దుబాయ్ పోలీస్ ఫ్లీట్‌లో టెస్లా సైబర్‌ట్రక్‌ - ఫోటోలు చూశారా?

భారతదేశంలో మహీంద్రా స్కార్పియో, టాటా నెక్సాన్ లేదా టాటా కంపెనీకి చెందిన కార్లను పోలీసులు తమ ఫ్లీట్‌లో చేర్చుకుంటున్నాను. అయితే దుబాయ్ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఏ దేశంలోని పోలీసులు తమ ఫ్లీట్‌లో చేర్చని కారును చేర్చారు. దుబాయ్ ఎమిరాటీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇప్పుడు టెస్లా సైబర్‌ట్రక్‌ను తమ విభాగంలో చేర్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను వారు తమ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఇక్కడ కనిపించే టెస్లా సైబర్‌ట్రక్‌ (Tesla Cybertruck) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రపంచ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన టెస్లా గత కొన్ని రోజులకు ముందే సైబర్ ట్రక్ లాంచ్ చేసింది. కాగా అప్పుడే దుబాయ్ పోలీసులు తమ ఫ్లీట్‌లో ఈ కారును చేర్చినట్లు వెల్లడించారు. దుబాయ్ పోలీసులు షేర్ చేసిన ఫోటోలలో గమనిస్తే.. వైట్ అండ్ గ్రీన్ కలర్ పొందిన సైబర్ ట్రక్ కనిపిస్తుంది. ఈ కారు ఇప్పటి వరకు కనిపించిన స్టీల్ గ్రే ఫినిషింగ్‌కు భిన్నంగా ఉంది.

Tesla New Cybertruck in Dubai Police Fleet

దుబాయ్ పోలీసులు ఇప్పుడు తమ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో ఈ కారును చేర్చారు. ఫోటోలను షేర్ చేస్తూ.. దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్ విభాగంలో టెస్లా సైబర్ ట్రక్ చేరింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ కారు ఇప్పుడు పెట్రోలింగ్ ఫ్లీట్‌లో వినియోగించబడతాయి అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

సైబర్‌ట్రక్ ఎక్కడికి వెళ్లినా అటెన్షన్ స్టీలర్, కాబట్టి ఇది దుబాయ్ పోలీస్ ఫ్లీట్‌లో సహజంగా ఇమిడిపోతుంది. నిజానికి ఎక్కడైనా స్వదేశీ కార్ల కంటే అన్యదేశ్య కార్లే చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో అన్యదేశ్య కార్లను మరింత హుందాగా కనిపిస్తాయి. టెస్లా సైబర్ ట్రక్ తమ ఫ్లీట్‌లో 2019 నాటికి చేరుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు.

Tesla New Cybertruck in Dubai Police Fleet

టెస్లా యొక్క సైబర్ ట్రక్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వల్ల ఈ మధ్య కాలంలో కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికి దుబాయ్ పోలీసులు తమ ఫ్లీట్‌లో టెస్లా సైబర్ ట్రక్ చేర్చారు. ఈ కారును బుక్ చేసుకున్న కస్టమర్లు 2023 చివరి నాటికి డెలివరీ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. గత కొంత కాలంగా అప్పుడు, ఇప్పుడు అని ఊరించిన టెస్లా సైబర్ ట్రక్ త్వరలోనే బుక్ చేసుకున్న కస్టమర్లను చేరుకుంటుంది.

టెస్లా సైబర్‌ట్రక్ సైబర్‌బీస్ట్, ఆల్ వీల్ డ్రైవ్ (AWD) మరియు రియర్ వీల్ డ్రైవ్ (RWD) వంటి వివిధ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుంది. ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ కేవలం 2.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 209 కిమీ/గం. ఇది 845 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ 600 Bhp పవర్ అందిస్తుంది.

దుబాయ్ పోలీసులు తమ ఫ్లీట్‌లో కేవలం టెస్లా సైబర్‌ట్రక్ మాత్రమే కాకుండా.. ఖరీదైన మెక్‌లారెన్ ఆర్టురా, మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63, లంబోర్ఘిని అవెంటడోర్, బుగట్టి వేరాన్, ఫెరారీ ఎఫ్‌ఎఫ్, బెంట్లీ కాంటినెంటల్ జిటి స్పీడ్ మరియు ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వంటి కార్లను చేర్చారు. బహుశా ఇంత ఖరీదైన కార్లు ప్రపంచ దేశాల్లో ఏ పోలీస్ ఫోర్స్‌లోనూ లేదని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2024, 17:17 [IST]
English summary
Tesla cybertruck in dubai police fleet photos viral
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+