నేల మరియు నీటి మీద ఈ ఆంపిబియస్ లగ్జరీ బస్సుతో రౌండ్లు వేయండి !

By Anil

డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేడు పాఠకుల కోసం నేల మరియు నీటి మీద నడిచే ఆంపిబియస్ బస్‌ గురించి ప్రత్యేక కథనం అందిస్తోంది. అత్యంత ప్రత్యేకమైన ఈ బస్సు గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని ఫోటోలతో సహా అందిస్తున్నాము.

దీనిని ప్రత్యేకమైనదిగా చెప్పడానికి కారణం, ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన ఆంపిబియస్ బస్సు మరియు ఇందులో చల్ల చల్లని వాతావరణ కల్పించడానికి ఏ/సి కూడా కలదు. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

తయారీ

తయారీ

ఈ అత్యంత విలాసవంతమైన ఆంపిబిస్ బస్సును కూల్ ఆంపిబియస్ మ్యాన్యుఫ్యాక్చురర్స్ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో లగ్జరీ సదుపాయాలతో బస్సులను ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా ఇది రకరకాల ఆంపిబియస్ వాహనాల తయారీకి బాగా పేరు గాంచింది.

మోడల్ వివరాలు

మోడల్ వివరాలు

టెర్రా విండ్ అనేది ఈ బస్సు యొక్క మోడల్ పేరు. ఇది పర్యాటక ప్రాంతాలలో ఎంతో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది.

సీటింగ్

సీటింగ్

ఇందులో దాదాపుగా 49 మంది వరకు ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యాన్ని సిఎఎమ్ఐ (CAMI) సంస్థకల్పించింది.

వాహనం ఇల్లుగా

వాహనం ఇల్లుగా

దీనిని పర్యాటక ప్రదేశాలలో వ్యక్తిగతంగా మరియు ఎక్కువ మంది కూడా ప్రయాణించవచ్చు. అందుకోసం (CAMI) సంస్థ వీటిని జంటల హనీమూన్ కోసం మరియు పర్యాటక ప్రియులు కలిసి ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా రూపొందిస్తోంది.

వేగం

వేగం

ఈ ఆంపిబియస్ బస్సు నేల మీద గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మరియు నీటిలో 7 నాటికల్ మైళ్ల చొప్పున పరుగులుపెడుతుంది.

కాక్‌పిట్

కాక్‌పిట్

విమాన తరహాలో ఇందులో కాక్‌పిట్‌ పరికరాన్ని అందించారు. దీని ద్వారా నేల మరియు నీటి మీద ప్రయాణించడానికి ముందు బస్సు యొక్క లోడ్ సమార్థ్యం మరియు ప్రత్యేకంగా న్యావిగేషన్ సమాచారాన్ని ఇవ్వగలదు.

కదలిక

కదలిక

దీనిని నీటిలో నడపడం ఎంతో తేలిక. తాకే తెర ద్వారా నేల నుండి నీటి మీద ప్రయాణించేందుకు వీలుగా ట్రావెల్ మోడ్‌ను ఎంతో సులభంగా మార్చుకోవచ్చు.

అనుకూలీకరించబడిన సదుపాయాలు

అనుకూలీకరించబడిన సదుపాయాలు

ముందు వైపు వ్యూవ్ కోసం పెద్ద క్లాస్‌ను అందించారు. తద్వారా బాహ్య ప్రదేశాలను చూసి బాగా ఆనందించవచ్చు. మరియు సౌకర్యవంతంగా కూర్చోవడానికి చక్కటి సీటింగ్ సౌలభ్యతను కల్పించారు.

ఇతర సదుపాయాలు

ఇతర సదుపాయాలు

ఇందులో టీవీ, వంట గది సదుపాయాలు, బస్సు బాహ్య భాగం వైపు టెంటును వేసుకునే సదుపాయం మరియు ఇంటీరియర్ లోపల చాలా చెక్కతో తయారు చేయబడి ఉంది.

చక్కటి నిద్ర కోసం

చక్కటి నిద్ర కోసం

ఇందులో చక్కగా నిద్రకు ఉపక్రమించడానికి హోటల్ తరహాలో ఉండేటటువంటి బెడ్ కలదు. ఇది పూర్తిగా సౌకర్యవంతంగా మరియు భద్రతతో ప్రమాణాలతో తయారై ఉంది.

చల్ల చల్లటి వాతారణం కోసం

చల్ల చల్లటి వాతారణం కోసం

వేసవి కాలంలో ఈ ఆంపిబియస్ బస్సులో నేల లేదా నీటి మీద ప్రయాణం చేసినపుడు ఇందులో చల్లటి వాతావరణం కల్పించడం కోసం ఏ/సి ను సౌకర్యాన్ని కల్పించారు.

చేపలు పట్టే సదుపాయం

చేపలు పట్టే సదుపాయం

గాలం వేసి చేపలు పట్టడం అనేది చాలా మంది ఇష్టం, అలాంటి వారు ఇందులో ప్రయాణిస్తున్నపుడు చేపలు పట్టాలి అనుకుంటే. ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫిష్షింగ్ సదుపాయాల ద్వారా చేపలు పట్టవచ్చు.

