కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

కామెడి సర్కస్ అనే హిందీ టెలివిజన్ షో ద్వారా పాపులారీటి దక్కించుకున్న ప్రముఖ టెలివిజన్ హాస్యనటుడు కృష్ణ అభిషేక్ (krushna-abhishek) తాజాగా కోటి రూపాయలకు పైగా ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కృష్ణ అభిషేక్ ప్రస్తుతం ది కపిల్ శర్మ షో అనే టెలివిజన్ షోలో కీలకంగా నటిస్తున్నాడు మరియు స్టాండప్ కమెడియన్ గా మంచి పేరు దక్కించుకున్నాడు. కృష్ట గ్యారేజ్ లో ఇప్పటికే అనేక ఖరీదైన కార్లు ఉండగా, తాజాగా జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ కి మరో ఖరీదైన ఎస్‌యూవీని ఇందులో చేర్చుకున్నాడు.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఖరీదైన జిఎల్ఈ (Mercedes-Benz GLE) లగ్జరీ ఎస్‌యూవీని ఆయన కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ సోదరి మరియు ఆర్టిస్ట్ అయిన ఆర్తి సింగ్ ఇద్దరూ కలిసి తమ కొత్త కారుతో దిగిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న అత్యంత ఖరీదైన మరియు గొప్ప కార్లలో జిఎల్ఈ ఎస్‌యూవీ కూడా ఒకటి. ఇది ఈ జర్మన్ బ్రాండ్ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ కార్లలో ఒకటిగా ఉంది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

ధనవంతులు, సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే కార్లలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ కూడా ఒకటి. భారత మార్కెట్లో Mercedes-Benz GLE ధరలు రూ. 84 లక్షల నుండి రూ.1 కోటి రేంజ్ లో ఉన్నాయి. ఈ లగ్జరీ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అయితే, భారత మార్కెట్లో దాని డీజిల్ ఇంజన్ వేరియంట్ కు డిమాండ్ అధికంగా ఉంటుంది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

ఈ ఎస్‌యూవీలోని 2.1 లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి పవర్ ను మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని మరింత శక్తివంతమైన వేరియంట్ లో 3.0-లీటర్ వి6 డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 258 బిహెచ్‌పి పవర్ ను మరియు 620 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కోరుకునే వారికి ఇందులో 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది గరిష్టంగా 333 బిహెచ్పి పవర్ ను మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ ను జనరేట్ చేస్తుంది. అన్ని ఇంజన్ వేరియంట్‌ లు కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తాయి.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

కృష్ణ అభిషేక్ టెలివిజన్ కామెడీ షోలకు సంబంధించిన ప్రసిద్ధ నటులలో ఒకరు మరియు కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో తన నటనకు ప్రసిద్ది చెందారు. ఇతను పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. అంతేకాకుండా, బాలీవుడ్ సినీ పరిశ్రమలో జరిగే వివిధ కార్యక్రమాలకు కూడా హోస్ట్ గా పనిచేశారు. కృష్ట గ్యారేజ్ లో మెర్సిడెస్ బెజ్ సిఎల్ఏ, ఆడి క్యూ5 మరియు ఆడి ఏ3 క్యాబ్రియోలెట్‌ వంటి పలు ఇతర కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. కృష్ణ సోదరి అయిన ఆర్తి సింగ్ తన అన్న కృషిని అభినందించారు.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ గతేడాది నవంబర్ నెలలో భారత మార్కెట్లో తమ సరికొత్త హైపర్ హ్యాచ్‌బ్యాక్ మెర్సిడెస్-ఏఎమ్‌జి ఏ45 ఎస్ 4మ్యాటిక్ ప్లస్ (Mercedes-AMG A45 S 4MATIC+) విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఎంట్రీ లెవల్ సిరీస్ అయిన A-క్లాస్ నుండి వచ్చిన ఈ హై పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 79.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇది భారతదేశంలోనే 'అత్యంత శక్తివంతమైన లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ మరియు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ ఇంజన్ సిరీస్ కలిగిన ప్రొడక్షన్ కారు అని కంపెనీ పేర్కొంది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

మెర్సిడెస్ బెంజ్ యొక్క పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అయిన ఏఎమ్‌జి (AMG) ఈ చిన్న కారును చాలా శక్తివంతంగా తీర్చిదిద్దింది. ఈ కారును ప్రత్యేకమైన 'డ్రైవింగ్ డైనమిక్స్ మరియు పెర్ఫార్మెన్స్' తో అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ చిన్న లగ్జరీ కారులో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన శక్తివంతమైన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 421 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 270 కిమీగా ఉంటుంది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన టెలివిజన్ కమెడియన్!

ఆసక్తికరకమైన విషయం ఏంటంటే, ఈ కొత్త ఇంజన్ పూర్తిగా చేతితో అసెంబుల్ చేయబడింది. జర్మనీలోని అఫాల్టర్‌బాక్‌లో ఉన్న ఏఎమ్‌జి ఇంజన్ ఫ్యాక్టరీలో కొత్తగా రూపొందించిన ప్రొడక్షన్ లైన్ పై ఇది నిర్మించబడింది. మెర్సిడెస్ ఏఎమ్‌జి ఫ్యాక్టరీలో "వన్ మ్యాన్, వన్ ఇంజన్" సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇది ఇండస్ట్రీ 4.0 ప్రక్రియలను ఒక వినూత్న స్థాయికి తీసుకువెళ్లింది. ఇందులో మొత్తం 6 ఏఎమ్‌జి డైనమిక్ సెలెక్ట్ డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. అవి: స్లిప్పరీ, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్, ఇండివిడ్యువల్ మరియు రేస్.

Most Read Articles

English summary
Telivision comedian krushna abhishek buys mercedes benz gle details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X