గోవాలో తెలంగాణ యువకుడి ఓవర్‌ యాక్షన్‌.. కారు రూఫ్‌పై కూర్చుని డేంజరస్‌ జర్నీ, ఝలక్‌ ఇచ్చిన పోలీసులు

హాలీడేను ఎంజాయ్‌ చేయడానికి గోవా వెళ్లి అక్కడి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు తెలంగాణ యువకుడు(Man Sitting On Car's Roof and Travel). పబ్లిక్‌ రోడ్లపై చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కారు రూఫ్‌పై కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి పబ్లిక్ రోడ్లపై కొందరు ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేస్తున్న సంఘటనలు చాలా జరిగాయి. కదులుతున్న కారులో సన్‌రూఫ్‌లో నుంచి బయటకు చూడటం, కారు డోర్లను పట్టుకుని వేలాడుతుండటం, రూఫ్‌పై కూర్చుని విన్యాసాలు చేయడం లాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల గోవాలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

Goa-Travel-On-Cars-Roof

సెలవుల్లో గడపడానికి సౌత్‌ ఇండియాలో యూత్‌కు ఫేవరెట్ స్పాట్‌ గోవా(Goa Tour). ఫ్యామిలీతో కంటే కూడా ఫ్రెండ్స్‌ కలిసి చిల్‌ అవ్వడానికి ఎక్కువగా గోవాకు వెళుతుంటారు. గోవా బీచ్‌ల్లో సరదాగా గడుపుతుంటారు. స్థానికులే కాకుండా ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా గోవా టూర్‌ చేస్తుంటారు.

అయితే ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం అవసరం. కానీ అవేమీ లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు కొందరు. గోవా రోడ్ల(Goa Viral Videos)పై టూరిస్టులు దురుసుగా ప్రవర్తించిన వీడియోలు గతంలో చాలా జరిగాయి. అంతే కాకుండా బీచ్‌లో వాహనాలు నడుపుతూ ఇసుకులో కూరుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Goa-Travel-On-Cars-Roof

కానీ ఇక్కడ గోవాలోని మపుసా ప్రాంతంలో బ్రిడ్జిపై మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యూవీ కారులో ప్రమాదకరంగా ప్రయాణించాడు తెలంగాణకు చెందిన టూరిస్ట్‌(Telangana-Tourist-Moving-On-Car's-Roof). బ్రెజ్జా కారు కదులుతుండగా దాని పై కప్పుపై కూర్చుని చుట్టూ చూస్తున్నాడు. ఈ సంఘటనను వెనుక నుంచి వస్తున్న కారులోని ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియా ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్‌ చేశారు.

వీడియోను చూసినట్లయితే మారుతి సుజుకి బ్రెజ్జా(Maruti-Suzuki-Brezza) కారు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లుగా తెలుస్తోంది. కారు బ్రిడ్జి మీద నుంచి వెళ్తుండగా.. రూఫ్‌పై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. అయితే కారులో వార్నింగ్‌ లైట్లు ఆన్‌ చేయబడ్డాయి. అంతే కాకుండా కారు స్లోగా కదులుతోంది. అయితే ఈ కారుకు సన్‌రూఫ్ ఫీచర్‌ లేదని గమనించాలి.

రోడ్డుపై ఇలా ప్రమాదకరంగా ప్రయాణించడం సరైంది కాదు. అతను SUV పైకప్పు నుంచి పడిపోయే ప్రమాదం ఉంది. డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేసినా లేదంటే స్పీడ్‌ పెంచినా.. పైన పట్టుకోవడానికి సపోర్ట్‌ లేకపోవడంతో కింద పడిపోవచ్చు. ఎందుకంటే బ్రెజ్జాపై రూఫ్ రైల్ తగినంత పట్టును అందించకపోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను కోరుతున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కారు యజమానిని గుర్తించారు. అతనితో పాటు సంఘటనకు పాల్పడిన యువకుడు కూడా కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేశారు. కాగా ఈ యువకుడు సిద్దిపేట జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.

More from DriveSpark

Article Published On: Friday, January 12, 2024, 16:36 [IST]
English summary
Telangana tourist sitting on cars roof and travel dangerously police arrested him
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+