ధర రూ.2 కోట్ల లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేసిన దళపతి విజయ్‌.. షోరూంను తలపించిన కార్‌ కలెక్షన్‌..!

హీరో విజయ్‌.. పరిచయం అవసరం లేని పేరు. కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనిరేషన్‌ తీసుకుంటున్న అగ్రనటుల్లో ఒకరిగా (Actor vijay) ఉన్నాడు. కోలీవుడ్‌ సహా టాలీవుడ్‌లోనూ దళపతి విజయ్‌ ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే విజయ్‌ నటించిన లియో చిత్రం విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.

చాలా మంది సెలబ్రిటీల తరహాలోనే హీరో విజయ్‌కు కూడా లగ్జరీ కార్లంటే ఆసక్తి, ఇప్పటికే అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. తాజాగా దళపతి విజయ్‌ కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారును (Actor vijay buys First EV) కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ i7 లగ్జరీ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను (BMW i7 EV) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయ్‌ తొలి ఈవీ కారు ఇదే కావడం గమనార్హం.

actor vijay

BMW i7 EV ప్రారంభ ధర రూ.2.13 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అయితే వేరియంట్‌ను బట్టి దీని ధరలో మార్పులు ఉండనున్నాయి. బీఎండబ్ల్యూ i7 ఎలక్ట్రిక్‌ సెడాన్‌ 101.7 kWh లిథియం అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ సెడాన్‌ రెండు యాక్సిల్స్‌పై రెండు చొప్పున ఎలక్ట్రిక్‌ మోటార్లను కలిగి ఉంటుంది. ఈ మోటార్లు 544bhp శక్తి, 745Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బీఎండబ్ల్యూ i7 రేంజ్‌ : ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ కారు సింగిల్‌ ఛార్జింగ్‌తో 591 కి.మీ నుంచి 625 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. ఈ బీఎండబ్ల్యూ సెడాన్‌ గరిష్ఠ వేగం గంటకు 239 కి.మీగా ఉంది. ఈ లగ్జరీ కారు కేవలం 4.7 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంటుంది.

bmw i7

హీరో విజయ్‌ కొనుగోలు చేసిన ఈవీ 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 14.9 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు కర్వడ్ డిస్‌ప్లేతో వస్తాయి. అమెజాన్ ఫైర్‌ టీవీ ప్రసారాల కోసం 31.3 అంగుళాల 8K స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది. వెనుకవైపు ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, క్లైమేట్‌ కంట్రోల్‌, సిటింగ్‌ను నియంత్రించేందుకు 5.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది.

హీరో విజయ్‌ గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లున్నాయి. బీఎండబ్ల్యూ i7 సెడాన్‌ సహా రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ Evoque, ఆడి A8L, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ X6, బీఎండబ్ల్యూ 5 సిరీస్‌, బీఎండబ్ల్యూ 3 సిరీస్‌, మెర్సిడెస్ బెంజ్‌ GLA, బెంజ్‌ E350D, ఫోర్డ్‌ Mustang, వాల్వో Xc90, మినీ కూపర్‌ సిరీస్‌, మారుతి సుజుకి సెలెరియో, టయోటా ఇన్నోవా, క్రిస్టా వంటి లగ్జరీ కార్లున్నాయి.

thalapathi-vijay-bmw-i7

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 23, 2024, 12:13 [IST]
English summary
Thalapathy vijay ads bmw i7 electric sedan to his garage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+