అమెరికాలో ‘అయోధ్య రామమందిర' ప్రారంభోత్సవ వేడుకలు.. లైట్‌ షోతో అట్టహాసంగా ‘టెస్లా కార్‌' ర్యాలీ

యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య భవ్య మందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పూర్తయింది. కోట్లాది ప్రజల భక్తి శ్రద్ధలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అయోధ్య రామ మందిరం బాలరాముడు కొలువుదీరాడు. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ క్రతువు అత్యంత వైభవంగా జరిగింది.

కోట్లాది ప్రజలు టీవీల్లో వీక్షిస్తుండగా.. అయోధ్య గర్భగుడిలో బాలరాముడు సర్వాంగసుందరంగా దర్శనమిచ్చాడు. ప్రధాన నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించి, గర్భ గుడిలో బాలరాముడి విగ్రహానికి(Ayodhya Prana Pratishta) ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ మేరకు ఈ సంబరాలను ఒక్క భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ఘనంగా జరుపుకొన్నారు.

Ayodhya-Ram-Mandir-Tesla-Car-Rally

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా నగరం రామ నామంతో మార్మోగిపోయింది. బే ఏరియాలో టెస్లా కార్లతో లైట్‌ షో అట్టహాసంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని ఈ వేడుకలు వందల కొద్దీ ప్రజలు పాల్గొన్నారు. ఆ కోలాహలం చూస్తుంటే ఇది కాలిఫోర్నియానా లేక అయోధ్యనా అనే సందేహం రాక మానదు.

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకి ముందుగా ఈ ముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేసుకునేందుకు.. కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వ్యాలీలో నివసించే భారతీయులు పెద్ద ర్యాలీ నిర్వహించారు. 1100 మందికి పైగా రామ మందిర బ్యానర్లను పట్టుకుని బే ఏరియాలో(Tesla Car Rally in California) భారీ కార్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

Ayodhya-Ram-Mandir-Tesla-Car-Rally

శనివారం రాత్రి, సన్నీవేల్‌లో ప్రారంభమైన మార్చ్, వార్మ్ స్ప్రింగ్ BART స్టేషన్ మరియు గోల్డెన్ గేట్ వరకు ఘనంగా జరిగింది. టెస్లా కార్‌ లైట్‌ షోతో ఈ వేడుక అట్టహాసంగా ముగిసింది. అయోధ్యలో నిర్మించిన రామాలయం, రాముడి చిత్రంతో పాటు రామాయణంలోని వివిధ దృశ్యాలను ప్రదర్శించే డిజిటల్ బిల్‌బోర్డ్ వాహనాలు ప్రజల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి.

అమెరికా పోలీసుల అనుమతితోనే ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. ధోల్ నగారా వంటి సంప్రదాయ వాయిద్యాలను వెంట తీసుకుని వివిధ ప్రదేశాలలో ఆనందంగా నృత్యాలు చేయడం మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ టెస్లా కార్‌ భారీ ర్యాలీని 150 కి.మీ పాటు ఐదుగురు వాలంటీర్లు.. ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వహించారు.

Ayodhya-Ram-Mandir-Tesla-Car-Rally

వందలాది టెస్లా కార్లు.. లైటింగ్‌లతో మంత్ర ముగ్ధులను చేస్తూ నృత్యానికి మరింత అందాన్ని జోడించాయి. సోషల్‌ మీడియా వేదికగా భారతీయులంతా ప్రణాళిక వేసుకుని ఈ భారీ కార్‌ ర్యాలీని నిర్వహించి మరిచిపోలేని అనుభూతని అందించారు. ఈ గొప్ప వేడుక న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ వరకు విస్తరించింది.

సంప్రదాయ దుస్తులు, నృత్యాలు, పాటలు, భజనలతో పాటు ఇతర కార్యక్రమాల్లో భారతీయ ప్రవాసులు పాలుపంచుకొన్నారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోకుండా రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు ఇంత అట్టహాసంగా స్వాగతం చెప్పడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Ayodhya-Ram-Mandir-Tesla-Car-Rally

భారీ టెస్లా కారు ర్యాలీ వీడియోలు X (ట్విట్టర్‌) లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. ప్రవాస భారతీయులను నెటిజన్లు అభినందిస్తున్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం అయోధ్య రామ మందిరంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టం ఘనంగా పూర్తయింది. ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని, వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటారని ప్రధాని మోదీ అన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 22, 2024, 18:16 [IST]
English summary
Tesla car rally organized at golden gate bridge us on the occasion ram mandir inauguration
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+