టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి

పరిచయం అవసరం లేని పేర్లలో ఒకటి 'సానియా మీర్జా'. ఎందుకంటే భారతదేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణిగా మన దేశానికీ గొప్ప గుర్తింపును తీసుకువచ్చింది. చిన్న తనం నుంచే ఆటలలో ఎక్కువ మక్కువ కనపరిచే సానియా తక్కువ కాలంలోనే గొప్ప క్రేడాకారిణిగా నిలిచిపోయింది.

ఇటీవల సానియా మీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో పరాజయం పాలైంది. అయితే సానియా ఇంతకు ముందు చెప్పినట్లుగా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌కు స్వస్తి పలికింది. టెన్నిస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సానియా మీర్జా ఉపయోగించే కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

BMW 7 సిరీస్:

సానియా మీర్జా వద్ద ఉన్న కార్లలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ అయిన బిఎండబ్ల్యు యొక్క 7 సీరీస్ కారు కూడా ఉంది. దీని ధర 83,100 డాలర్లు. అంతే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1.35 కోట్లు. ఇది అధునాతమైన డిజైన్, అంతకుమించిన ఫీచర్స్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

బిఎండబ్ల్యు 7 సిరీస్ 3.0-లీటర్ 6-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 600 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఇది 7.96 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

జాగ్వార్ XE:

జాగ్వార్ కంపెనీ యొక్క XE కారు కూడా సానియా మీర్జా గ్యారేజిలో ఉంది. దీని ధర సుమారు రూ. 45 లక్షల వరకు ఉండవచ్చు. ఈ కారు 2.0-లీటర్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ 246 బిహెచ్‌పి పవర్ మరియు 365ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్:

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ-క్లాస్ కూడా సానియా మీర్జా ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర దాదాపు రూ. 77.11 లక్షలు. ఇందులో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 194 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కేవలం 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ సెడాన్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. ఇది 16 కిమీ/లీ మైలేజిని ఇస్తుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

BMW 5-సిరీస్:

భారతీయ మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ కంపెనీలలో ఒకటైన BMW యొక్క 5 సిరీస్ కూడా సానియా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 59 లక్షల నుంచి ఉంటుంది. ఇది 2993 సిసి ట్విన్ పవర్ టర్బో ఇన్‌లైన్ 6 సిలిండర్ ఇంజిన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ 262 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 250 కిమీ వరకు వేగవతం అవుతుంది.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

రేంజ్ రోవర్ ఎవోక్:

బెంజ్ మరియు బిఎండబ్ల్యు వంటి బ్రాండ్ కార్లు మాత్రమే కాకుండా సానియా మీర్జా గ్యారేజిలో రేంజ్ రోవర్ యొక్క ఎవోక్ కూడా ఉంది. దీని ధర రూ. 65 లక్షలు. ఇది 1997 సిసి ఇంజిన్ కలిగి 237 బిహెచ్‌పి పవర్ మరియు 430 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 9.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది.

టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కారు - ఇక్కడ చూడండి

ఇవి మాత్రమే కాకుండా సానియా మీర్జా ఆడి, పోర్షే వంటి లగ్జరీ బ్రాండ్ల కార్లు కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఈమె హ్యుందాయ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Sunday, January 29, 2023, 8:00 [IST]
English summary
Tennis star sania mirza car collections details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+