ర్యాష్ డ్రైవింగ్ కేసులో టీవీ నటుడు రోనిత్ రాయ్ అరెస్ట్..

ఆ శాంత్రో కారులో స్నేహ అనే యువతితో పాటుగా ఆమె కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో స్నేహ స్వల్ప గాయాలతో బయటపడగా.. స్నేహ తల్లి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్నేహ చెల్లెలికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చనే అనుమానంతో రోనిత్‌ను వైద్య పరీక్షలకు పంపించారు.
బాధితురాలి వివరాల ప్రకారం.. రోహిత్ సుమారు 110 కి.మీ. వేగంతో వచ్చి తమ కారును ఢీకొట్టాడని, అంత వేగంతో కారును ఢీకొట్టడం వలన తమ కారు పల్టీలు కొట్టిందని, ఈ క్రమంలో తన తల్లి కారులో నుండి కిందకు పడిపోయిందని, చెల్లికి తీవ్రంగా గాయాలయ్యాయని స్నేహ వెల్లడించింది. కాగా.. తాను తాగి డ్రైవింగ్ చేయలేదని రోనిత్ రాయ్ పోలీసులకు చెప్పాడు. ఈ కేసులో రోనిత్‌కు అప్పుడే బెయిల్ కూడా లభించడం గమనార్హం.


Click it and Unblock the Notifications








