Video Viral స్విమ్మింగ్‌ పూల్‌లో పడిన ఎలక్ట్రిక్‌ కారు.. భారీగా డ్యామేజ్‌..!!

టెస్లా ఎలక్ట్రిక్‌ కారు తొలి నుంచి ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అధునాతన టెక్నాలజీ ఫీచర్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం కారణంగా ఇప్పటికే చాలా సార్లు ఈ కారు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తాజాగా టెస్లా ఎలక్ట్రిక్‌ కారు మరోసారి వైరల్‌ అవుతోంది.

తాజా ఘటనలో టెస్లా ఎలక్ట్రిక్‌ కారు ఇంటి కాంపౌండ్‌ను ఢీకొట్టింది. అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన అమెరికాలోని అర్జెంటీనాలో జరిగింది. ఈ ఘటనలో టెస్లా కారు డ్రైవర్‌కు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కానీ ఇంటి కాంపౌండ్‌, స్విమ్మింగ్‌ పూల్‌ భారీగా డ్యామేజీ అయ్యాయి. మళ్లీ వినియోగించలేని విధంగా టెస్లా కారు తయారైంది.

Tesla electric car jumps into swimming pool

స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయిన కారు వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. గోడను ఢీకొనడంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. బానెట్‌ పైకి పూర్తిగా లేచింది. విండ్‌షీల్డ్‌ సహా కారు ముందు భాగం భారీగా డ్యామేజి అయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకొని స్విమ్మింగ్‌ పూల్ నుంచి కారును పైకి తీశారు. ఆ సమయంలో కారులోని అన్ని భాగాల నుంచి నీరు బయటకు రావడం వీడియోలో మనం గమనించవచ్చు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక లోపమా, లేదా మానవ తప్పిదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Tesla electric car jumps into swimming pool

అయితే ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని, కానీ కారును నియంత్రించ లేకపోయానని టెస్లా కారు డ్రైవర్‌ పోలీసులకు తెలిపారు. స్విమ్మింగ్‌ పూల్‌ రోడ్డు పక్కనే ఉండడం గమనించవచ్చు. నియంత్రణ కోల్పోయిన కారు డ్రైవర్‌ గోడను ఢీకొట్టి, స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయారు. అదే నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటే భారీ ప్రమాదం చోటుచేసుకొనే అవకాశం ఉండేది.

ఈ ప్రమాదంపై ఇంటి యాజమాని కీలక వివరాలు వెల్లడించారు. తాను ఇంట్లో నిద్రపోతున్న సమయంలో భారీ శబ్ధం వినిపించిందని చెప్పారు. బయటకు వచ్చి చూస్తే స్విమ్మింగ్‌ పూల్‌లో కారు కనిపించిందని తెలిపారు. టెస్లా కారును మరో కారు ఢీకొట్టి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పాడు.

ప్రమాదానికి గురైన టెస్లా ఎలక్ట్రిక్‌ కారు మళ్లీ వినియోగించే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు. ఒక వేళ మళ్లీ వినియోగించడం కోసం మరమ్మతు చేసినా.. భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కారు భీమా సౌకర్యం ఉంటే కొంత ప్రయోజనం ఉంటే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 7, 2023, 13:40 [IST]
English summary
Tesla electric car jumps into swimming pool after crashed house compound wall
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+