మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

ప్రముఖ దక్షిణాది నటుడు అజిత్ కుమార్ సినీరంగంలో తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అజిత్ వాలిమై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు 90% పూర్తయింది. ఈ చిత్రం వినోద్ దర్శకత్వంలో, బోనీ కపూర్ నిర్మాతగా తెరకెక్కనుంది.

మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

అజిత్ నటిస్తున్న ఈ 'వాలిమై' చిత్రం అప్డేట్స్ కోసం అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నటుడు అజిత్ యొక్క కొత్త ఫోటో ఒకటి విడుదలైంది. ఈ ఫోటోలో అజిత్ జాకెట్ ధరించిన అభిమానితో నిలబడి ఉండడాన్ని మీరు చూడవచ్చు.

మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, ఈ ఫోటో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో తీసినట్లు తెలుస్తుంది. తలా అజిత్ వారణాసి రోడ్డు పక్కన ఉన్న షాపులో తినడానికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో తీసినట్లు చెబుతారు. ఈ ఫోటోకు సంబంధించి రకరకాల సమాచారం వెలువడింది.

MOST READ:ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

ఇటీవల అజిత్ బైక్ ద్వారా సిక్కిం వెళ్ళాడు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం భూటాన్, టిబెట్ మరియు నేపాల్ సరిహద్దుల్లో ఉంది. ఈ సుందరమైన ఈ ప్రాంతానికి అజిత్ బైక్ మీద వెళ్లినట్లు సమాచారం. సిక్కిం వెళ్లే దారిలో తలా అజిత్ తన బైక్‌ను వారణాసిలో పార్కింగ్ చేసి రోడ్డు పక్కన ఉన్న షాపులో కనిపించాడు.

మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

ఒక అభిమాని అజిత్ ని గుర్తించి అతనితో ఫోటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో బాగా వైరల్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ మధ్య దూరం 2,400 కిలోమీటర్లు.

MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..

మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

అజిత్ తన పర్యటనలో మొత్తం 4,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. ఈ పర్యటనకి సంబంధించి మరింత సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ విధంగా బైక్ పై వెళ్లడం అజిత్ కి కొత్తేమీ కాదు, ఇంతకుముందు తలా అజిత్ చాలాసార్లు ఈ విధంగా ప్రయాణించారు.

మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

అజిత్ కుమార్ అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ వెల్తూ ఉంటాడు. అజిత్ దాదాపు ఒక నటుడుగా మాత్రమే అందరికి తెలుసు, కానీ దేశంలో అత్యుత్తమ బైక్ రైడర్స్ లో ఒకరు అన్న విషయం చాలామందికి తెలియదు. అజిత్ అనేక లగ్జరీ కార్లు మరియు స్పోర్ట్స్ బైక్‌లు కలిగి ఉన్నారు.

MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు

మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

అజిత్ కుమార్ ఒక్క తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగు భాషలోని సినిమాలలో కూడా నటించాడు. కావున తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అజిత్ కి ఎక్కువమంది అభిమానులు ఉన్నారు.

Most Read Articles

English summary
Thala Ajith Seen With Fan On The Way To Sikkim Journey. Read in Telugu.
Story first published: Tuesday, January 19, 2021, 15:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X