మితిమీరిన అభిమానం.. ఫ్యాన్స్‌ అత్యుత్సాహానికి విజయ్‌ కారు అద్దాలు ధ్వంసం, వీడియో వైరల్‌

దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ రాష్ట్రానికి వచ్చిన అభిమాన నటుడి(Vijay Kerala Fans)కి ఫ్యాన్స్‌ అదిరిపోయే వెల్‌కమ్‌ చెప్పాలని చూశారు. ఆ అత్యుత్సాహం కాస్తం వైలెంట్‌గా మారింది. చివరికి ఆ నటుడు ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమైపోయాయి. ఆ హీరో విజయ్‌. జరిగిన సంఘటన కేరళలో. పూర్తి సమాచారం ఈ కథనంలో..

కేరళలో తెలుగు, తమిళ నటుల(Vijay Fans Damaged Car)కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి కేరళలో సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆ తర్వాత అంతటి అభిమానులు ఉన్న నటుడు తమిళ్‌ నటుడు విజయ్‌. అక్కడ విజయ్‌కు ఎంత క్రేజ్‌ అంటే.. విజయ్‌ సినిమా రిలీజ్‌ అయిందంటే.. లోకల్‌ సినిమాలు రిలీజ్‌ చేయడానికే భయపడేంత..

Kerala-Visit-Thalapathy-Vijay-Cas-Damaged

అంతటి క్రేజ్‌ ఉన్న విజయ్‌.. చివరిసారిగా షూటింగ్‌ నిమిత్తం 2010 లో కేరళకు వెళ్లారు. పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ తాజాగా GOAT సినిమా చిత్రీకరణ కోసం కేరళకు వెళ్లారు. విజయ్‌ రాక గురించి తెలుసుకున్న అభిమానులు.. అతనికి వెల్‌కమ్‌ చెప్పేందుకు పెద్ద ఎత్తన తరలివెళ్లి గుమిగూడారు. దీంతో ఒక్కసారి ఫ్యాన్స్‌ విజయ్‌ కారు మీదకు పడటంతో.. కారు దెబ్బతింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

GOAT సినిమా షూటింగ్(Vijay GOAT Movie Shooting) కోసం విజయ్‌ సోమవారం కేరళ రాష్ట్రానికి వెళ్లారు. విమానంలో చెన్నై నుంచి బయలుదేరి తిరువనంతపురం చేరుకుని అక్కడి నుంచి కారులో షూటింగ్ లొకేషన్‌కు చేరుకున్నారు. విజయ్‌ రాక గురించి తెలుసుకున్న కేరళ అభిమానులు దళపతిని చూసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా రద్దీ నెలకొంది.

Kerala-Visit-Thalapathy-Vijay-Cas-Damaged

ఊహించని రీతిలో వచ్చిన అభిమానుల్ని చూసి కేరళ పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో విజయ్‌ ప్రయాణిస్తున్న కారు జనం మధ్యలో కదులుతుండగా.. చాలా మంది అభిమానులు కారును వెంబడించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియోలలో ఒకదానిని పరిశీలించినట్లయితే.. ఒక అభిమాని బైక్‌పై తనను వెంబడించడం చూసి రోడ్డు చూసి నడపమని సూచిస్తాడు.

ఈ సందర్భంలో రోడ్డుపై విజయ్‌ ప్రయాణిస్తున్న టయోటా ఇన్నోవా హైక్లాస్ కారు అభిమానుల మధ్య ఇరుక్కుపోవడంతో కారును చుట్టుముట్టారు. దీంతో కారు భారీగా దెబ్బతింది. అభిమానుల గుంపు మధ్యలో నటుడు విజయ్ కారు ఇరుక్కుపోయి దెబ్బతినడాన్ని సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Kerala-Visit-Thalapathy-Vijay-Cas-Damaged

అభిమానుల రద్దీని పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా ఈ వీడియోలో పేర్కొన్న కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ గురించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది. కేరళలో నటుడు విజయ్ టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారులో ప్రయాణించారు. ఇది ZX టాప్ వేరియంట్. ఈ కారు 7 సీట్ల సీటింగ్‌తో ఉంటుంది.

కాగా ఈ కారును దాని యజమాని నవంబర్ 28, 2023న కేరళలోని తిరువనంతపురంలోని RTOలో నమోదు చేసుకున్నారు. ఈ కారు ధరకు సంబంధించి, తిరువనంతపురంలో ఆన్-రోడ్ ధర రూ. 38.66 లక్షలుగా ఉంది. ఈ కారును హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ కారు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌ రెండింటితో ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్‌ పనిచేస్తుంది.

ఇంజిన్ విషయానికొస్తే, టయోటా ఇన్నోవా హైక్రాస్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ కారులో 1987 cc పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ కారు. ఈ కారు ఇంజిన్ 183.72 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్‌ విషయానికొస్తే, లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 19, 2024, 13:55 [IST]
English summary
Thalapathy vijays car damaged by his fans after massive turnout in kerala viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+