రోడ్డు ప్రమాదంలో నటికి గాయాలు.. సీట్‌ బెల్ట్‌ ధరించి ఉంటే..!

రోడ్లపైకి వెళ్లినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నాగానీ.. ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగా అనేక సార్లు మనం ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మన తప్పు కొంచెం కూడా లేకున్నా భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. తాజాగా ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ టీవీ నటి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

టెలివిజన్‌ నటి రుబీనా దిలైక్‌ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంబయి నగరంలోని ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద రుబీనా MG గ్లోస్టర్‌ SUVలో వేచి ఉన్నారు. ఆ సమయంలో టాటా యోధాా నడుపుతున్న డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుకుంటూ వచ్చి రుబీనా కారును ఢీకొట్టారు.

Actress Rubina Dilaik

ఈ ఘటనలో గాయాలపాలైన నటి రుబీనాను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను రుబీనా భర్త, నటుడు అభినవ్‌ శుక్లా షేర్‌ చేశారు. ఎంజీ గ్లోస్టర్ కారుకు చిన్న చిన్న స్కా్చ్‌లు మినహా ఏం కాలేదు. కానీ టాటా యోధా ఫ్రండ్‌ బంపర్‌, ముందు భాగం కొంతమేర దెబ్బతింది.

అనంతరం రుబీనా కూడా తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తనకు వెన్ను, తల బాగాల్లో చిన్నపాటి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానన్నారు. మెడికల్‌ టెస్టులు చేయించుకున్నానని.. అంతా సక్రమంగా ఉన్నట్లు వెల్లడైందని నటి రుబీనా తెలిపారు. టాటా యోధా డ్రైవర్‌పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Actress Rubina Dilaik

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో నటి రుబీనా సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని తెలుస్తోంది. అందువల్లనే ఆమె గాయపడ్డారని సమాచారం. కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్‌తో సంబంధం లేకుండా అంటే వెనుక సీట్‌లో కూర్చున్నాగానీ సీట్‌ బెల్ట్‌ను ధరించడం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి.

గత కొన్ని నెలల క్రితం ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. ముందు సీట్లతో కూర్చున్న ప్రయాణికులతోపాటు వెనుక సీట్లలోని వారు కూడా తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌ ధరించాలని సూచించారు. వెనుక సీట్లలో కూర్చుకున్న ప్రయాణికులు సీట్‌ బెల్ట్‌ ధరించకపోతే వారికి కూడా చలాన్‌లు విధిస్తున్నారు.

Actress Rubina Dilaik

కొన్ని నెలల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త సైరస్‌ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఆ సమయంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ సీట్‌ బెల్ట్‌ ధరించలేదు. ఆ ఘటన అనంతరం కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ఆదేశాలు ఇచ్చారు. కార్లలో వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్‌ బెల్ట్‌ ధరించాలని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతుండడం ప్రస్తుతం దేశంలో ప్రధాన సమస్యగా మారింది. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద మెట్రో పాలిటన్‌ నగరాల్లో అత్యధిక శాతం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ఆందోళన కలిగిస్తోంది.

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నగరాల్లో ఢిల్లీ తర్వాత ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఉన్నాయి. ఢిల్లీలో రోడ్డు ప్రమాదాల రేట్‌ 20.3 శాతంగా ఉంది. అదే మంబయిలో 18.8 శాతంగా ఉంది. అయితే ఢిల్లీలో కార్‌ డెన్సిటీ 108/km గా ఉంది. అదే మంబయిలో ఐదు రెట్లు తక్కువగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో బెంగళూరులో తక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య మాత్రం అధికంగా ఉంటుంది.

దేశ రాజధాని ప్రాంతం (NCR)లోని అధికంగా నోయిడా సెక్టార్‌ 12లో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 9 శాతం ప్రమాదాలు ఇక్కడే నమోదవుతున్నాయి. అనంతరం గురుగ్రాం సెక్టార్‌ 17, గురుగ్రాం సెక్టార్‌ 45, భారత్‌ నగర్‌, సుల్తాన్‌పురిలో నమోదవుతున్నాయి. మంబయిలో ఘట్కోపర్‌ వెస్ట్‌లో సుమారు 5 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ముంబయిలోని నెరుల్‌, మీరా రోడ్‌, థానే వెస్ట్‌ మరియు కండివాలి వెస్ట్‌లోను ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, June 12, 2023, 14:00 [IST]
English summary
Television actress rubina dilaik met with an accident in mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+