సముద్రాలపై వీటి వేగానికి అవధులే లేవు..!!

By N Kumar

నీటిలో అత్యధిక వేగంతో ప్రయాణించడం అనేది కాస్త రిస్క్‌తో కూడుకున్నదే, ఎందుకంటే ప్రయాణంలో ఏదైనా తేడా జరిగితే బోల్తా పడే అవకాశం ఉంది. అయినప్పటికీ నీటి మీద గరిష్ట వేగంతో ప్రయాణించే బోట్లు ఉన్నాయి.

ప్రపంచంలో కెల్లా అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లు, విమానాలు, కార్లు మరియు బైకులు గురించి చదివే ఉంటారు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేడు "నౌకలు" శీర్షిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నీటి మీద అత్యధిక వేగంతో ప్రయాణించే సాధనాల గురించి తెలుసుకుందాం...

10. అత్యంత వేగవంతమైన సబ్‌మెరైన్

10. అత్యంత వేగవంతమైన సబ్‌మెరైన్

సోవియట్ కె-222 అనే ఈ సబ్‌మెరైన్ ప్రపంచంలోకెళ్లా అత్యంత వేగవంతమైన సబ్‌మెరైన్. దీని గరిష్ట వేగం గంటకు 44.7 కిలోనాట్స్. టైనానియమ్ లోహంతో నిర్మించబడిన ఇందులో 177మెగావాట్ విఎమ్-5ఎమ్ ప్రసరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అనుసంధానం గల సుమారుగా 80,000 హార్స్‌పవర్ ఉత్పత్తి చేయగల స్టీమ్ టర్బైన్‌లు కలవు.

09. అత్యంత వేగవంతమైన యుద్ద నౌక

09. అత్యంత వేగవంతమైన యుద్ద నౌక

HCMS Bras D'Or 400 యుద్ద నౌక యొక్క గరిష్ట వేగం 63 కిలోనాట్స్‌గా ఉంది. ఇంత వరకూ ఎవరూ నిర్మించనటువంటి యుద్ద నౌకను కెనడాకు చెందిన హైడ్రోఫాయిల్ వారు ప్రయోగాత్మకంగా నిర్మించారు. అలెగ్జాండర్ గ్రాహంబెల్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్మించారు. ఇందులో రెండు ప్రాట్ అండ్ విట్నీ టర్బైన్ ఇంజన్‌లు కలవు.

08. అత్యంత వేగవంతమైన తెర చాప నౌక

08. అత్యంత వేగవంతమైన తెర చాప నౌక

తెర చాపలు కలిగిన నౌకల్లో ప్రపంచంలోకెళ్లా ఇది అత్యంత వేగవంతమైనది. దీని వేగం గంటకు 65.45కిలోనాట్స్‌గా ఉంది. దీనికి వెస్టాస్ సెయిల్ రాకెట్ 2 అనే పేరు కూడా ఉంది.

07. అత్యంత వేగవంతమైన యాచ్

07. అత్యంత వేగవంతమైన యాచ్

ఈ యాచ్ వేగం గంటకు సుమారుగా 70 కిలోనాట్స్ గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో పోటీల్లో ఇది విజేతగా నిలిచింది. ఒక సారి మారిటైమ్ ప్రచురించిన కథనం ప్రకారం ఇది బెంట్లీ మస్లేన్ వేగాన్ని కలిగి ఉన్నట్లు తెలిసింది.

06. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బోట్

06. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బోట్

మెర్సిడెస్ బెంజ్‌ మరియు సిగరెట్టీ సంయుక్తంగా అభివృద్ది చేసిన సిగరెట్టీ-ఏఎమ్‌జి ఎలక్ట్రిక్ బోట్ అత్యంత వేగంగా పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ బోట్‌గా నిలిచింది. దీని వేగం గంటకు 87కిలోనాట్స్ గా ఉంది. ఇది సుమారుగా 2,220 హార్స్‌పవర్ ఉత్పత్తి చేయడానికి 12 విద్యుత్‌ మోటార్లను ఇందులో వినియోగించారు.

05.అత్యంత వేగవంతమైన చదునైన పడవ

05.అత్యంత వేగవంతమైన చదునైన పడవ

సమాతరంగా బల్లకట్టు ఆకారంలో ఉన్న ఈ పడవ గరిష్ట వేగం గంటకు 99 కిలోనాట్స్‌గా ఉంది. దీనిని బ్రాడ్ రోలాండ్స్ సౌత్ బే 925సిఆర్ గా సంభోదిస్తారు.

04. అత్యంత వేగవంతమైన తెప్ప

04. అత్యంత వేగవంతమైన తెప్ప

మన చిన్న చిన్న చెరువుల్లో ఇలాంటి తెప్పలను చాలానే చూస్తుంటాం. తెప్పలలో అన్నింటిలోకెల్లా అత్యధిక వేగంగా ప్రయాణించే దీనిని స్పిరిట్ ఆఫ్ ఖతార్ అంటారు. దీని గరిష్ట వేగం గంటకు 212 కిలోనాట్స్‌గా ఉంది. ఇది సుమారుగా 9,000 హార్స్‌పవర్‌న ఉత్పత్తి చేయడానికి రెండు లైకమింగ్ టర్బైన్లను వినియోగించారు.

03. అత్యంత వేగవంతమైన ఫ్యూయల్ హైడ్రోప్లేన్

03. అత్యంత వేగవంతమైన ఫ్యూయల్ హైడ్రోప్లేన్

అత్యధిక ఇంధాన్ని గ్రహించే ఇలాంటి ఫ్యూయల్ హైడ్రోప్లేన్ నేల మీదనే కాకుండా, నీటి మీద కూడా అద్బుతమైన వేగాన్ని అందుకుంటాయి. రోడ్ల మీద పరుగులు తీసే వాటికి ఏ మాత్రం తీసిపోకుండా పనితీరును చూపిస్తాయి. దీని గరిష్ట వేగం గంటకు 228 కిలోనాట్స్‌గా ఉంది. ఇది 8,000 హార్స్ పవర్ ఉత్పత్తి చేయడానికి హెమివి8 ఇంజన్‌ను వినియోగించారు.

02. అత్యంత వేగవంతమైన హైడ్రో ప్లేన్

02. అత్యంత వేగవంతమైన హైడ్రో ప్లేన్

కె7 మొదటి అద్బుతమైన క్రేజీ టర్బైన్ హైడ్రోప్లేన్. ఇది 1955-1964 కాలం మధ్యలో ఏకంగా ఏడు సార్లు గరిష్టంగా పరుగులు తీసే హైడ్రోప్లేన్‌గా రికార్డ్ సృష్టించింది. చివరి రికార్డుల్లో దీని గరిష్ట వేగం 276కిలోనాట్స్‌గా ఉంది.

01. అత్యంత వేగవంతమైన స్పీడ్ బోట్

01. అత్యంత వేగవంతమైన స్పీడ్ బోట్

స్పిరిట్ ఆఫ్ ఆస్ట్రేలియాగా పిలువబడే ఈ స్పీడ్ బోట్ గరిష్ట వేగం గంటకు 276.3కిలోనాట్స్‌గా ఉంది. 1978 ఏడాదిలో కెన్ వార్బీ డిజైన్ చేసిన ఈ బోట్ గరిష్ట వేగాన్ని రికార్డ్ చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, October 3, 2016, 14:39 [IST]
English summary
Read In Telugu: Ten Of The Fastest Boats Ever Made
Read more on: #నౌకలు #ships
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+