రోడ్డు ప్రమాదంలో రెండుగా విడిపోయిన టెస్లా ఎక్స్ ఎలక్ట్రిక్ కార్

భారతదేశంతో సహా ప్రపంచంలో చాలా దేశాలలో నిత్యం రోడ్డుప్రమాదాలు జరగటం మనం చూస్తూనే ఉంటాము. డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు, సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్ల కావచ్చు నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఈ రోడ్డు ప్రమాదాలు రోజుకి దాదాపు కొన్ని వేల సంఖ్యలో జరుగుతున్నాయి.

రోడ్డు ప్రమాదంలో రెండుగా విడిపోయిన టెస్లా ఎక్స్ ఎలక్ట్రిక్ కార్

యుఎస్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియా కలకలం రేపుతోంది. దీనిని గురించి మనం మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

రోడ్డు ప్రమాదంలో రెండుగా విడిపోయిన టెస్లా ఎక్స్ ఎలక్ట్రిక్ కార్

ఫ్లోరిడాలోని హల్లాండలే బీచ్ బౌలేవార్డ్ మరియు త్రీ ఐలాండ్స్ బౌలేవార్డ్ కూడలిలో సంభవించిన కారు ప్రమాదంలో ఒక తెల్లటి నిస్సాన్ కారు టెస్లా ఎక్స్ కారుని వేగంగా డీ కొట్టడం జరిగింది. ఈ విధంగా జరిగిన వెంటనే ఈ కారు రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో రెండుగా విడిపోయిన టెస్లా ఎక్స్ ఎలక్ట్రిక్ కార్

నివేదికల ప్రకారం ఇంతటి భయానకమైన రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. కానీ టెస్లా ఎక్స్ నడుపుతున్న వ్యక్తి కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వ్యక్తి జోస్ డియాజ్గా గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా నిస్సాన్ జిటి-ఆర్ లో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో రెండుగా విడిపోయిన టెస్లా ఎక్స్ ఎలక్ట్రిక్ కార్

హైవేలో నిస్సాన్ కారు అధికమైన వేగంతో వస్తున్నది. ఈ విధంగా వచ్చేటప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని సరిగ్గా గమనించలేకపోవడం వల్ల మరియు కార్ ని సరైన సమయంలో నిలువరించలేకపోవడంవల్ల ఈ ప్రమాదం జరిగింది. అధికమైన వేగం కారణంగా ఈ కారు రెండు భాగాలుగా విడిపోయింది.

రోడ్డు ప్రమాదంలో రెండుగా విడిపోయిన టెస్లా ఎక్స్ ఎలక్ట్రిక్ కార్

హైవేపై జరిగిన ఈ ప్రమాదం గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన ఈ ప్రమాదం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. చాలా మంది హైవేలపై వేగంగా వెళ్లండం వల్ల లేక మందు తాగి వాహనాలను నడపడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో రెండుగా విడిపోయిన టెస్లా ఎక్స్ ఎలక్ట్రిక్ కార్

ఇటువంటి భయంకరమైన రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు కూడా చాల కఠినమైన నిభందనలు ప్రవేశపెడుటున్నప్పటికీ ప్రమాదాలను జరగకుండా ఆపలేకపోతోంది. ఎందుకంటే వాహనాదారులు ఈ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

సరైన జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డు పరిసరాలను సరిగ్గా గమనించకుండా వాహనాలను నడిపితే ఇటువంటి ప్రామాదాలు జరుగుతాయి. తద్వారా వివువైన ప్రాణాలను కోల్పోవాల్సి ఉంటుంది.

Image Courtesy: WPLG Local 10/YouTube

Most Read Articles

English summary
Tesla Model X Electric SUV Crashes with Nissan GT-R Supercar, Splits Into Half - Watch Video. Read in Telugu.
Story first published: Friday, January 24, 2020, 11:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X