ఫోర్డ్ ఎండీవర్ కారుపైకి ఎక్కిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియా వైరల్ అయిపోతున్న వీడియో
జనసేన పార్టీ అధినేత, తెలుగు సినీ రంగంలో అత్యధిక అభిమానులను కలిగిన ఉన్న 'పవన్ కళ్యాణ్' గురించి దాదాపు ఈ రోజు అందరికి తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది, రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనీ ఆరాటపడుతూ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో స్థాపించాడు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా వేడెక్కిపోయాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ మీద మరో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అయితే ఈ సందర్భంలో 'పవన్ కళ్యాణ్' కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామానికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ కూలిన గోడలు, ఇల్లు చూసాడు. అక్కడి ప్రజలతో కొంత సేపు సంబాషించాడు.

పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వస్తున్న సంగతి ముందే తెలుసుకున్న పోలీసులు ఆయన ఫ్రయాణిస్తున్న కార్లను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లేదని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులను కోరారు. మొత్తమ్ మీద పవన్ కళ్యాణ్ కార్లను పోలీసులు ఆపడంతో ఇంక చేసేది లేక కాలినడకనే బయలుదేరాడు. కార్లు అక్కడ వదిలి హైవే మీద మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు.

పవన్ కారు దిగేయటం, అక్కడ నుంచి కాలి నడకలో వెల్లడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సన్నివేశం మొత్తమ్ ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాను గుర్తుకు తెస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రయాణించిన ఎస్కార్ట్ వాహనాలలో మహీంద్రా స్కార్పియో, టియువి 300 మొదలైనవి ఉన్నాయి. కాగా పవన్ కళ్యాణ్ ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ కారుపైన కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు.

పవన్ కళ్యాణ్ కారు యొక్క రూప్ పైన కూర్చోవడంతో, వెనుక వచ్చే కార్లపైన కూడా చాలామంది పార్టీ నాయకులు, అభిమానులు కూర్చున్నారు. చుట్టూ బాడీగార్డ్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. అయితే ఈ విధంగా కారుపైన ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

మోటార్ వాహన చట్టం ప్రకారం కారు యొక్క రూప్ పైన కూర్చుకు ప్రయాణించడం చట్టరీత్యా నేరం. ఇది ప్రమాదానికి కారణం అవుతుంది. అందులోనూ హైవేపైన ఈ విధంగా ప్రయాణించడం వల్ల ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ యొక్క 'ఫోర్డ్ ఎండీవర్' కారు విషయానికి వస్తే, ఇది ఫోర్డ్ కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్. ఇది మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి అత్యద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది. కావున ఎక్కువమంది ఫోర్డ్ కంపెనీ నుంచి లగ్జరీ కార్ కావాలనుకునేవారు ఈ ఎండీవర్ కారును కొనుగోలు చేస్తారు.

పవన్ కళ్యాణ్ సెలబ్రెటీ కావడంతో ఇప్పటికే చాలా మంది అభిమానులను కలిగి ఉన్నారు. తమ హీరో ఈ విధంగా చేసాడని ఎక్కువమంది తనని ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటి వారి మీద పోలీసులు కఠినంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఒక సెలబ్రెటీ ఈ విధంగా చేయడం వల్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది తెలియాల్సిన సమాధానం.

ప్రస్తుతం భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలు ఈ చర్యలను తీసుకురావడం జరిగింది. కావున ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఎవరికైన పోలీసులు ఒకే రకమైన శిక్షను అమలు చేయాలి. సామాన్య పౌరుడు చేస్తే శిక్షలు అమలు చేయడం, సెలబ్రెటీ చేస్తే ఊరుకుండిపోవడం అనేది పోలీసులపైనే ప్రజలకున్న నమ్మకాన్ని పోగోడుతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ప్రజా నాయకుడంటే తప్పకుండా ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, అదే సమయంలో ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు కేవలం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు, ఎక్కువమంది అభిమానవులను కలిగి ఉన్న టాలీవుడ్ హీరో కూడా. కావున తమ హీరో కారు రూప్ పైన ప్రయాణించడం వల్ల తాము కూడా ఇలాగె చేస్తే బాగుంటుందని అనుకునే అభిమానులు లేకుండా పోలేదు. కావున ప్రజానాయకుడైన 'పవన్ కళ్యాణ్' లాంటి నాయకులు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications








