నికల్లో ఓడిపోయి 2023లో ఎమ్మెల్యేగా గెలిచింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








