Mercedes Benz G class ఎప్పుడు చూడని సన్నివేశం.. తోపుడు బండిలా బెంజ్ కారును నెట్టిన పదిమంది.. వీడియో వైరల్

సాధారణంగా కారు బ్యాటరీ పనిచేయనప్పుడు వాహనాన్ని నెట్టడం ద్వారా దాన్ని స్టార్ట్ చేయడం చూస్తుంటాం. చిన్న హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ లేదా SUV కార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సులభంగా ఉంటుంది. కానీ పెద్ద SUV కార్లలో ఇదే సమస్య ఎదురైనప్పుడు దాన్ని నెట్టడానికి చాలా శక్తి అవసరం.

ఇటీవల న్యూఢిల్లీలో మెర్సిడెస్ బెంజ్ G - క్లాస్ బ్యాటరీ విఫలం కావడంతో దాన్ని స్టార్ట్ చేయడానికి కారు వెనుక నుంచి పది మంది నెట్టవలసి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. మెర్సిడెంజ్‌ బెంజ్‌ G క్లాస్‌ భారీ మరియు అత్యంత శక్తివంతమైన పెద్ద ఎస్‌యూవీ కారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Mercedes Benz G class

మెర్సిడెంజ్‌ బెంజ్‌ G క్లాస్‌ సుమారు 2.5 టన్నుల బరువు మరియు దాని పొడవాటి, బాక్సీ నిర్మాణంతో, SUVలలో ఒకటిగా నిలిచింది. ఈ SUV బ్యాటరీ డిశ్చార్జింగ్ కారణంగా ఇంజిన్‌ స్టార్ట్‌ కాకపోవడంతో పదిమంది ఈ SUVని నెట్టి స్టార్ట్‌ చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని భావించారు.

అయితే ఈ క్రమంలో G- క్లాస్‌ స్టార్ట్‌ అవ్వడానికి పుష్‌ చేస్తున్న వారికి కొన్ని కీలక విషయాలు తెలియవు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న వాహనాన్ని కేవలం నెట్టడం ద్వారా ప్రారంభించలేం. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన అన్ని ఇతర వాహనాల మాదిరిగానే, మెర్సిడెస్‌ బెంజ్‌ G క్సాస్‌లో క్లచ్ పెడల్ లేదు. దాని గేర్‌బాక్స్‌లో ఓపెన్ క్లచ్ ఉంది. ఈ రెండు పరిస్థితులు ఇంజిన్‌ను క్రాంక్ చేయకుండా నిరోధిస్తాయి.

ఈ పరిస్థితుల దృష్ట్యా, వాహనంలో దాని బ్యాటరీ పనిచేయనప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ప్రారంభించడానికి ఏకైక పద్ధతి దానిని జంప్ స్టార్ట్ చేయడమే. వాహనం బ్యాటరీని జంప్-స్టార్ట్ చేయడానికి, ఫంక్షనల్ బ్యాటరీతో ఉన్న మరో వాహనం అవసరం. బూస్టర్ కేబుల్‌లను ఉపయోగించి బ్యాటరీల టెర్మినల్‌లను కనెక్ట్ చేయడం ద్వారా ఆపరేషనల్ బ్యాటరీ నుంతి క్షీణించిన బ్యాటరీకి శక్తి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి ఇతర వాహనంలోని డోనార్‌ బ్యాటరీ.. ఫెయిల్‌ అయిన బ్యాటరీ కంటే ఎక్కువ వోల్టేజీని కలిగి లేదని నిర్ధారించుకోవాలి. అంతే కాకుండా ఈ పద్ధతిలో కారు స్టార్ట్‌ చేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూటింగ్ ప్రమాదాన్ని నివారించడానికి రెండు వాహనాల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి.

మెర్సిడెస్‌ బెంజ్‌ G63 AMG దేశంలో మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన AMG SUVలలో ఒకటి. దీనిని సాధారణంగా జి-వాగన్ అని పిలుస్తారు. కొన్నేళ్లుగా G-Wagen డిజైన్ పెద్దగా మారలేదు. బాక్సీ రూపంతో పాటు అసాధారణమైన శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. వీడియోలో ప్రదర్శించబడిన G63 AMG మునుపటి తరానికి చెందినదిగా తెలుస్తోంది, ఇందులో 5.5 లీటర్ V8 ఇంజిన్ అమర్చబడింది.

ప్రస్తుత తరం G63 AMG భారతీయ సెలబ్రిటీలలో విపరీతంగా ప్రజాదరణ పొందింది. 4.0-లీటర్, బై-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 576 bhp వద్ద 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి, నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది. కాగా ఎక్స్‌షోరూమ్‌లో G63 AMG ప్రారంభ ధర రూ. 3.30 కోట్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 15, 2023, 12:22 [IST]
English summary
Ten people push to start mercedes benz g class in new delhi video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+