పిల్లలకు కార్ బ్రాండ్ పేర్లను పెట్టిన తల్లిదండ్రులు

నా పేరు 'ఆడి', మా అన్న పేరు 'ఫార్చ్యూన్' (టొయోటా ఫార్చ్యూనర్), మా తమ్ముడి పేరు 'పోర్షే', మా చిట్టి చెల్లి పేరు 'మినీ', పెద్దక్క పేరు 'ఫోక్స్‌వ్యాగన్', చిన్నక్క పేరు 'ఫియట్' అని పిల్లాడు తన ఫ్యామిలీని మనకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది. ఇదేంటి పిల్లలకు కార్ల పేరు పెట్టారు, ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా..? థాయ్‌లాండ్‌కు వెళితే ఈ కుటుంబం మనకు కనిపిస్తుంది.

థాయ్‌లాండ్‌కు చెందిన డ్యుయాంగ్‌చాంక్ వాంగ్‌వితయాస్కుల్ (29) అనే మహిళకు చాలా కాలంగా పిల్లలు కలగలేదు. అయితే, గత మే నెలలో ఆమె ఏకంగా ఒకేసారి ఒకే సమయంలో ముగ్గురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలు, ముగ్గురు మగ పిల్లలు జన్మించటం థాయ్‌లాండ్‌లో ఇదే ప్రప్రథమం.


కాగా.. ఈ ముగ్గురు పిల్లలకు ఆమె తన ఫేవరెట్ కార్ బ్రాండ్ పేర్లను పెట్టడటం జరిగింది. వారి పేర్లు వరుసగా ఆడి, ఫార్చ్యూన్, పోర్షే, మినీ, ఫోక్స్‌వ్యాగన్, ఫియట్ అనే మారు పేర్లను తన పిల్లలకు పెట్టినట్లు ఆమెను ఉటంకిస్తూ బ్యాంకాక్ పోస్ట్ ప్రచురించింది. ఈమె మే నెలలో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ, వారిని కొంత కాలం వరకూ ప్రజలకు చూపించకూడని నిర్ణయించుకుంది.

థాయ్ సాంప్రదాయం ప్రకారం, జన్మ ధృవీకరణ పత్రాల్లో నమోదు చేసిన పేర్లు కాకుండా పల్లకు సాధారణంగా మారు పేర్లు, ముద్దు పేర్లను పెట్టడం జరుగుతుంది. కాలక్రమంలో వారి అసలు పేర్లకు బదులు మారు పేర్లు/ముద్దు పేర్లే స్నేహితులు, బంధువుల్లో పాపులర్ అవుతాయి. మరి ఈ ఆరుగురు పిల్లల పేర్లు కూడా ఇకపై కార్ల పేర్లుగా మరిపోతాయేమో..!

More from DriveSpark

Article Published On: Monday, July 9, 2012, 13:26 [IST]
English summary
According Bangkok Post report, a Thai parents has named their children with their favourite car brands Audi, Fortune (Toyota Fortuner), Porsche, Mini, Volkswagen and Fiat. Duangchanok Wangwitthayaskul, 29, delivered six children this May. The sextuplets three girls and three boys are the first born in Thailand.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+