ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన Tesla కారు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రపంచ మార్కెట్లో టెస్లా కార్లకు ఉన్న ప్రత్యేకతలను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఘనత వీటికే దక్కుతుంది. అలాంటి మరో ఘటన తాజాగా తెరమీదకు వచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

టెస్లా ఎలక్ట్రిక్ కార్లలో సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ ఉంటుందని చాలా మందికి తెలుసు. గతంలో ఈ ఫీచర్ అనవసరం అని చాలామంది పేర్కొన్నారు. కానీ ఆ ఫీచర్ నేడు ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. టెస్లా మోడల్ వై సెల్ఫ్ డ్రైవింగ్ కెపాసిటీ కలిగి ఉండటం వల్ల అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడిందని.. ఒక వ్యక్తి ఎక్స్(ట్విటర్) అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Tesla Model Y Car Self-Driving Saving Man s Life

నిజానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా వెలుగులోకి రాలేదు. కానీ ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. 'మాక్స్‌పాల్ ఫ్రాంక్లిన్' అనే వ్యక్తి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయాయని వెల్లడించారు. అతని ఇన్సులిన్ పంప్‌లో లోపం వల్ల ప్రమాదం జరిగిందని అతడు పేర్కొన్నాడు. ఆ సమయంలో అతడు ఒంటరిగా ఉన్నాడు, సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడం వల్ల టెస్లా మోడల్ వై ఉపయోగించి ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రమాదంలో ఉన్న మాక్స్‌పాల్ ఫ్రాంక్లిన్.. టెస్లా మోడల్ వై కారులోని సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ద్వారా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఫ్రాంక్లిన్ ఇంటికి.. ఆసుపత్రికి 13 మైళ్ళ దూరం ఉన్నట్లు సమాచారం. అయితే టెస్లా మోడల్ వై ఎలాంటి అవాంతరాలను కలిగించకుండా సురక్షితంగా ఆసుపత్రికి చేర్చిందని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత కూడా తనకు తానుగానే పార్క్ చేసుకుందని వెల్లడించాడు.

Tesla Model Y Car Self-Driving Saving Man s Life

టెస్లా మోడల్ వై తన యజమాని ఆపదలో ఉన్నప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయానికి ఆసుపత్రికి చేర్చగలిగింది. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడగలిగాడు. అయితే అతని వద్ద పోర్స్చే, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, కాడిలాక్‌ వంటి లగ్జరీ కారు ఉన్నప్పటికీ.. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో టెస్లా అత్యుత్తమ కారు అని ప్రకటించగలనని వెల్లడించాడు.

'టెస్లా మోడల్ వై'ను సొంతం చేసుకున్న తరువాత, తన అనుభవాన్ని కూడా పేర్కొన్నాడు. టెస్లా కార్ల వల్ల ఖర్చు తగ్గుతుందని, ఇతర అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నాడు. టెస్లా కార్లకు మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పటి వరకు అతడు 1000 డాలర్లు లేదా రూ. 83000 ఆదా చేసినట్లు పేర్కొంటూ.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

టెస్లా మోడల్ వై (Tesla Model Y)

టెస్లా మోడల్ వై అనేది టెస్లా కంపెనీ యొక్క అత్యంత సరసమైన మోడల్. ఇది రియర్ వీల్ డ్రైవ్ వెహికల్. అంతే కాకుండా ఇది డ్యూయెల్ మోటార్ ఆలా వీల్ డ్రైవ్ వాహనంగా కూడా అందించబడుతుంది. ఈ మోడల్ వై ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది సింగిల్ చార్జితో 415కిమీ రేంజ్ అందిస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2024, 15:00 [IST]
English summary
Tesla model y car self driving saving man life
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+