600 కార్లతో 6 కిలోమీటర్ల పొడవైన కాన్వాయ్‌లో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌

భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీని విస్తరించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధ్యక్షుడిని నియమించి, రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. దీంతోపాటు ఒడిశాలోనూ పార్టీ బలోపేతం చేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఇతర పార్టీల సీనియర్‌ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

వీటితోపాటు మహారాష్ట్రలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్‌ గత కొన్నాళ్ల నుంచి కీలక ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు మహారాష్ట్ర నేతలు, పార్టీలో సీనియర్లతో సమాలోచనలు చేస్తున్నారు. మహారాష్ట్రలో కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అక్కడ స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేశారు. గతంలోను మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్‌.. సోమవారం మరోసారి మహారాష్ట్రకు పయనమయ్యారు.

telangana CM kcr maharashtra tour with 600 vehicle convoy

అయితే ఈసారి తన అంగ, అర్ధబలాన్ని చాటిచెప్పే విధంగా ఏకంగా రెండు ప్రత్యేక బస్సులు సహా 600లకు పైగా వాహనాలతో హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్ర సోలాపూర్‌ సోమవారం సాయంత్రం చేరుకున్నారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ వద్ద ఉదయం 11 గంటలకు ఈ కాన్వాయ్‌ బయలుదేరింది. సుమారు 6 కిలోమీటర్లు పొడవునా ఈ కాన్వాయ్‌ సాగింది. సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చేరుకున్నారు.

ఈ వాహనాల్లో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాసయాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, సత్యవతి రాఠోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కేశవరావు, సుమారు 103 బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఏడుగురు ఎంపీలు, సహా పార్టీ ముఖ్య నేతలు ఇందులో ఉన్నట్లు సమాచారం. భారీ కాన్వాయ్‌కు తెలంగాణ పోలీసులు సహా మహారాష్ట్ర పోలీసులు గట్టి భద్రత కల్పించారు.

దారిపొడువునా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కేసీఆర్‌ కాన్వాయ్‌కు పెద్దపెద్ద బ్యానర్లతో స్వాగతం పలికారు. ఈ భారీ కాన్వాయ్‌పై తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ధారాశివ్, సోలాపూర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ సర్కోలిలోని బహిరంగ సభలో పాల్గొన్నారు.

telangana CM kcr maharashtra tour with 600 vehicle convoy

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. ఇంటిలిజెన్స్‌ విభాగం నివేదికల ప్రకారం సీఎం భద్రత కోసం ప్రత్యేక బస్సును కొనుగోలు చేసింది. ఈ బస్సు ధర సుమారు రూ.7 కోట్లు. ఈ బస్సులో పూర్తి అధునాతన ఫీచర్లు, సౌకర్యాలు, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ సెక్యూరిటీని కలిగి ఉంది.

తెలంగాణలోని జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటనల సందర్భంగా ఈ బస్సునే వినియోగిస్తున్నారు. ఈ బస్సులను మెర్సిడెస్‌ బెంజ్‌ సంస్థ తయారు చేసింది. ఈ బస్సుతోపాటు సీఎం కేసీఆర్ అత్యంత భద్రత కలిగిన కార్ల కా‌న్వాయ్‌ను కలిగి ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ Z+ భద్రతను కలిగి ఉన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 27, 2023, 13:59 [IST]
English summary
Telangana cm kcr maharashtra tour with 600 vehicle convoy from hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+