డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

మద్యం తాగి వాహనాలు నడిపే వారి నుంచి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా, మద్యం సేవించని వారు మద్యం సేవించిన వ్యక్తి యొక్క వాహనాన్ని నడిపేందుకు అనుమతించవచ్చని హైకోర్టు తెలిపింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

టైమ్స్ ఆఫ్ ఇండియా లో ప్రచురించిన ఓ కథనంలో ప్రకారం, వాహనాల సీజ్ లు మరియు వాహనాలను తిరిగి పొందడానికి సుదీర్ఘ నిరీక్షణను సవాలు చేస్తూ వాహన యజమానులు దాఖలు చేసిన పిటీషన్‌ల సమూహాన్ని విచారించిన తరువాత, జస్టిస్ కె లక్ష్మణ్ తన ఉత్తర్వులో ఈ విషయం పేర్కొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

జస్టిస్ కె లక్ష్మణ్ తన ఉత్తర్వులో పేర్కొన్న సమాచారం ప్రకారం, "తాగిన డ్రైవర్‌ తో పాటు ఎవరూ లేకుంటే, పోలీసులు వారి బంధువుకు సమాచారం తెలియజేయాలి. లేదా మత్తులో ఉన్న వ్యక్తి నుంచి అతడు/ఆమె స్నేహితులు వాహనాన్ని అదుపులోకి తీసుకోవాలి" అని పేర్కొన్నారు. తాదిన వ్యక్తి యొక్క వాహనం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే, అప్పుడు మాత్రమే పోలీసులు వాహనాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కానీ లేదా మరేదైనా సురక్షితమైన కస్టడీలో కానీ ఉంచవచ్చని మరియు దానిని యజమానికి లేదా ఏవరైనా అధికారం ఉన్న వ్యక్తికి మాత్రమే విడుదల చేయాలని న్యాయమూర్తి తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

అయితే, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను పట్టుకున్న దగ్గర నుంచి వాహనం నడపకూడదన్న రాష్ట్ర హోమ్ శాఖ న్యాయవాది జి శ్రీకాంత్ రెడ్డి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. "డ్రైవర్ లేదా యజమాని లేదా ఇద్దరిపైనా ప్రాసిక్యూషన్ అవసరమని ఒక పోలీసు అధికారి నిర్ధారణకు వస్తే, వాహనం స్వాధీనం చేసుకున్న తేదీ నుండి మూడు రోజుల్లోగా మేజిస్ట్రేట్ ముందు వారిపై ఛార్జిషీట్ దాఖలు చేయాలి" అని జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

ఈ విషయంలో "ప్రాంతీయ రవాణా అధికారులకు తెలియజేసేందుకు ప్రాసిక్యూషన్ పూర్తయిన తర్వాత వాహనాన్ని అదుపులోకి తీసుకున్న అధికారి విడుదల చేస్తారు" అని తెలిపారు. చార్జిషీట్‌లు సక్రమంగా ఉంటే స్వాధీనం చేసుకున్న తేదీ నుండి మూడు రోజుల్లోగా ఛార్జిషీట్‌లను స్వీకరించాలని మేజిస్ట్రేట్‌లను ఆదేశించింది. వాహనంపై ఎవరూ కస్టడీని క్లెయిమ్ చేయకుంటే, పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. "ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే తప్పు చేసిన అధికారులపై ధిక్కార కేసులు నమోదు చేయబడతాయి" అని న్యాయమూర్తి హెచ్చరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

భారతీయ మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 185 (బి) ప్రకారం, మద్యం సేవించి వాహనం నడపడం అనేది చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. మద్యం తాగి వాహనం నడిపితే 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్ 202 లోని సబ్-సెక్షన్ 3 ప్రకారం, పోలీసులు వారెంట్ లేకుండానే సదరు మోటారు వాహన డ్రైవర్‌ను అరెస్టు చేసి, అవసరమైతే వాహనాన్ని తాత్కాలికంగా సీజ్ చేయడం కోసం తగిన చర్యలు తీసుకోవచ్చు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

ఇంకో మాటలో చెప్పాలంటే, మద్యం సేవించిన వాహనం నడిపిన వ్యక్తి యొక్క వాహనాన్ని సదరు వాహన యజమానికి కానీ లేదా ఏదైనా అధీకృత వ్యక్తి కానీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, గుర్తింపు రుజువు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పోలీసు అధికారులను సంప్రదించేంత వరకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దానిని సురక్షితంగా కస్టడీలో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

మోటార్ వాహన చట్టం 1988 లోని సెక్షన్ 207 ప్రకారం, మోటారు వాహనాన్ని జప్తు చేయడానికి నిబంధనలు ఉన్నప్పటికీ, నిర్దిష్ట వాహనానికి పర్మిట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుంటే లేదా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి సదరు వాహనాన్ని నడుపుతున్నట్లయితే మాత్రమే ఇది వర్తిస్తుంది. డ్రైవరు మద్యం మత్తులో ఉన్నారనే కారణంతో వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదు. తెలంగాణా హైకోర్టు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

మోటార్ వాహన చట్టం 1988 లోని సెక్షన్ 19 ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకుండా లేదా అలాంటి లైసెన్స్‌ని రద్దు చేయడానికి ఒక వ్యక్తిని అనర్హులుగా చేయడానికి లైసెన్స్ అథారిటీ యొక్క అధికారంతో వ్యవహరిస్తుంది. మద్యం సేవించి నడిపే వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఈ సెక్షన్ పోలీసులకు ఎలాంటి అధికారాలు ఇవ్వదు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

అలాగే, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 లోని రూల్ 21 ప్రకారం, మత్తు పానీయాలు లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనాన్ని నడిపే వ్యక్తిని అనర్హులుగా ప్రకటించే లైసెన్సింగ్ అథారిటీ అధికారాలతో వ్యవహరిస్తుంది. కానీ పైన పేర్కొన్న రూల్ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారాలను మాత్రం ఇవ్వదు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణా హైకోర్టు సంచల తీర్పు.. వావనాలను జప్తు చేసే అధికారం పోలీసులకు లేదు!

తెలంగాణ రాష్ట్ర మోటారు వాహనాల నియమాలు, 1989 లోని రూల్ 448, మోటార్ వాహన చట్టం 1988 (పర్మిట్ లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా తక్కువ వయస్సు గల డ్రైవింగ్) సెక్షన్ 207 కింద పేర్కొన్న నేరాలకు వాహనాలను అదుపులోకి తీసుకునే అధికారాలతో వ్యవహరిస్తుంది. ఈ రకంగా సీజ్ చేసిన వాహనాల విడుదలకు అనుసరించాల్సిన విధానాన్ని కూడా అందులో పేర్కొన్నారు. కానీ మద్యం మత్తులో వ్యక్తులు నడిపే వాహనాలను సీజ్ చేసే అధికారాలను ఈ రూల్ ఇవ్వదు.

Most Read Articles

English summary
Telangana high court orders state police not to seize drunk drivers vehicle details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X