టెస్లా సైబర్ ట్రక్ మన రోడ్లపై.. వీడియో చూస్తే ఎలాన్ మస్క్ షాక్ అవ్వాల్సిందే..
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా.. నుంచి రాబోతున్న సైబర్ ట్రక్ గురించి మీకు తెలిసే ఉండవచ్చు. కాగా ఈ నేపథ్యంలో భారత్‌లోనే కొందరు టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపించే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను సృష్టించారు. దీనికి సంబంధించి ఇంటర్నెట్‌లో వీడియో వైరల్‌గా మారింది.
టెస్లా తయారు చేసిన సైబర్ ట్రక్ ఎలాంటి డిజైన్ లేకుండా సింపుల్‌గా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే వాహనాలు ఎలా ఉంటాయో చెప్పడానికి టెస్లా సైబర్ ట్రక్కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంకా ఈ వాహనం రూపం కూడా చూడటానికి భిన్నంగా ఉంటుంది.

అంతే కాకుండా వివిధ మెటీరియల్స్‌తో లోహాలను తీసుకుని ఆటో రిక్షా ఛాసిస్‌ను కాస్త పెద్దదిగా చేశారు. ఈ విస్తరించిన ఛాసిస్‌పై పిరమిడ్ లాంటి బాడీ షెల్‌ను రూపొందించారు. ఈ బాడీ షెల్‌పై హెవీలీ టింటెడ్ బ్లాక్ ఫిల్మ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కొత్త సైబర్ ట్రక్ వాహనంలోకి వెళ్లడానికి మొత్తం సెటప్‌ను ఒకేసారి ఎత్తే అవకాశం ఉంది. క్యాబిన్ లోపల పూర్తిగా నల్లగా ఉంది. లోపల ఆపరేట్ చేసేందుకు, కంట్రోలింగ్ కోసం 2 లివర్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా దాని నెమ్మదిగా కదిలే చక్రాల దిశలో వెళ్తుందని వీడియోలో పేర్కొన్నారు.

ఈ సైబర్ ట్రక్ ఆటో రిక్షా లోపలి భాగాన్ని బయటి నుంచి చూడలేకపోయినా, లోపల నుంచి పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రక్ బాడీ మొత్తాన్ని బలమైన గాజులాంటి పదార్థాలతో తయారు చేశారు. వాహనం లోపల కూర్చున్నప్పుడు ఇది 360 డిగ్రీల పనోరమిక్ వ్యూను అందిస్తుంది.
ఈ సైబర్ ట్రక్ నిర్మాణంలో డిస్ అడ్వాంటేజ్ ఏమిటంటే బయటి గాలి లోపలికి వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా, క్యాబిన్ త్వరగా హీట్ ఎక్కుతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా రేంజ్ లేదా ఛార్జింగ్ సమయం గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ సైబర్ ట్రక్ వాహనంలో ఒకేసారి ఒకరు మాత్రమే ప్రయాణించగలరు..

అయితే దేశంలో పబ్లిక్ రోడ్లపై అటువంటి వాహనాలను ప్రస్తుతం నడిపే అవకాశం లేదు. RTOకు సరైన పత్రాలను సమర్పించి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఆపరేట్ చేయవచ్చు. RTO నుండి అనుమతి పొందడానికి, వాహనం వివిధ వ్యవస్థల క్రింద పరీక్షలు చేస్తారు. అందులో సక్సెస్ అయిన తర్వాత మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తారు. పబ్లిక్ రోడ్లపై ఎవరూ ప్రమాదంలో పడకుండా ఉండేందుకే ఇలాంటి కఠినమైన నిబంధనలు పాటిస్తున్నారు.
అయితే మనం స్వయంగా తయారు చేసుకున్న వాహనాలను మన ఇంటి ఆవరణలో ఇష్టానుసారంగా నడుపుకోవచ్చు. అంతే కాకుండా ఈ వాహనం చూడటానికి కాస్త భయానకంగా కూడా ఉంటుంది. టెస్లా తన సైబర్ ట్రక్కును వివిధ పరీక్షలు మరియు నాణ్యతా ధృవీకరణలతో నిర్మిస్తుంది. దానితో, భారతదేశంలో తయారైన ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నిజంగా ఏ విషయంలోనూ పోల్చలేము.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








