భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

భారతదేశంలో రవాణా వ్యవస్థ రోజురోజుకి బాగా అభిరుద్ది చెందుతోంది. ఈ తరుణంలో భాగంగానే సాధారణ (పెట్రోల్ మరియు డీజిల్) వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకు సరైన మరియు కావాల్సినన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు. దీనికోసం చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వాలు కూడా తమవంతు సహకారం అందిస్తున్నాయి.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

దీనితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ విధానాల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ స్టేషన్లను కూడా నిర్మిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై సహా పలు మహానగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

అయితే ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 600 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి ఇటీవల తెలిపారు. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలామంచి శుభవార్త.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 138 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, మిగిలిన స్టేషన్ల ఏర్పాటు కోసం పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా ఇంధన ఖర్చుపై ప్రతి ఏటా దాదాపు రూ. 250 కోట్లు ఆదా చేయవచ్చని జగదీశ్ రెడ్డి తెలిపారు.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయని కూడా అయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనివల్ల కాలుష్య పరిమాణం భారీగా తగ్గించడమే కాకుండా, ప్రభుత్వ వ్యయం కూడా చాలా వరకు తగ్గుతుంది అన్నారు.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలు ఇప్పటికే చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ స్టేషన్లలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుంది, తద్వారా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎప్పుడైనా ఛార్జ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెంచడానికి మౌలిక సదుపాయాలు చాలా అవసరం, కావున భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన వినియోగం తప్పకుండా ఎక్కువవుతుంది, ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు తప్పనిసరిగా అవసరం.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత ఎక్కువగా ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం బ్యాటరీతో నడిచే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను రిజిస్ట్రేషన్ ఫీజు మరియు రెన్యువల్ ఫీజు వంటి వాటినుండి మినహాయింపు కల్పిస్తుంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదాకాశం ఎంతోమంది ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవిధంగా చేస్తుంది.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫీజులో చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీల ప్రకారం రోడ్ టాక్స్ మరియు బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నారు.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఇంధన ధరల మధ్య వాహనాల వల్ల కలిగే గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాలు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

అంతే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ప్రోత్సహించడానికి, అన్ని బ్యాటరీతో పనిచేసే వాహనాలపై GST రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించబడింది. దీనితో పాటుగా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుపై ఆకర్షనీయమైన రాయితీలు కల్పించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు విక్రయాలు పెరుగుతున్నాయి.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల విధానాలను ఖరారు చేస్తున్నాయని, త్వరలో ప్రకటిస్తాయని నివేదికల ద్వారా తెలుస్తుంది.

భారీ స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: ఏకంగా 600 పైనే

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ సబ్సిడీలు మరియు రాయితీల ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్-2 స్కీమ్ మాత్రమే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచే అవకాశం ఉంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

Most Read Articles

English summary
Telangana government to setup 600 ev charging stations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X