తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే టెస్లా ఫ్యాక్టరీ! ఎలాన్ మస్క్ నుంచి ఆమోదం వచ్చిందా? చివరి నిర్ణయం ఇదేనా?

ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద గమ్యస్థానంగా మారింది. దేశీయంగా ప్రజలు ప్రస్తుతం సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, CNG వాహనాలతో పాటు ఈవీలను కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి తయారీ దారులు వరుసగా ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఇండియాలో ప్లాంట్‌లను ఏర్పాటు చేయగా, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా (Tesla) కూడా భారత మార్కెట్‌పై కన్నేసి ఇక్కడ కార్లను ఉత్పత్తి చేసి లోకల్ ప్రజలు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి ప్రణాళికలు వేసింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇండియాలో తయారీ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆలోచన చేస్తుంది.

ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం, టెస్లా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్లాంట్‌లను ఏర్పాటు చేయనుందని తెలిసింది. వీటిలో ఏదో ఒక రాష్టంలోని ప్రధాన ఏరియాకు దగ్గరగా అనుకూలంగా ఉండే విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడే కర్మాగారాన్ని ప్రారంభిస్తుందని సమాచారం వచ్చింది. అయితే వీటన్నింటిని పక్కన పెడితే, తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, మరో రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి టెస్లా ఆలోచన చేస్తుంది.

Tesla Factory Site In India

నివేదికలను చూసినట్లయితే టెస్లా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌తో చర్చలు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కియా మోటార్స్‌కు దగ్గరగా ముందస్తుగా సేకరించిన అనువైన స్థలాలను రాష్ట్ర అధికారులు టెస్లా ప్రతినిధులకు చూపించారని తెలుస్తుంది. టెస్లా భూమి సేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చూస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.

మస్క్ దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా నాక్-డౌన్ (CKD) అసెంబ్లీ యూనిట్ కోసం భారత్‌లో స్థలాన్ని ఎంపిక చేసిన పనిలో ఉంది. టెస్లా అధికారులు మొదట మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో స్థలాన్ని దాదాపు ఎంపిక చేశారు. అయితే భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన ఇబ్బందుల దృష్ట్యా ముందుగా సేకరించిన భూమి కోసం అన్వేషణ చేస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం వారిని ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తుంది.

Tesla New Ev Plant In Ap

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌‌లో ముందస్తుగా సేకరించిన భూమి కొంత వరకు అనుకూలంగా ఉండటం కారణంగా ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆసక్తితో అధికారులు చర్చలు జరుపుతున్నారు. పైగా దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ సైతం ఇక్కడికి దగ్గరగా అనంతపురం జిల్లాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసి తన కార్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తూనే అంతర్జాతీయంగా ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచే ఎగుమతులు చేస్తుంది.

ఈ నేపథ్యంలో టెస్లా కూడా ఇదే విధానాన్ని అవలంబించడానికి ఇక్కడ స్థలాన్ని అన్వేషణ చేస్తుంది. ముందుగా సేకరించిన భూమిలో ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా సులభం. పునరావాసానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కంపెనీ నేరుగా ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ చేసుకోవచ్చు. ఏపీ నుంచి ఎగుమతులు, దిగుమతుల కోసం పోర్ట్ కనెక్టివిటీతో సహా మౌలిక సదుపాయాలు ఉండటం కలిసి వచ్చే అంశం.

Modi Elon Musk Meeting

నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB) స్థలానికి సంబంధించిన వివరాలతో టెస్లాను అధికారులకు ఒక ప్రతిపాదన చేసింది. అంతకుముందు అమెరికా పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్ తమ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కూడా కలిసి ప్లాంట్ ఏర్పాటుపై ఆహ్వనించారు. తాజాగా మోడీ మస్క్‌ సమావేశం తరువాత ప్లాంట్ ఏర్పాటుపై ముందడుగు పడింది.

More from DriveSpark

Article Published On: Sunday, February 23, 2025, 7:20 [IST]
English summary
Tesla reportedly talks with andhra pradesh for factory site in india full details check here
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+