తెలంగాణ అమ్మాయిలతో మామూలుగా ఉండదు.. ఫిదా చేస్తున్న వీడియో.. ఔరా అంటున్న నెటిజన్లు
ఓ యువతి చీర కట్టుకుని బైక్ రైడింగ్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తెలంగాణలోని వరంగల్ పట్టణంలో అచ్చమైన చీరకట్టులో ఓ యువతి రైడ్ చేస్తూ కనిపించింది. సాధరణంగా యువతి యువకులు బైక్ రైడ్ చేసే క్రమంలో దానికి తగినట్లుగా జీన్స్ లేదా ఇతర దుస్తులు ధరించి రైడింగ్ చేస్తారు.
అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువతి, యువకులు వింత స్టంట్స్‌తో రైడ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇంటర్‌నెట్ వైరల్ అయ్యేందుకు రోడ్లపై ముద్దులు పెట్టుకోవడం, బైక్‌పై నిలుచుని రైడ్ చేయడంతో పాటు వివిధ రకాల స్టంట్స్ చేస్తున్నారు. దీంతో వారు క్షణాల్లో వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో నిత్యం కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఇలాంటి స్టంట్స్ తీవ్ర పరిణామాలకు దారితీస్తుండగా.. మరికొన్నిసార్లు విషాదాన్ని నింపుతున్నాయి.

తాజాగా వరంగల్ పట్టణంలో ఓ యువతి చీరకట్టులో బైక్ రైడ్ చేస్తూ హంగామా చేసింది. చీర కట్టులో అమ్మాయి బైక్ రైడ్ చేస్తుండటాన్ని చూసి పట్టణవాసులు ఆశ్చర్యపోయారు. ఆమె వీధులన్నీ తిరుగుతూ బైక్ రైడ్ చేసింది. రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్‌ని పాటిస్తూ ఆగిపోతూ కనిపించింది. రోడ్డు భద్రతా నిబంధనలకు కట్టుబడి హెల్మెట్ కూడా ఆమె ధరించింది. వీడియోలో ఆమె ట్రాఫిక్ రూల్స్ పాటించడం వంటివి చేయడం గమనించవచ్చు.
తోటి ప్రయాణీకుల్లో ఒకరు ఆమె రైడింగ్ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. బైక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సందర్భంలో స్కూటర్‌పై "స్టీరియోటైపికల్"ని రాసి ఉంది. దీని ఉద్దేశ్యం మగవారి కంటే ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని విషయాన్ని వారు హైలెట్ చేస్తున్నట్టు గమనించవచ్చు. ఇది ఒక విధంగా అవగాహన రైడ్‌గా పట్టణవాసులు పేర్కొంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 'జెట్టీ బైకర్ గర్ల్'గా పేరొందిన మహిళా బైకర్ ఈ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఇప్పుడు ఈ రీల్ వైరల్ అయ్యింది. దీనికి నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు కూడా ఇలా రైడ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు చీరకట్టు సాంప్రదాయాన్ని పక్కదోవ పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరికొందరు తెలంగాణ అమ్మాయిలతో మామూలుగా ఉండదని కామెంట్ చేశారు. తెలంగాణ అమ్మాయిలు ఏది చేసిన సరే అది ప్రపంచాన్ని షేక్ చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు సారీ ధరించి రైడింగ్ చేసిన దృశ్యాలు ఇంటర్నెట్లో కనిపించాయి. అయితే సారీ ధరిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల కంఫర్ట్ ఉండదు. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు.

కొన్ని సందర్భాల్లో యువతీ యువకులు చేస్తున్న స్టంట్స్ వల్ల ఇతర ప్రయాణికులకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్డుపై స్టంట్స్ చేయడం వల్ల ఇతరుల ఏకగ్రత దెబ్బతినడమే కాకుండా యాక్సిడెంట్లకు అది తావిస్తోంది. రోడ్డు భద్రతపై ఎన్నిసార్లు అవగాహన కల్పించిన కానీ కొందరు యువకులు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు గురిచేస్తూనే ఉన్నారు. ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యేందుకు చేసే ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








