కాబోయే భార్య కోసం ఖరీదైన కారును కొనుగోలు చేసిన అంబానీ కుమారుడు
ఇండియాలో అత్యధిక లగ్జరీ కార్లు ఉన్న ఫ్యామీలి అంబానీ కుటుంబం. ముఖేష్ అంబానీ ఫ్యామీలి వద్ద సుమారుగా 100కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. కోట్ల రుపాయలు విలువ చేసే ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నా... ఆ కుటుంబం
ఇండియాలో అత్యధిక లగ్జరీ కార్లు ఉన్న ఫ్యామీలి అంబానీ కుటుంబం. ముఖేష్ అంబానీ ఫ్యామీలి వద్ద సుమారుగా 100కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. కోట్ల రుపాయలు విలువ చేసే ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నా... ఆ కుటుంబం ఇంకా సంతృప్తి చెందలేదు.

దీంతో మార్కెట్లోకి ఇటీవల విడుదలైన భారతదేశపు అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసింది. అసలు అంబానీ కుటుంబం ఈ కారును ఇంత ప్రత్యేకంగా ఎందుకు తీసుకుందో... దీని వెనుకున్న ప్రత్యేకత గురించి.. ఓ లుక్కేసుకుందాం రండి.

అంబానీ లగ్జరీ కార్ల జాబితాలోకి వచ్చి చేరిన కొత్త కారు గురించి తెలుకునేందుకు ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ ఉపయోగిస్తున్న బెంట్లీ బెంట్యాగా గురించి తెలుసుకోవాలి. బ్రిటీష్ రేసింగ్ గ్రీన్ పెయింటింగ్ మరియు డబ్ల్యూ12 ఇంజన్ గల ఈ బెంట్లీ బెంట్యాగా ఎస్‌యూవీ ధర ఇండియాలో రూ. 3.85 కోట్లుగా ఉంది.

సమాచార వర్గాల కథనం మేరకు, అంబానీ ఫ్యామిలీ బెంట్లీ కంపెనీకి చెందిన మరో లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. వెహికల్ రిజిస్ట్రేషన్ సమాచారం ప్రకారం గత నెలలో రిజిస్టర్ అయినట్లు తెలిసింది.

ఖరీదైన కారును కొనుగోలు చేసిన అంబానీ ఫ్యామిలీ తమ సొంత అవసరాలకు కాకుండా, ఆకాశ్ అంబానీ కాబోయ్ భార్య శ్లోకా మెహ్తాకు నిశ్చితార్థం రోజున ఈ ఖరీదైన బెంట్లీ కారును కానుగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ పుకారును నిజం చేస్తూ శ్లోకా మెహ్తా నూతన బెంట్లీ ఎస్‌యూవీలో ప్రయాణిస్తూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కింది.

కారు విషయానికి వస్తే, ఇందులో వి8 ఇంజన్ తెలిసింది. కానీ, ఆకాశ్ వాడుతున్న బెంట్లీ ఎస్‌యూవీలో శక్తివంతమైన డబ్ల్యూ12 ఇంజన్ ఉంది. దీని ధర రూ. 3.78 కోట్లుగా ఉంది, డబ్ల్యూ12 మోడల్ కంటే కొన్ని లక్షలు మాత్రమే తక్కువ.

అంబానీ ఫ్యామిలీలోకి వచ్చి చేరిన రెండవ బెంట్లీ బెంట్యాగా ఎస్‌యూవీలోని 4.0-లీటర్ వి8 ఇంజన్ గరిష్టంగా 542బిహెచ్‌పి పవర్ మరియు 770ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆకాశ్ వాడుతున్న ఎస్‌యూవీలోని ఇంజన్ 600బిహెచ్‌పి పవర్ మరియు 900ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బెంట్లీ బెంట్యాగా ఎస్‌యూవీలో అత్యంత ఖరీదైన ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకించి, రెండు కోట్ల రుపాయల విలువైన బ్రెట్లింగ్ మల్లినర్ టర్బిలిన్ గడియారం ఉంది. అంతే కాకుండా, 21-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ వేరియంట్ ఎంచుకుంటే మరో 16 లక్షలు అదనం అవుతుంది.

ఆకాశ్ అంబానీ, ఆయన ఫియాన్సీ ఇద్దరూ బెంట్లీ ఎస్‌యూవీలను వినియోగిస్తున్నారు. భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపార వేత్త కుమారుడు ఇలాంటి కార్లను కలిగి ఉండటం ఆయన స్థాయికి పెద్ద లెక్కేం కాదనుకోండి.
Source: Cartoq



Click it and Unblock the Notifications








