మోటార్‌సైకిల్ యాక్సిడెంట్స్‌కు పది సాధారణ కారణాలు
మోటార్‌సైకిల్ నడపటం అనేది ఓ కళ. అయితే, సరైన అవగాహన, శిక్షణ లేకుండా మోటార్‌సైకిల్ నడిపితే ప్రమాదాలకు గురి కావటం తప్పదు. మోటార్‌సైకిల్ ప్రపంచంలో యాక్సిడెంట్స్ కూడా ఓ భాగం అయిపోయాయి.
మోటార్‌సైకిల్ నడుపుతున్న యాక్సిడెంట్ జరగటానికి అనేక కారణాలుంటాయి. నిర్లక్ష్యంగా నడపటం, సిగ్నల్స్ జంప్ చేయటం, సరైన శిక్షణ తీసుకోకుండానే రైడింగ్ ప్రారంభించడం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతే లిస్టే అవుతుంది.
ఈనాటి మన కథనంలో మోటార్‌సైకిల్ యాక్సిడెంట్స్‌కి కారణమయ్యే 10 సాధారణ అంశాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

1. లేన్ కట్టింగ్
త్వరగా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశ్యంతో కొందరు మోటారిస్టిలు నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా లైన్లు దాటుతూ దూసుకుపోతుంటారు. ఇలాంటి సమయంలో చుట్టు ప్రక్కల నుంచి వచ్చే వాహనాలను వారు గమనించరు, ఫలితంగా ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటారు.

2. సెల్‌ఫోన్ ఉపయోగించడం
కార్ డ్రైవింగ్‌లోనే బైక్ రైడింగ్‌లో కూడా సెల్‌ఫోన్ ఉపయోగించడం ప్రమాదకరం. చాలా మంది రైడర్లు అవసరం లేకపోయినా ఇయర్‌ఫోన్లను చెవులలో ఇరికించుకొని, ట్రాఫిక్‌ను నిర్లక్ష్యం చేస్తూ, సంగీతం వింటూ టూవీలర్స్ నడుపుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య, ఇలా చేయటం వలన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

3. ఓవర్‌స్పీడ్
బైక్‌ను నడపటం అంటే జెట్ విమానం నడపటం అన్నట్లుగా భావిస్తుంటారు కొందరు. పరిమితికి మించిన వేగంతో టూవీలర్ నడుపుతూ ప్రమాదంపై పరుగులు తీస్తుంటారు. మితిమీరిన వేగం ఎల్లప్పుడూ ప్రమాదకరమే.

4. మలుపును అంచనా వేయకపోవటం
రోడ్డుపై (ప్రత్యేకించి ఘాట్ రోడ్డుపై) మలుపులు చాలా ప్రమాదకరమైనవి. వీటిని దూరం నుంచే గ్రహించి, టూవీలర్ వేగాన్ని నియంత్రించుకోవాలి. మలుపుల విషయంలో సరైన అంచనా లేకపోతే, రోడ్డుపై నుంచి వాహనం జరిపోవటం ఖాయం. కాబట్టి, మలుపును జడ్జ్ చేయటంలో ఎల్లప్పుడూ ఖచ్చితంగా వ్యవహరించాలి.

5. బైక్‌పై నుంచి ఒరిగి రైడ్ చేయటం
కొంత మంది రైడర్లు బైక్‌ను నడిపేటప్పుడు సాధారణ మలుపుల వద్ద కూడా మోటోజిపి స్టయిల్‌లో బైక్‌పై ఒరగాల్సిన దాని కన్నా ఎక్కువగా ఒరిగి ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. టూ మచ్ లీనింగ్ ఎప్పటికీ మంచిది కాదు.

6. ట్రాక్షన్ కోల్పోవటం
డర్ట్ ట్రాక్‌లు, వదులుగా ఉండే మట్టి రోడ్లపై నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుకి, టైరుకి మధ్య ఎప్పుడైతే బంధం (ట్రాక్షన్) తెగిపోతుందో, ఆ వెంటనే ప్రమాదంతో మన బంధం ముడిపడిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

7. స్టంట్స్ చేయటం
అనవసరమైన చోట, మిత్రుల ముందు జస్ట్ షో ఆఫ్ కోసమో స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు కూడా ఉన్నారు. స్టంట్స్ అనేక కొన్ని నిర్ధిష్ట పరిమితులకు లోబడి, నిపుణుల ఆధ్వర్యంలో చేయబడుతాయి. ఎవరు పడితే వారు స్టంస్ట్ చేస్తే, హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుంది.

8. మత్తులో నడపటం
ఆల్కహాల్, డ్రగ్స్ సేవించి వాహనం నడపటం మీకే కాదు, మీతో పాటుగా రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదంగా పరిణమిస్తుంది. మత్తులో మైండ్ కంట్రోల్ ఉండదు, అలాంటి స్థితిలో వాహనం నడపటం అంటే, నరకానికి టికెట్ చేతిలో పెట్టుకొని రైడ్ చేయటమే అని గుర్తుంచుకోండి.

9. కండిషన్‌లో లేని బైక్
మోటార్‌సైకిల్ ప్రమాదాలకు మీరే కాదు, కొన్ని సందర్భాల్లో మీ బైక్ కూడా కారణం కావచ్చు. సరైన కండిషన్‌లో లేని మోటార్‌సైకిల్‌ను నడపటం, ఇరుసు లేని చక్రం ఉన్న బండిపై ప్రయాణించడమే అని గుర్తుంచుకోండి.

10. డీహైడ్రేషన్
అవునుండి.. సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా.. యాక్సిడెంట్లకు డీహైడ్రేషన్, వడదెబ్బలు కూడా కారణం కావచ్చు. కాబట్టి, వేసవిలో టూవీలర్ నడుపుతున్నట్లయితే, అవకాశం దొరికినప్పుడల్లా శీతల పానీయాలు సేవించడం, ఎక్కువగా నీరు త్రాగటం చేస్తుండండి.

టూవీలర్ నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, రోడ్డు స్థితిగతులను అధ్యయనం చేసుకుంటూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలి. హ్యావ్ ఏ సేఫ్ రైడింగ్!!


Click it and Unblock the Notifications








