ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్.. ఎందుకో తెలుసా?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు 'కె.ఎ. పాల్' గా పరిచయమున్న 'హైతీ లో కిలారి ఆనంద్ పాల్' గురించి ప్రపంచం మొత్తం తెలుసు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతడు ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు. కె.ఏ పాల్ 2008 లో ప్రజాశాంతి పార్టీ స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. అయితే ఇటీవల యితడు తన పార్టీ ప్రచారం కోసం 'మహీంద్రా' (Mahindra) కంపెనీ యొక్క 5 'ఎక్స్​యూవీ 700' (XUV 700) వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

కె.ఏ పాల్ తెలంగాణ రాష్ట్రంలో తన ఎన్నికల ప్రచారం కోసం మహీంద్రా యొక్క కొత్త ఎస్‌యూవీలను ఉపయోగిచాలనుకోవడం వల్ల ఒక్క సారిగా 5 XUV 700 కార్లను కొనుగోలు చేశారు. పాల్ కొనుగోలు చేసిన ఈ కార్లు తెలుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

కె.ఏ పాల్ కొనుగోలు చేసిన మహీంద్రా XUV 700 కార్లు టాప్ ఎడ్ వేరియంట్ కి చెందిన AX7 వేరియంట్‌లు. అంతే కాకుండా ఇవి పెట్రోల్ ఇంజిన్ కార్లు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే ఒక్కసారిగా 5 మహీంద్రా XUV 700 వాహనాలు డెలివరీ చేయడం. ఎందుకంటే దేశీయ మార్కెట్లో XUV 700 కి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ కేఏ పాల్ ముందుగానే బుక్ చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

మహీంద్రా XUV700 ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX3, AX3, AX5 మరియు AX7 వేరియంట్స్. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ల ఎంపికలో అందుబాటులో ఉంటుంది. కానీ, MX5 ట్రిమ్ కేవలం 3 వేరియంట్‌లకు పరిమితం చేయబడింది. ఇందులో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజిల్ మాన్యువల్ వేరియంట్లు ఉన్నాయి.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

మహీంద్రా XUV 700 అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. అయితే, సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ ఫీచర్లుగా జోడించబడతాయి.

ఒకేసారి 5 'Mahindra XUV 700' వాహనాలు కొనుగోలు చేసిన K.A పాల్

ఇదిలా ఉండగా మహీంద్రా ఇటీవలే తన XUV700 ధరలను పెంచింది. ఇప్పుడు, XUV700 ప్రారంభ ధర రూ. 13.18 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర రూ. 24.58 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ సంవత్సరం ప్రారంభంలో, అంటే 2022 ఫిబ్రవరిలో, ప్రముఖ హాలీవుడ్ నటుడు రణవీర్ షోరే కొత్త మహీంద్రా XUV700ని కొనుగోలు చేశారు.

More from DriveSpark

Article Published On: Sunday, May 15, 2022, 8:30 [IST]
English summary
Telangana politician k a paul buys five new mahindra xuv 700 suvs for election campaign details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+