అమెరికా అధ్యక్షుడి కారులోకి గాలి కూడా దూరదు.. 8 అంగుళాల మందంతో డోర్లు, టైర్లు పేలినా వేగంగా వెళ్లగలదు..!!

మన దేశ రాష్ట్రపతి లేదా ప్రధాని మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తుల విదేశీ పర్యటనలకు వెళ్లేముందు ఆయా దేశాల్లోని మన రాయబార సంస్థలు కూడా అక్కడి సెక్యూరిటీని ముందుగానే అంచనా వేసి అక్కడి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాయి. ఆ తర్వాత అధికారికంగా వారి పర్యటన ఖరారు అవుతుంది. ముందుగానే నిర్ణయించిన టూర్ ప్రకారం పర్యటన సాగుతుంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు సిద్ధం చేయబడతాయి.

భారత్‌లో జరుగబోయే జీ-20 సదస్సులో పాల్గొనేేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రానున్నారు. సెప్టెంబర్‌ 7 నుంచి 10వ తేది వరకు ఈ సదస్సు జరగనుంది. అయితే అమెరికా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఆ దేశ సెక్యూరిటీ సిబ్బంది జో బైడెన్‌కి గట్టి భద్రతను కల్పించనున్నారు. ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణం నుంచి పర్యటన ముగిసే వరకు భద్రతా ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తారు.

The-Beast-Car

అదే విధంగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు విచ్చేస్తున్న వివిధ దేశాల అధిపతులకు అదనపు భద్రతా కల్పించేందుకు ఆయా దేశాల రక్షణ విభాగం అధికారులతో భారత సెక్యూరిటీ బృందాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. అగ్ర దేశ అధినేత భద్రత కీలకం కాబట్టి చాలా పకడ్బంది ఏర్పాట్లు ఉంటాయి. అందులో భాగంగానే ఆయన కోసం ఉపయోగించే ప్రత్యేక మిలటరీ కారుని ఆ దేశ రక్షణ విభాగం భారత్‌కి పంపింది. ఆ వివరాలు మీకోసం..

అమెరికా అధ్యక్షుడి భారత పర్యటనలో భాగంగా "ది బీస్ట్" అనే ప్రత్యేక బుల్లెట్ ఫ్రూఫ్ కారులో జో బైడెన్ ప్రయాణించనున్నారు. ఈ కారు ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఆపత్కాళంలో టియర్ గ్యాస్ ని విడుదల చేసే అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఈ కారు సొంతం. ఇంకా ఈ కారులో మరిన్నీ అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

Joe-Biden-Car

ప్రస్తుతం ఈ కారు ఢిల్లీ పురవీధుల్లో సంచరిస్తోంది. దీనికి సంబధించిన భద్రతా టెస్టింగ్స్‌ని అమెరికా సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు అంతర్జాతీయంగా పర్యటించిన ప్రతిసారీ అమెరికా నుంచి తన వ్యక్తిగత వాహనాన్ని దిగుమతి చేసుకుని అక్కడి పరిస్థితులను చెక్ చేసి అధికారికంగా ధ్రువీకరిస్తారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి కారును 'ది బీస్ట్' అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే సురక్షితమైన వాహనంగా పేర్గాంచింది.

పేలుడు పదార్థాలు, బుల్లెట్లను తట్టుకునే బుల్లెట్ ఫ్రూఫ్ రక్షితమైన రవాణా సాధనంగా ఈ కారు ప్రత్యేకతలను కలిగి ఉంది. "ది బీస్ట్"ను కాడిలాక్ తయారు చేసింది. ఇది ప్రస్తుతం సాయుధ లిమోసిన్ మోడల్. దీనిలోని అసాధారణ భద్రతా ఫీచర్లతో పోలిస్తే ఇతర వాహనాల కంటే ఈ భద్రతా కారు విభన్నంగా ఉంటుంది.

ఇక 'ది బీస్ట్' బయటి భాగంలో 5 అంగుళాల మందంతో మిలిటరీ-గ్రేడ్ కవచం ఉంటుంది. అలాగే కారు డోర్లు 8 అంగుళాల మందంతో ఉండనున్నాయి. ఈ వాహనం మొత్తం బరువు బోయింగ్ 757 జెట్ క్యాబిన్ డోర్‌తో సమానంగా ఉండనుంది. ఈ కారు తలుపులు మూసుకున్న తర్వాత అందులోకి కనీసం గాలి కూడా చొరబడదు.ఈ విధంగా రసాయన దాడులను సైతం ఈ కారు తట్టుకోగలదు.

కారు కిటికీలు ఒకే సైజులో ఉండి.. గాజు, పాలికార్బోనేట్ ఐదు పొరలతో ఉంటుంది. బుల్లెట్ షాట్లను సులువుగా తట్టుకోగల శక్తి వీటికి ఉంది. బాంబు దాడులను సైతం తట్టుకునేలా ఈ కారును రూపొందించారు. అదనపు స్టీల్ ప్లేట్లతో దీని ఛాసిస్‌ని బలంగా తయారు చేశారు. దాడి లేదా పేలుడు వల్ల టైర్లు దెబ్బతీసినప్పుడు, కారు డ్రైవింగ్ కొనసాగించే సామర్థ్యం ఈ కారుకి ఉంటుంది.

'ది బీస్ట్'లో నలుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. దీనిలో ప్రతి ఒక్కరికోసం సపరేట్ గ్లాస్ పార్టిషన్‌ కూడా ఉంది, ఈ కారు స్విచ్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఈ ప్రత్యేక స్విచ్ అధ్యక్షుడి నియంత్రణలో మాత్రమే ఉంటుంది. దీనితో ఆయన అదనపు గోప్యత, భద్రతకు సంబంధించిన తగిన సూచనలను చేస్తారు. ఈ ఫీచర్లతో పాటు, వాహనం ట్రంక్‌లో అగ్నిమాపక వ్యవస్థ కూడా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 5, 2023, 16:22 [IST]
English summary
The beast all you need to know about us president joe bidens car safety features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+