వెహికిల్‌ ఓనర్స్‌కి ఫైనల్‌ వార్నింగ్‌.. 1 జనవరి, 2025 నుంచి కొత్త రూల్స్‌, త్వరలోనే కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణలో కాలుష్య కారక వాహనాలను 2025 జనవరి 1 నుంచి రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని అమలు ప్రకారం ఏదైనా వెహికిల్‌ 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉండి రోడ్డుపై తిరగడానికి వీలు లేదు. ఒకవేళ కారు మంచి కండీషన్‌లో ఉంటే ప్రభుత్వం నిర్వహించే ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేని యెడల వాహనాలను రోడ్లపైకి వచ్చేందుకు అనుమతించరు. దీని అమలుకు సంబంధించి కీలక దస్త్రాలు, మార్గదర్శకాలపై అధికారులు ఇప్పటికే ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలోనే ప్రభుత్వం ప్రకటించబోయే ఈ వివరాలపై ఓ లుక్కేయండి.

15 ఏళ్లు అంతకంటే పైబడిన వాహనాలు ఫిట్‌నెస్‌లో తేలిపోతే యజమానులు వాహనాన్ని స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం మీకు ఇష్టం లేకపోతే ఆ వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావద్దు. ఒకవేళ దీనిని మీరు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ నియమాలు ప్రకారం ఫైన్‌ లేదా వాహనాన్ని సీజ్‌ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత పొందిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి అదనంగా 3-5 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు.

Vehicles Scrapping

అయితే, 15 ఏళ్లు నిండిన 10,000 ప్రభుత్వ వాహనాలకు ఇది వర్తించదు. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ ముసాయిదా బిల్లుని రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 15 సంవత్సరాలకు పైబడిన వాహనాలను రోడ్లపై తిరగడానికి అనుమతించడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విధంగా మినహాయింపు ఉంది.

ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 30 లక్షలకు పైగా వాహనాలు 15 ఏళ్లకు పైబడి ఉన్నట్లు తేలింది. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 20 లక్షలు ఉన్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. వీటిలో 17 లక్షల ద్విచక్ర వాహనాలు, 3.5 లక్షల కార్లు, లక్ష గూడ్స్ క్యారేజీలు, 20 వేల ఆటో రిక్షాలు ఉన్నట్లు స్పష్టం అయ్యింది.

15 years above vehicles Scrapping

స్క్రాప్‌కి ఇస్తే ప్రోత్సాహకం: ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 1,000 ఆర్టీసీ బస్సుల అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. అంతే కాకుండా సుమారు 2,000 లకు పైగా విద్యా సంస్థల బస్సులు కూడా 15 సంవత్సరాల మార్కును దాటాయి. అయితే పాత వాహనాల స్క్రాపింగ్‌ని ప్రోత్సహించడానికి కొత్త వాహనాల కొనుగోలుపై వెహికిల్‌ టాక్స్‌లో 10% నుంచి 15% వరకు రాయితీ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఇప్పటికే సమర్పించిన ముసాయిదాకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు కంపెనీలు వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Vehicle Scraps

ప్రస్తుతం చాలా వరకు వెహికిల్స్‌ భారీ మొత్తంలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధి లోనే ఎక్కువగా పాత అంబులెన్సులు, బస్సులు, ఫైర్‌ ఇంజిన్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర గవర్నమెంట్‌ వెహికిల్స్‌ ఉన్నట్లు తేలింది. మరోవైపు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 15 ఏళ్లకు పైబడిన వాహనాల వల్ల రోజులో వెయ్యికి పైగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నట్లు తేలింది.

ముఖ్యంగా పాత వాహనాలు బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎంతో అనుభవం కలిగిన డ్రైవర్లు ఉన్నా కానీ వెహికిల్‌ని కంట్రోల్‌ చేయడం అసాధ్యం. గేర్లను తరచుగా మార్చడం కూడా కష్టతరంగా ఉంటుంది. అంతే కాకుండా రోడ్లు ఆకస్మాత్తుగా రోడ్డుపై నిలిచిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్‌ ఏర్పడుతుంది. ఇలా ఎన్నో నష్టాలు పాత వెహికిల్స్‌ ద్వారా జరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 19, 2024, 15:22 [IST]
English summary
Telangana governament to scrap 15 year old vehicles from jan 1 2025
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+