ఎట్టకేలకు టెస్లా సైబర్ ట్రక్ డెలివరీలు ప్రారంభం.. సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 547 కి.మీ రేంజ్‌..!

టెస్లా సైబర్‌ ట్రక్‌... ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా.. అని ఎదురుచూస్తున్న వాహనాల్లో ఒకటి. ఈ సంస్థ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందినది. ఈ సైబర్ ట్రక్‌ ( Tesla Cybertruck ) డెలివరీ తాజాగా ప్రారంభం అయింది. ఈ ట్రక్‌ విద్యుత్‌తో నడుస్తుంది. ఈ వాహనాన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంగా కూడా తయారుచేసింది.

ఇతర కార్ల ఉపరితలం సాధారణంగా ఫైబర్‌ ప్యానల్స్ ఉపయోగిస్తారు. అయితే సైబర్‌ ట్రక్‌ ఉపరితలం మాత్రం స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ను ఉపయోగిస్తోంది. ట్రక్‌కు అదనపు ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చేందుకు స్టీల్‌ ప్యాన్‌లను ఉపయోగిస్తోంది. ఈ టెస్లా వాహనం ధర USD 79,990గా ఉంది. భారత కరెన్సీలో ఈ వాహనం విలువ రూ. 66.65 లక్షలుగా ఉంది.

Tesla Cybertruck latest news

సైబర్‌ బీస్ట్‌ : టెస్లా సైబర్ ట్రక్ హై ఎండ్‌ వేరియంట్‌ సైబర్‌ బీస్ట్‌ పేరుతో అందుబాటులో ఉంది. దీని ధర USD 99,990గా ఉంది. అంటే భారత్‌ కరెన్సీ ప్రకారం.. రూ.83 లక్షలుగా ఉంది. మరింత తక్కువ ధరకు సైబర్‌ ట్రక్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. అయితే 2025 నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రెండు భారీ టచ్‌స్క్రీన్‌లు : 2019లో సైబర్‌ ట్రక్‌ను ఆవిష్కరించారు. ఆ సమయంలో USD 40,000కే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అయితే ఈ ట్రక్‌ అనేక ఫీచర్లను కలిగి ఉంది. 18.5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ సహా 9.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

Tesla Cybertruck price

ఈ టెస్లా ట్రక్‌ డ్యూయల్‌ మోటార్‌, మూడు మోటార్‌ ఆప్షన్‌లలో వస్తుంది. డ్యూయల్ మోటార్‌ 600bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు కేవలం 3.9 సెకన్లలో 0- 100 kmph వేగాన్ని అందుకుంటుంది. మూడు మోటార్‌ వ్యవస్థ 845 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు 2.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది.

టెస్లా సైబర్ ట్రక్ రేంజ్‌ 547 కి.మీ : సైబర్‌ ట్రక్‌ వేరియంట్లను బట్టి వేర్వేరు రేంజ్‌లను అందిస్తుంది. ఈ వాహనం సింగిల్ ఛార్జింగ్‌పై 547 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. అదే సైబర్‌ బీస్ట్ పుల్‌ సింగిల్‌ ఛార్జింగ్‌పై 514 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

Tesla Cybertruck range

గణనీయంగా ముందస్తు బుకింగ్‌లు ! : సైబర్‌ ట్రక్‌ డెలివరీలు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నాయి. అనేక దేశాల్లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. డెలివరీలు ప్రారంభం కాకముందే అనేక దేశాల నుంచి భారీగా ముందస్తు బుకింగ్‌లు నమోదయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్‌ కార్ల డెలివరీ ప్రారంభం అయింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, December 1, 2023, 17:15 [IST]
English summary
Tesla cybertruck deliveries started in america
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+