అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు..

టాలీవుడ్ చిత్ర సీమలో పరిచయం అవసరం లేని పేర్లలో 'విజయ్ దేవరకొండ' పేరు ఒకటి. 'నువ్విలా' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన 'విజయ్ దేవరకొండ' గీత గోవిందంతో పాగా పాపులర్ అవ్వడమే కాకున్నా 'వరల్డ్ పేమస్ లవర్' సినిమాతో యువతుల మనసులో పేమస్ లవర్ గా నిలిచాడు. అయితే ఈ నెల 25 న 'లైగర్' పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

అయితే ఈ వరల్డ్ పేమస్ లవర్ దగ్గర ఎలాంటి కార్లు ఉన్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ (BMW 5-Series):

విజయ్ దేవరకొండ కార్ గ్యారేజ్ లో లగ్జరీ కార్లలో ఒకటి బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్. ఈ జర్మన్ లగ్జరీ కారును విజయ్ చాలా సార్లు డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఇతని వద్ద ఉన్న ఈ 5 సిరీస్ కారు వైట్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది, కావున వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ (BMW 5-Series) మంచి పనితీరుని అందించడానికి ఇది మూడు ఇంజిన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అవి 2.0-లీటర్ 250 పిఎస్ పెట్రోల్, 2.0-లీటర్ 190 పిఎస్ డీజిల్ మరియు 3.0-లీటర్ 265 పిఎస్ డీజిల్ ఇంజిన్లు. దేశీయ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ప్రారంభ ధర రూ. 60 లక్షలకు పైగా ఉంటుంది.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

విజయ్ దేవరకొండ వద్ద ఉన్న ఈ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ (BMW 5-Series) కారు మాత్రమే కాదు దీనికున్న నెంబర్ ప్లేట్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కారు నెంబర్ 1116. ఈ నెంబర్ అంత ఫ్యాన్సీ కాకపోయినా అతనికి మాత్రం చాలా ప్రత్యేకమైనది అని చెబితున్నారు.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

కారు నెంబర్ అయిన 1,1, 1 మరియు 6 సంఖ్యల మొత్తం 9. ఈ సంఖ్య విజయ్ పుట్టిన తేదీని సూచిస్తుంది. ఇతడు దేవరకొండ గోవర్ధన్ రావు మరియు దేవరకొండ మాధవిలకు 1989 మే 09 న జన్మించాడు. కావున ఈ నెంబర్ అతనికి చాలా ప్రత్యేకమైనది అని తెలుస్తుంది.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ (Land Rover Range Rover):

ఎక్కువమంది ప్రముఖులు ఇష్టపడే లగ్జరీ కార్లలో ఒకటి ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ (Land Rover Range Rover). కావున ఈ లగ్జరీ కారుని మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా కలిగి ఉన్నారు. ఇతని వద్ద ఉన్న ఈ కారు పేస్ లిఫ్టెడ్ ఫోర్త్-జనరేషన్ మోడల్. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆధునిక సదుపాయాలను కూడా అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది సెలబ్రటీలు ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ 2.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ పెట్రోల్, 5.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ డీజిల్ మరియు 4.4-లీటర్ డీజిల్ వంటి ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అయితే భారతీయ మార్కెట్లో 3.0-లీటర్ డీజిల్ వేరియంట్ ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి (Mercedes Benz GLC):

విజయ్ దేవరకొండ గ్యారేజ్ లో ఉన్న మరో జర్మన్ లగ్జరీ కారు ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి (Mercedes Benz GLC). ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాధరణ పొందిన మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎస్‌యూవీ. ఎక్కువగా ఇతను ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

భారతీయ మార్కెట్లో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధరలు రూ.60 లక్షలకు పైగానే ఉంటాయి. అయితే ఇది మార్కెట్లో జిఎల్‌సి 200 మరియు 200డి అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఇది భారతదేశంలో 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్ లతో లభ్యం అవుతుంది. ఇందులో విజయదేవరకొండ ఏ వేరియంట్ ఉపయోగిస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలియదు.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

పైన చెప్పిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ మాత్రమే కాకుండా వోల్వో కంపెనీ యొక్క ఎక్స్‌సి 90 (XC90) మరియు ఫోర్డ్ కంపెనీ యొక్క మస్టాంగ్ కూడా అతని గ్యారేజ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఖరీదైన కార్లు. ఇలాంటి ఖరీదైన కార్లు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది సెలబ్రెటీలు కూడా కలిగి ఉన్నారు.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ అయిన లైగర్ విషయానికి వస్తే, ఇది పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వస్తున్న సినిమా. ఇందులో అనన్యపాండే కథానాయకి, కాగా రమ్యకృష్ణ మొదలైనవారు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా రేపు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదలకానుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) లగ్జరీ కార్లు.. బిఎండబ్ల్యు నుంచి ల్యాండ్ రోవర్ వరకు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది ఫ్యాన్స్ కలిగిన హీరోలలో 'విజయ్ దేవరకొండ' ఒకరు. ఇతని వద్ద బిఎండబ్ల్యు నుంచి ఫోర్డ్ మస్టాంగ్ వంటి అద్భుతమైన మరియు ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ తో మంచి పనితీరుని అందించే లగ్జరీ కార్లు.

ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరియు ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2022, 11:21 [IST]
English summary
Telugu star vijay deverakondas cars from land rover to bmw 5 series
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+