Tesla Car plant: భారత్‌లోని ఆ రాష్ట్రంలో టెస్లా తయారీ ప్లాంట్.. త్వరలో ఎలాన్ మస్క్ అధికారిక ప్రకటన.!
టెస్లా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. అయితే భారత్‌లో టెస్లా (Tesla) సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడంపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. అయితే చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో భారత్‌లో టెస్లా తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
గుజరాత్‌కు ఎలాన్ మస్క్? : గుజరాత్ గాంధీనగర్‌లో వెబ్రంట్ గుజరాత్ సమ్మిట్ (Vibrant Gujarat summit 2024) జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎలాన్ మస్క్ పాల్గొంటారని, భారత్‌లో తమ కార్యకలాపాలపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గుజరాత్‌లోనే టెస్లా తన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రధాని అమెరికా పర్యటనలో.. : భారత్‌లో తమ ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా సంసిద్ధంగా ఉన్నా.. కొన్ని కారణాలతో ఏర్పాటులో ఆలస్యం జరిగింది. అయితే ఈ సంవత్సరం జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో సమావేశమై భారత్‌లో టెస్లా కార్యకలాపాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సంవత్సరంలో తాను భారత్‌లో పర్యటిస్తానని, టెస్లా ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన చేస్తానని వెల్లడించారు. అనంతరం నవంబర్‌లో కేంద్ర వాణిజ్య శాఖ అమెరికా పర్యటన సందర్భంగా కాలిఫోర్నియాలోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. టెస్లా సేవలను కొనియాడారు.

సనంద్‌లో టెస్లా తయారీ ప్లాంట్ : కొన్ని నివేదికల ఆధారంగా భారత్‌లో టెస్లా తన తొలి ప్లాంట్‌ను గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే టాటా మోటార్స్ తయారీ ప్లాంట్‌ను కలిగి ఉంది. మారుతి, MG మోటార్స్ ప్లాంట్‌లు కూడా గుజరాత్‌లో ఉన్నాయి.
అందుబాటులో ఉన్న టెస్లా కార్లు ఇవే : అయితే తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ సహా మరిన్ని రాష్ట్రాలు టెస్లాను ఆహ్వానించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్లా అనేక మోడల్ కార్లను విక్రయిస్తోంది. టెస్లా మోడల్ 3, మోడల్ S, మోడల్ Y, మోడల్ X కార్లను విక్రయిస్తోంది.

భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకోసం ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నా.. అనేక కారణాలతో కొలిక్కి రాలేదు. అయితే అధిక దిగుమతి సుంకాల కారణంగా టెస్లా తన ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్ విక్రయించడం లేదు. అయితే భారత ఎలక్ట్రిక్ మార్కెట్‌పై ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ఎలక్ట్రిక్ వాహనం, బ్యాటరీ టెక్నాలజీ పరంగా భారత్ అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








