Just In
- 7 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 20 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 21 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసం
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Sports
దిగ్గజాలా మజాకా.. మొన్న సెహ్వాగ్.. నిన్న లారా, తరంగా.. ఆ జోరు ఏ మాత్రం తగ్గలేదు.!
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వ్యక్తులలో సచిన్ టెండుల్కర్ ఒకరు. క్రికెట్ రంగంలో చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులు సృష్టించడమే కాకుండా క్రికెట్ ప్రపంచంలో మరిచిపోలేని చరిత్రను సృష్టించాడు.

గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలువబడే సచిన్ టెండుల్కర్ ఖరీదైన మరియు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కూడా. సచిన్ ఖరీదైన బిఎండబ్ల్యు కార్లను కలిగి ఉన్నాడు, ఇవి మాత్రమే కాకుండా వీటితో పాటు ఇతర లగ్జరీ బ్రాండ్ కార్లు కూడా ఉన్నాయి.

సాధారణంగా సచిన్ కి కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. యితడు ఇప్పటికే అనేక సార్లు కార్లు డ్రైవ్ చేస్తున్న ఫోటోలు నెట్వర్కింగ్ సైట్లలో కనిపించాయి. కానీ ఇటీవల అతను తన పోర్స్చే 911 టర్బో ఎస్ కారును డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఈ లగ్జరీ కారులో సచిన్ ని చూడటం ఇదే మొదటి సారి.
MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

సచిన్ టెండుల్కర్ అప్పుడప్పుడూ వీకెండ్స్ లో డ్రైవ్ కోసం వెల్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కారులో కనిపించాడు. సచిన్ తన పోర్స్చే 911 ఎస్ టర్బోను 2015 లో నమోదు చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సచిన్ కి భారతదేశంలో పోర్స్చే 911 టర్బో ఎస్ ఉందని ఎవరికీ తెలియదు.

ఇది సాధారణ పోర్స్చే 911 కాదు. ఇది టర్బో ఎస్ వేరియంట్, చాలా శక్తివంతమైనది. ఈ పోర్స్చే 911 ఎస్ కారు 560 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్పోర్ట్ క్రోనో ప్యాక్‌తో సహా పలు పనితీరు ఆధారిత ప్యాకేజీలను కలిగి ఉన్న కారు ఇది. ఈ కారు 20 సెకన్ల ఓవర్ బూస్ట్ సమయంలో 700 ఎన్ఎమ్ నుండి 750 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ కూడా ఇందులో ఉంది.
MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

పోర్స్చే 911 టర్బో ఎస్ కార్ ఇంటీరియర్‌లో మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ టెక్నాలజీ, ప్రీమియం లెదర్ మరియు అల్కాంటారా అప్హోల్స్టరీ, బకెట్ సీట్లు మరియు ఇతర లగ్జరీ ఫీచర్లు కలిగి ఉంటుంది.

పోర్స్చే 911 టర్బో ఎస్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 318 కిలోమీటర్లు. పోర్స్చే 911 టర్బో ఎస్ కార్ ఇంటీరియర్ లో మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కనెక్టివిటీ టెక్నాలజీ, ప్రీమియం లెదర్ మరియు అల్కాంటారా అప్హోల్స్టరీ, బకెట్ సీట్లు మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
Image Courtesy: CS 12 VLOGS