నిరంతరం విద్యుత్

నిరంతరం విద్యుత్

ఇందులో పవర్ కట్ సమస్య రాకుండా నిరంతరం విద్యుత్‌ను ఇవ్వడానికి జనరేటర్‌ను అందుబాటులో ఉంచారు.

ఇంజన్

ఇంజన్

ఇందులో క్యాటర్‌పిల్లర్ సంస్థ వారి ఇంజన్‌ను వినియోగించారు, ఈ శక్తివంతమైన ఇంజన్‌కు అలిసన్ వారి గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

అగ్నిమాపక సౌకర్యాలు

అగ్నిమాపక సౌకర్యాలు

ఈ ఆంపిబియస్ బస్సులో రెండు అగ్నిమాపక పరికరాలను ఉపయోగించారు. కాబట్టి చాలా వరకు ప్రొటెక్షన్‌ను ఇది ఇస్తుంది.

ధర

ధర

ఈ విలాసవంతమైన ఆంపిబియస్ బస్సు సుమారుగా 1.2 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. అంటే దీని విలువ 12 లక్షల అమెరికన్ డాలర్లు అన్నమాట

మీ వల్ల కాదు.

మీ వల్ల కాదు.

నిజమే కదా ఇలాంటి ఖరీదైన ఆంపిబియస్ బస్సుల్లో ప్రయాణించాలంటే మన వలన అవుతుందా. అందులోను విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీని చదివి నిరాశ చెందిన వారికి తరువాత స్లైడర్‌లో శుభవార్త కలదు....

గోవా...

గోవా...

గోవా గురించి ఎందుకు అనుకుంటున్నారా ...? గోవాలో గోవా పర్యాటక అభివృద్ది సంస్థ అచ్చం ఇలాంటి ఆంపిబియస్ బస్సును అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు.

అనుమతులు

అనుమతులు

గోవాలో ఆంపిబియస్ బస్సును అందుబాటులోకి తీసుకురావడానికి కావాల్సిన అనుమతుల కోసం గోవా పర్యాటక అభివృద్ది సంస్థకు తాజాగా అనుమతులు లభించాయి. త్వరలోనే ఈ బస్సు అందుబాటులోకి రానుంది.

మేడిన్ ఇండియా

మేడిన్ ఇండియా

నేల మరియు నీటి మీద నడవగలిగే ఆంపిబియస్ బస్సులను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా తయారుచేయనున్నారు.

సీటింగ్ సామర్థ్యం

సీటింగ్ సామర్థ్యం

ఇండియాలో తయారు చేయనున్న బస్సులో 29 మంది కూర్చునేందుకు వీలుగా ఉండేటట్లు రూపొందించనున్నారు.

సాధారణ మోడల్

సాధారణ మోడల్

ఇందులో ఉన్న ఫోటోను చూడండి, ఇది సాధారణ ఆంపిబియస్ బస్సులోని చిత్రం, అయితే గోవాలో రానున్న బస్సు గురించి తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ విడుదల చేసే సమయానికి చేరుకుంటే మొత్తం బస్సును సందర్శించవచ్చు.

ప్రయివేట్ సంస్థల చేత

ప్రయివేట్ సంస్థల చేత

గోవాకు ఆంపిబియస్ బస్సు సర్వీసును ప్రయివేట్‌గా నిర్వహించనున్నారు.

గోవా ఇన్‌స్ట్యూట్

గోవా ఇన్‌స్ట్యూట్

గోవా ఆటోమొబైల్ కార్పోరేషన్, గోవా ఆధారిత సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను దేశీయంగా అభివృద్ది చేస్తున్నారు.

అతి త్వరలో రానుంది.

అతి త్వరలో రానుంది.

గోవా పర్యాటక ప్రాంత అభివృద్ది సంస్థ అతి త్వరలో గోవాలో ఆంపిబియస్ బస్సును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీనికి సంభందించిన సమాచారం వస్తే వెంటనే పాఠకులతో పంచుకుంటాము, అంత వరకు మాతో కలిసి ఉండండి. పాఠకులకు ఇదొక చక్కటి అనుభూతిని కలిగిస్తుందని మా అభిప్రాయం.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు

విమాన వసతుల్ని తలదన్నే అత్యంత విలాసవంతమైన కారు

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

న్యూక్లియర్ సబ్‌మెరైన్‌తో మరింత బలమైన భారత్

మానవ రహిత రోబో బోటును ప్రారభించిన ఇజ్రాయెల్: దీనితో ఎప్పటికైనా ముప్పే అంటున్న నిపుణులు

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

2016 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా గల ఉత్తమ క్రూయిజ్ నౌకలు

ఎంత వర్షాలలోనైనా ఈ వాహనాలతో సురక్షితంగా ప్రయాణించండి.

Article Published On: Tuesday, April 12, 2016, 14:09 [IST]
English summary
Terra Wind Luxurious Amphibious Motor Home
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+