టెస్లా సైబర్‌ట్రక్.. ఇది 'బుల్లెట్-టఫ్' గురూ - వీడియో చూడాల్సిందే!

ప్రపంచ మార్కెట్లో టెస్లా కార్లకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. కంపెనీ లాంచ్ చేసే ఉత్పతులు చాలావరకు ప్రజలను ఆకట్టుకుంటాయి. ఇందులో భాగంగా టెస్లా సైబర్ ట్రక్ లాంచ్ చేసింది. ఇది ఎంత దృఢంగా ఉందని చెప్పే వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

నిజానికి గత కొన్ని సంవత్సరాల నుంచి టెస్లా బాస్ 'ఎలాన్ మస్క్' (Elon Musk) గ్లోబల్ మార్కెట్లో సైబర్ ట్రక్ లాంచ్ చేయాలని కలలు కన్నారు. అనుకున్నవిధంగానే ఈ మధ్య కాలంలోనే అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కారు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. భారతదేశంలో అడుగు పెడుతుందా? లేదా అనేది ప్రశ్నార్థకం. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

Elon Musk Shares Tesla Cybertruck Baseball Bat Test

టెస్లా కంపెనీ లాంచ్ చేసిన సైబర్ ట్రక్ ఎంత దృఢంగా ఉంది అని చెప్పే వీడియోను ఎలాన్ మస్క్ స్వయంగా తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో మొదటి ఒక వ్యక్తి బేస్‌బాల్ బ్యాట్ చేతిలో పట్టుకుని ప్యాసింజర్ ఫ్రంట్ డోరును బలంగా కొట్టడం చూడవచ్చు. సుమారు ఐదుసార్లు ఆ వ్యక్తి బలంగా కొట్టినప్పటికీ కారుకు ఏమి కాలేదు, పైగా కొట్టిన వ్యక్తికే చెయ్యి నొప్పి పుట్టింది.

రెండో వ్యక్తి బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని మరో డోర్ మీద కొట్టడం చూడవచ్చు. ఆ వ్యక్తి బలం మొత్తం ఉపయోగించి కొట్టినప్పటికీ కారుకు ఏమి కాలేదు, కానీ బ్యాట్ మాత్రం వంగిపోయింది. ఈ వీడియోను షేర్ చేసిన మస్క్ సైబర్ ట్రక్ బుల్లెట్ అంత పటిష్టంగా ఉందని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూపరులను ఫిదా చేస్తోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Elon Musk Shares Tesla Cybertruck Baseball Bat Test

టెస్లా సైబర్ ట్రక్ (Tesla Cyber Truck)

టెస్లా కంపెనీ యొక్క సైబర్ ట్రక్ సింగిల్ మోటార్, డ్యూయెల్ మోటార్ మరియు ట్రై మోటార్స్ అనే మూడు వేరియంట్లలో ఉంది. అయితే దీని టాప్ స్పెక్ మోడల్‌ను 'సైబర్‌బీస్ట్' అని పిలుస్తారు. ఇందులో సింగిల్ మోటార్ వేరియంట్ జాబితాలో సరసమైన కారు. కంపెనీ దీనికి పవర్ గణాంకాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది 402 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

సైబర్‌బీస్ట్ విషయానికి వస్తే.. ఇది ఇందులో టాప్ స్పెక్ మోడల్. ఇది 845 హార్స్ పవర్ అందిస్తుంది. 99990 డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 83.34 లక్షలు) ఖరీదైన ఈ కారు ఏకంగా 515 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ సైబర్ ట్రక్ మోడల్స్ ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నాము.

టెస్లా సైబర్ ట్రక్ లోపల డాష్‌బోర్డ్ మధ్యలో 18.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా వెనుక సీటులో ఉండే ప్రయాణికుల కోసం కంపెనీ 9.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ అందిస్తోంది. పటిష్టంగా రూపొందించబడిన ఈ కారు ఆఫ్-రోడర్ క్యాపబిలిటీస్ పొందుతుంది. కావున గ్రౌండ్ క్లియరెన్స్ అనుకూలంగా ఉంటుంది. ఈ ట్రక్ తప్పకుండా అన్నివిధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 6, 2024, 14:00 [IST]
English summary
Tesla cybertruck is built bullet though elon musk shares video
Read more on: #టెస్లా #tesla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+