తెలంగాణా పోలీసుల కోసం అధునాతన వాహనాలు

కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో పోలీసు విభాగపు రూపు రేఖలు మారిపోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ధీటుగా పోలీసు వ్యవస్థను పటిస్థంగా చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం లండన్, న్యూయార్క్ దేశాలను సందర్శించి అక్కడి పోలీసు అధికారుల నిర్వహిస్తున్న విధివిధానాలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుత పోలీసులు ధరిస్తున్న ఖాకీ యూనిఫారం స్థానంలో బ్లూ కలర్ యూనిఫారంను ప్రవేశపెట్టడంతో పాటుగా, ప్రస్తుతం ఉన్న పాత వాహనాలను కూడా అధునాత వాహనాలతో రీప్లేస్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, కొత్త వాహనాల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే నిధులు కూడా మంజూరయ్యాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ ప్రాంతాలలో కొత్త వాహనాలను సమకూర్చుకునేందుకు రూ.271.97 కోట్ల నిధులను మంజూరు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Police To Get New Vehicles

ఈ కొత్త వాహనాల కొనుగోలు విషయంలో డిజిపి అనురాగ్‌శర్మకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులతో హైదరాబాద్‌లో 2,069 వాహనాలను, సైబరాబాద్‌లో 1,814 వాహనాలు కొనుగోలు చేయనున్నారు. హైదరాబాద్‌ జంట పోలీస కమిషనరేట్లలో అంతర్జాతీయ పోలీసింగ్ కోసం 1,600 టొయోటా ఇన్నోవా ఎమ్‌పివిలు, 1,600 ద్విచక్ర వాహనాల (బ్రాండ్ తెలియదు)ను కొనుగోలు చేయనున్నట్లు ఇదవరకే తెలంగాణా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించిన విషయం తెలిసినదే.

More from DriveSpark

Article Published On: Friday, July 11, 2014, 16:56 [IST]
English summary
Hyderabad police system is all set to revamp. A police team from Telangana would visit New York and London to study the functioning of police there. Telangana police will also get new uniform and new vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+